JR NTR : జూనియర్ ఎన్టీఆర్ హీరో కాబట్టే ఈ సినిమాలన్నీ హిట్ సాధించాయా..?
JR NTR : ఎన్టీఆర్ హీరో కాబట్టే ఈ సినిమాలన్నీ హిట్ సాధించాయా..? డబుల్ హ్యాట్రిక్ హిట్స్ దక్కాయా అంటే అవుననే చెప్పాలి. నందమూరి నట వారసుడిగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాత రక్తం తనలో ఉంది..ఆ శక్తే తన శక్తికి కారణం అని చెప్తూ ఉంటాడు. అందుకే, ఫ్లాప్ అనుకున్న సినిమాలు కూడా హిట్ సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చెప్పాలంటే తారక్ ఖాతాలో ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ సినిమాలు చేరాయి. ఈ మధ్యకాలంలో డబుల్ హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన ఒకే ఒక్క తెలుగు హీరో తారక్. పూరి దర్శకత్వంలో వచ్చిన టెంపర్, సుక్కూ రూపొందించిన నాన్నకు ప్రేమతో, కొరటల జనతా గ్యారేజ్, బాబు దర్శకత్వంలో తారక్ త్రిపాత్రాభినయం చేసిన జై లవ కుశ, త్రివిక్రమ్మ్ తో చేసిన అరవింద సమేత, ఇటీవల దర్శక ధీరుడు రూపొందించిన ఆర్ఆర్ఆర్.
ఇవన్నీ ఎన్టీఆర్ హిట్ లిస్టులో ఉన్న సినిమాలు. సూపర్ హిట్స్ అంటున్న ఈ సినిమాలు నిజంగా ఎన్టీఆర్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీసా అంటే.. ఏటూ చెప్పలేని పరిస్థితి. ఒక్క టెంపర్ సినిమా తప్ప నిజంగా మిగిలిన సినిమాల్లో తారక్ కాకుండా మరో హీరో అయితే హిట్ టాక్ తెచ్చుకునే అంత సత్తా ఉండేది కాదేమో.దీనిని బట్టి చూస్తే కేవలం తార వల్లే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించాయి అనుకోవాలి. ఈ 5 సినిమాల్లో కథ కాస్త వీక్ గానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కానీ లేదా సెకండ్ హాఫ్ కానీ ఎదో ఒక భాగంలో మూవీ డౌన్ అవుతుంది. అలాంటి చోటే ఎన్టీఆర్ తన యాక్టింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేసి సినిమాలని హిట్ చేశాడు.
JR NTR : మొదటిసారి తారక్ బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ యాక్షన్ చిత్రాలు..
కావాలంటే ఒకసారి జై లవ కుశ సినిమా చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఎన్టీఆర్ కాకుండా ఇంకెవరైనా చేసినా… సినిమాలో ఎన్టీఆర్ అంత అద్భుతంగా నటించక పోయినా ఈ సినిమాల రిజల్ట్ ఖచ్చితంగా తేడా కొట్టేదనే టాక్ చాలా మంది అన్నదే. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక్క కొమురం భీముడో సాంగ్ చూస్తే చాలు ఆర్ఆర్ఆర్ సక్సెస్‌లో తారక్‌కు ఎంత క్రెడిట్ ఇవ్వొచ్చో అర్థమవుతుంది. కాగా, మొదటిసారి తారక్ బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ యాక్షన్ చిత్రాలను చేస్తున్నారు. ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోతుంటే మరొకటి ప్రశాంత్ నీల్ రూపొందించబోతున్నాడు. కేవలం ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.