Jr NTR : సోషల్ మీడియా ని షేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ కొడుకు .. ఈ వయసులోనే టాప్ హీరోలకి వణుకు పుట్టిస్తున్నాడు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jr NTR : సోషల్ మీడియా ని షేక్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ కొడుకు .. ఈ వయసులోనే టాప్ హీరోలకి వణుకు పుట్టిస్తున్నాడు..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 April 2023,9:00 am

Jr NTR : ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ కన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఐకాన్ స్టార్ బన్నీ భార్య అల్లు స్నేహ, సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇలా చాలామంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు భార్గవ్ రామ్ గురించి న్యూస్ వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ భార్గవ్ రామ్ పేరుని ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు.

Junior NTR son shook the social media

Junior NTR son shook the social media

 

మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరు కొడుకులు. వాళ్ల చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఎన్టీఆర్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంతో అద్భుతమైన పెయింటింగ్ వేసి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇంత చిన్న వయసులో అంత టాలెంట్ ఉందా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ భార్గవ్ రామ్ పేరును ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోని ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తోంది. ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సింది కానీ కొన్ని కారణాల వలన ఆగిపోతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం. వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల చేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది