Junior Movie Public Talk : జూనియర్ మూవీ పబ్లిక్ టాక్.. అదరగొట్టిన గాలి కిరీటి రెడ్డి
ప్రధానాంశాలు:
Junior Movie Public Talk : జూనియర్ మూవీ పబ్లిక్ టాక్.. అదరగొట్టిన గాలి కిరీటి రెడ్డి
Junior Movie Public Talk : kireeti మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ అంటే తెలియని వారు ఉండరు..అలాంటి గాలి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ మూవీ తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. రాధాకృష్ణ రెడ్డి డైరెక్షన్లో శ్రీలీల sreeleela హీరోయిన్ గా దేవి శ్రీ Devi Sri prasad మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ సినిమాలో భాగం కావడం తో సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది ‘వైరల్ వయ్యారి’ అంటూ సాంగ్ ప్రోమో ఎప్పుడైయతే రిలీజైందో.. శ్రీలీల పక్కన ఎవడ్రా ఆ కుర్రాడు కత్తిలా డ్యాన్స్ చేశాడు అంటూ కిరీటి గురించి మాట్లాడుకోవోడం మొదలుపెట్టారు. అదే విధంగా ప్రమోషన్ ను కూడా గట్టిగానే చేసి సినిమా పై మరింత ఆసక్తి పెంచారు. మరి ఆసక్తి తగ్గట్లు సినిమా ఉందా..? కిరీటి రెడ్డి హీరోగా సెట్ అవుతాడా..? శ్రీలీల ఖాతాలో హిట్ పడ్డట్లేనా అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.
జూనియర్ మూవీ ఫుల్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Junior Movie Review

Junior Movie Public Talk : జూనియర్ మూవీ పబ్లిక్ టాక్.. అదరగొట్టిన గాలి కిరీటి రెడ్డి
Junior Movie Public Talk : జూనియర్ పబ్లిక్ టాక్.. కిరాక్ పుట్టించిన కిరీటి రెడ్డి
జూనియర్’ సినిమా కథ కొత్తదేమీ కాదు. తండ్రి ప్రేమను అర్థం చేసుకోవడంలో కొడుకు ఎదుర్కొనే సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. కానీ దర్శకుడు కథను ఆసక్తికరంగా మలచి, ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగాడు. ముఖ్యంగా మొదటి భాగంలో కామెడీ, రెండవ భాగంలో ఫాదర్-సన్ ఎమోషన్స్ బలంగా కనెక్ట్ అయ్యాయి. జెనీలియా ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరిగింది. కథలో సోది లేకుండా కథను క్రమంగా నడిపించడంలో దర్శకుడి విజయంగా చెప్పొచ్చు అని సినిమా చూసిన ప్రేక్షకులు అంటున్నారు.హీరో యాక్టింగ్ గురించి..కిరీటి తొలి సినిమా అయినప్పటికీ, ఆయన నటనలో కొత్తతనం కనిపించలేదు. చాల సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నట్లే చేసాడు. డాన్సులు, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నింటిలోనూ అదరగొట్టాడు.
ముఖ్యంగా “వైరల్ వయ్యారి”తో పాటు మరికొన్ని పాటల్లో కిరీటి ఎనర్జీకి ప్రేక్షకులు స్పందించిన తీరు చూస్తే, నటుడిగా మంచి భవిష్యత్ ఉందని చెప్పవచ్చు. శ్రీలీల పాత్ర పరిమితమైనా, తన స్థాయిలో నటించింది. జెనీలియా మాత్రం తన రీఎంట్రీలో మంచి ఇంపాక్ట్ కలిగించింది. సినిమాటోగ్రఫీ విభాగంలో సెంథిల్ కుమార్ పనితనం స్పష్టంగా కనిపించింది. సినిమాకి కావలసిన రిచ్ లుక్‌ను అందించడంలో విజువల్స్ బాగా సహకరించాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాక్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణంగా నిలిచాయి. ఎడిటింగ్ కూడా కాంపాక్ట్‌గా ఉండి, సినిమాను బోర్ లేకుండా ముందుకు నడిపించడంలో సక్సెస్ అయ్యింది. నిర్మాణ విలువలు హైగా ఉండడం సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి. ఓవరాల్ గా చెప్పాలంటే జూనియర్ కథ పాతదే అయినా కిరీటి ఫెర్ఫామెన్స్, ఎమోషనల్ డ్రైవ్, టెక్నికల్ వాల్యూస్ సినిమాను ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా నిలిపాయి అని చెపుతున్నారు. ఓవరాల్ గా పబ్లిక్ టాక్ బట్టి చూస్తే జూనియర్ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ కొట్టినట్లే అని తెలుస్తుంది.
