K Raghavendra Rao : హీరోయిన్ తో రోషన్ లిప్ కిస్ లు అదరగొట్టేసాడు .. సుమ కొడుకుపై కె.రాఘవేంద్రరావు ఫన్నీ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

K Raghavendra Rao : హీరోయిన్ తో రోషన్ లిప్ కిస్ లు అదరగొట్టేసాడు .. సుమ కొడుకుపై కె.రాఘవేంద్రరావు ఫన్నీ కామెంట్స్..!

 Authored By anusha | The Telugu News | Updated on :16 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  K Raghavendra Rao : హీరోయిన్ తో రోషన్ లిప్ కిస్ లు అదరగొట్టేసాడు .. సుమ కొడుకుపై కె.రాఘవేంద్రరావు ఫన్నీ కామెంట్స్..!

K Raghavendra Rao : యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతుల కుమారుడు రోషన్ కనకాల ‘ బబుల్ గమ్ ‘ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవికాంత్ పేరేపు ఈ సినిమాను దర్శకత్వ వహించారు. డిసెంబర్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే చిత్ర ప్రచారంలో భాగంగా శుక్రవారం హైదరాబాదులో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో రానా దగ్గుబాటి పాల్గొని ట్రైలర్ను విడుదల చేశారు. అయితే ఈ బబుల్ గమ్ సినిమాలో లిప్ లాక్ సీను చాలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో హీరోయిన్లు తమ కెమిస్ట్రీతో రొమాంటిక్ సీన్లను ఇరగదీశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆడేస్తుందని రాఘవేంద్రరావు అన్నారు.

సుమా మొహం ఆనందంతో అప్పుడే వెలిగిపోతుందని, బబుల్ గమ్ సినిమా చాలా హిట్ అవుతుంది అని, బబుల్ గమ్ మెల్లగా ఉబ్బి ఉబ్బి టపాల్ మని పేలుతుంది. అలానే ఈ సినిమా టాక్ కూడా మెల్లగా అలా స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో ఎండ్ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది అని అందులో హీరో హీరోయిన్లు కెమిస్ట్రీ చాలా బాగుంది అని రాఘవేంద్రరావు అన్నారు. సినిమాలో ముద్దు లేకపోతే ఆడదని టాక్ బయట ఉంది. ఇందులో చాలా సార్లు హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకున్నారు. కాబట్టి చాలా బాగా ఆడుతుంది. అందరికీ నా శుభాకాంక్షలు అని రాఘవేంద్రరావు అన్నారు. అయితే ముద్దులు చాలా సార్లు పెట్టుకున్నారు.

కాబట్టి సినిమా చాలా బాగా ఆడుతుందని రాఘవేంద్రరావు అనగానే ఒక్కసారి అరుపులు, నవ్వులు వినిపించాయి. సుమ, రాజీవ్ కనకాల దంపతులు కూడా దర్శకేంద్రుడి చమత్కారానికి పగలబడి నవ్వారు. ఇక సినిమాలో హీరోయిన్లను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దిట్ట. అంతేకాదు హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ తెరపై ఆవిష్కరించడం లోను ఆయనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. ఇక హీరోయిన్లను పండ్లతో కొట్టే రాఘవేంద్రరావు స్టైల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన ప్రస్తుతం విరామం తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు సినిమా ఈవెంట్లలో గెస్ట్ గా కనిపిస్తున్నారు. ఆ సమయంలో సినిమాల్లో సన్నివేశాలు హీరో హీరోయిన్లను ఉద్దేశించి ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది