K Raghavendra Rao : శ్రీకాంత్ కుమారుడు సెట్‌లో అలా ప్రవర్తిస్తాడు.. గుట్టు విప్పిన డైరెక్టర్, హీరోయిన్

Advertisement

K Raghavendra Rao : శ్రీకాంత్ వారసుడిగా రోషన్.. సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నిర్మలా కాన్వెంట్ అంటూ మొదటిసారి తెరకు పరిచయమయ్యాడు. కానీ అది అంతగా సక్సెస్ కాలేదు. నాగార్జున సైతం ఆ చిత్రానికి సాయం చేశాడు. కానీ సక్సెస్ కాలేకపోయింది. అందుకే చాలా గ్యాప్ ఇచ్చిన రోషన్.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తాపత్రయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, శ్రీకాంత్ కాంబోలో పెళ్లి సందడి ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే.

K Raghavendra Rao And Sreeleela About Roshan
K Raghavendra Rao And Sreeleela About Roshan

మళ్లీ నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు శ్రీకాంత్ కుమారుడు రోషన్ రాబోతోన్నాడు. తాజాగా పెళ్లి సందడి టీం మొత్తం కూడా సుమ క్యాష్ షోకు గెస్టుగా వచ్చింది. ఆ సమయంలో రోషన్ గురించి సుమ ఓ ప్రశ్న అడిగింది. అందంగా ఉన్నావ్.. నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? అని సుమ అడిగింది. నేను చేశాను.. నాకు కూడా చేశారు అని సుమకు చెప్పుకొచ్చాడు రోషన్. అయితే రోషన్ గురించి రాఘవేంద్ర రావును సుమ అడిగింది. సెట్‌లో ఎలా ఉంటాడు? అని అడిగింది.

Advertisement
K Raghavendra Rao And Sreeleela About Roshan
K Raghavendra Rao And Sreeleela About Roshan

హీరోయిన్‌ను గిల్లిన రోషన్ K Raghavendra Rao

అల్లరి చేస్తాడు.. హీరోయిన్‌ను గిల్లడం, ఆమెను ఏడిపించడం వంటివి బాగానే చేస్తాడు అని కే రాఘవేంద్రరావు సంచలన కామెంట్స్ చేశాడు. ఇక హీరోయిన్ శ్రీ లైల సైతం.. అదే మాటలు చెప్పింది. చాలానే చేశాడు అని శ్రీ లీల అనడం.. ఏం చేశాను అని రోషన్ ఆశ్చర్యపోయాడు. మొత్తానికి రోషన్ మాత్రం సెట్‌లో బాగానే అల్లరి చేసినట్టు కనిపిస్తోంది. పెళ్లి సందడితో రోషన్‌కు ఓ హిట్ పడేలానే ఉంది. మరి నాటి మ్యాజిక్‌ను రిపీట్ చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

K Raghavendra Rao And Sreeleela About Roshan
K Raghavendra Rao And Sreeleela About Roshan

Advertisement
Advertisement