Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎన్టీఆర్ 30 అనే టైటిల్ తోనే పిలుస్తున్నారు. సినిమాకు ఇంకా టైటిల్ అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమాకు ‘ దేవరా ‘ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. సాధారణంగా కొరటాల తన సినిమాలకు చాలా పవర్ఫుల్ గా ఉండే టైటిల్స్ ని పెడుతుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాకి కూడా
Junior NTR new movie Devara
మంచి పవర్ఫుల్ టైటిల్ పెట్టాడని తెలుస్తుంది. యాక్షన్ ఫిలిం గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవర అని పవర్ ఫుల్ టైటిల్ పెట్టారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ మూవీ మేకర్స్ కు ఈ టైటిల్ నచ్చితే దీనిని అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆస్కార్ అవార్డు ప్రజెంటేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికా వెళ్లారు. అక్కడినుంచి రాగానే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా అందాల తార శ్రీదేవి
కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది. ఇటీవల ఆమె బర్త్డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఆ లుక్ లో జాన్వి కపూర్ ఎంతో అందంగా హార్ట్ నెస్ గా కనిపించింది. ఈ సినిమాకి ఈమె హైలెట్ కాబోతుందని ఆ పోస్టర్ తో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి దేవర అని టైటిల్ పెట్టడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే టైటిల్ తో ఈ సినిమా ముందుకెళుతుందా లేదా? టైటిల్ ని మారుస్తారా అనేది వేచి చూడాలి. అయితే ఎన్టీఆర్ కి ఈ టైటిల్ కరెక్ట్ గా సూట్ అయిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
Ration Card : తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చేస్తుండడం మనం గమనిస్తూనే ఉన్నాం.…
Hyderabad Public School : హైదరాబాద్ నగరంలోని Hyderabad Begumpet బేగంపేట, రామంతపూర్ ప్రాంతాల్లో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్…
Married Woman : ఆడబిడ్డలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా కామాంధులు తగ్గడం లేదు.…
Flying Taxi : టెక్నాలజీ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో చైనా పౌర విమానయాన విభాగం (Civil Aviation Administration…
fine rice distribution తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్…
HCA And SRH : గత కొద్ది రోజులుగా సన్ రైజర్స్, sunrisers hyderabad హెచ్సీఏ HCA మధ్య వివాదం…
LPG Gas : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "దీపం-2 పథకం" కింద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరుగుతోంది. ఈ…
Fine Rice : హైదరాబాద్ ఖైరతాబాద్ సర్కిల్-7 పరిధిలోని 81 రేషన్ షాపుల పరిధిలో సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది.…
This website uses cookies.