Junior NTR : అత్యంత దరిద్రమైన తప్పు చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ .. సరిజేసుకోకపోతే కెరీర్ అట్టర్ ఫ్లాప్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Junior NTR : అత్యంత దరిద్రమైన తప్పు చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ .. సరిజేసుకోకపోతే కెరీర్ అట్టర్ ఫ్లాప్ !

 Authored By prabhas | The Telugu News | Updated on :13 April 2023,5:00 pm

Junior NTR ; ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళుతున్నారు. అయితే ఎన్టీఆర్ తన సినిమాల పరంగా కొన్ని తప్పులను సరి చేసుకోవాల్సి ఉంది లేకపోతే కెరీర్ అట్టర్ ప్లాప్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. మనకు తెలిసిందే ఇటీవల స్టార్ హీరోల పాత సినిమాలు రీ రిలీజ్ అయి అత్యధిక వసూళ్లను సాధిస్తున్నాయి. చాలా రోజుల క్రిందట పవన్ కళ్యాణ్ జల్సా, మహేష్ బాబు పోకిరి లాంటి సినిమాలు రీ రిలీజ్ అయి వసూళ్ల పరంగా రికార్డ్స్ బ్రేక్ చేశాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాంచరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయి ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టింది.

Junior NTR big mistake on that movie

Junior NTR big mistake on that movie

అయితే గత నెల ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘ ఆంధ్రావాలా ‘ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా ఘోరమైన వసూళ్లతో ఎన్టీఆర్ పరువు తీసేసింది. అసలు ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాను విడుదల చేయవద్దని చెప్పిన ఎవరు వినలేదు. ఎన్టీఆర్ కూడా దీనిని పట్టించుకోలేదు. దీంతో ఆంధ్రావాలా సినిమా మరోసారి థియేటర్లలో విడుదలై చెత్త రికార్డ్స్ ను సృష్టించింది. అయితే వచ్చే నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ సింహాద్రి ‘ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

అదే రోజు ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ ‘ ఆది ‘ కూడా రిలీజ్ అవుతుంది. ఇలా ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజ్ అయితే అభిమానులు ఏ సినిమా చూడాలో అర్థంకాక డైలమాలో పడతారు. ఇలాంటి టైంలో సినిమాకు అత్యధిక వసూళ్లు రావు. ఇదంతా స్టార్ హీరోల అభిమానులకు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. మరోసారి ఎన్టీఆర్ ట్రోలింగ్ కి గురి అవుతారు. అందుకే ఎన్టీఆర్ రంగంలోకి దిగి ఏదో ఒక సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తే బాగుంటుందని, లేదంటే మరోసారి ఎన్టీఆర్ పరువు పోతుందని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ బర్త్డే రోజు ఏ సినిమా రిలీజ్ అవుతుందో చూడాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది