Roshan Kanakala Bubble Gum Movie Review : రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్
ప్రధానాంశాలు:
Roshan Kanakala Bubble Gum Movie Review : రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం బబుల్ గమ్ మూవీ
Roshan Kanakala Bubble Gum Movie Review : Gum Movie Review , బబుల్ గమ్ మూవీ రివ్యూ , బబుల్ గమ్.. అంటే చాలామందికి తెలుసు. టైమ్ పాస్ కోసం చాలామంది దాన్ని నోట్లో వేసుకొని నములుతూ ఉంటారు. దాన్ని నోట్లో నుంచి బయటికి తీస్తే చాలు.. అతుక్కుపోతుంది. అందుకే దాన్ని మింగకుండా బయట ఊసేస్తారు. ప్రముఖ తెలుగు యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా వస్తున్న మూవీ పేరు బబుల్ గమ్. రోషన్ కు ఇది డెబ్యూ మూవీ. సుమ కొడుకు కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అలాగే.. ఇది యూత్ కు కనెక్ట్ అయ్యే మూవీ. అందుకే ఈ మూవీపై ప్రేక్షకులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మించింది. న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల అయింది.
ఈ సినిమాకు రవికాంత్ పేరేపు డైరెక్టర్. ఈ మూవీని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. రోషన్ కు జోడిగా మానస చౌదరి హీరోయిన్ గా నటించింది. మానస చౌదరి తెలుగు అమ్మాయే. కానీ.. చెన్నైలో పుట్టి పెరిగింది. తనకు కూడా ఇది డెబ్యూ మూవీనే. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ డైరెక్టర్. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందించాడు. ఈ సినిమాలో వైవా హర్ష, కిరణ్ జి రాయబాగి, అనన్య ఆకుల, అను హాసన్, జైరామ్ ఈశ్వర్, బిందు చంద్రమౌళి ముఖ్య పాత్రల్లో నటించారు. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల లాంటి సినిమాలకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన మూవీ బబుల్ గమ్. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని తాజాగా రోషన్ కనకాలతో ఈ మూవీ తీశాడు రవికాంత్.
Roshan Kanakala Bubble Gum Movie Review : సినిమా కథ
ఈ సినిమాలో రోషన్ పేరు ఆది. హైదరాబాద్ కుర్రాడు. హీరోయిన్ మానస చౌదరి పేరు జాన్వీ. ఆదికి డీజే అవ్వాలని కోరిక ఉంటుంది. అందుకోసమే రోజూ పబ్ కు వెళ్తుంటాడు. ఒక డీజే దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తుంటాడు. ఒక రోజు పబ్ లో జాన్వీని చూస్తాడు. చూసి ఇష్టపడతాడు.. ప్రేమిస్తాడు. రోజూ తననే ఫాలో అవుతుంటాడు. అయితే.. జాన్వీ రిచ్ కిడ్. తనకు లవ్ అన్నా.. రిలేషన్స్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు. అబ్బాయిలను పెద్దగా పట్టించుకోదు. కానీ.. ఆది మాత్రం తనను లవ్ లో పడేస్తాడు. కానీ.. ఆ తర్వాత ఇద్దరి మధ్య చాలా సమస్యలు వస్తాయి. ఇద్దరిదీ డిఫరెంట్ మైండ్ సెట్ కావడంతో చాలా సమస్యల్లో చిక్కుకుంటారు. వాటిని ఇద్దరూ ఎలా పరిష్కరించుకున్నారు? తిరిగి ఇద్దరూ ఒక్కటయ్యారా? అనేదే అసలు సినిమా కథ.
Roshan Kanakala Bubble Gum Movie Review : విశ్లేషణ
ఈ సినిమా కథ ఏంటో టీజర్, ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాలో కిస్ సీన్లు, ఇతర రొమాంటిక్ సీన్లు బాగానే ఉంటాయి. అది ట్రైలర్ లోనే తెలిసిపోయింది. ఇక.. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా కామెడీతోనే సాగుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక.. ఈ సినిమా ఎక్కువగా యూత్ కు కనెక్ట్ అవుతుంది. యూత్ బాగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. నిజానికి ఈ సినిమాలో యూత్ కి ఒక మంచి మెసేజ్ ఉంటుంది. అందుకే ఈ సినిమా యూత్ కు బాగా నచ్చుతుంది. యూత్ కు నచ్చేలా కిస్ సీన్లు కూడా బాగానే ఉంటాయి. ఇక.. ఈ సినిమాలో మనం చెప్పుకోవాల్సింది సుమ కొడుకు రోషన్ గురించి. రోషన్ ఈ సినిమాలో చాలా ఈజ్ తో నటించాడు.
అసలు తనకు ఇది తొలి సినిమా అనే భయం ఏమాత్రం లేకుండా ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన అనుభవం ఉన్న నటుడిగా చాలా ఈజ్ తో ఈ సినిమాలో నటించేశాడు. కొన్ని కొన్ని సీన్లలో మన నాచురల్ హీరోలు గుర్తుకు తెప్పిస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ మానస చౌదరి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో తన అందంతో ప్రేక్షకులను మానస మెస్ మరైజ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. యూత్ కూడా తనను చూసి ఫిదా అవుతారు. కుర్రాళ్లను తన అందంతో మానస కట్టిపడేస్తుంది. తను కూడా తెలుగమ్మాయే కావడంతో తనకు కూడా తొలి సినిమానే అయినా చాలా ఈజ్ తో ఈ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. ఈ సినిమాలో తను జాన్వి పాత్రలో కనిపిస్తుంది. ఫ్యాషన్ డిజైనర్ గా కనిపిస్తుంది. ఈ సినిమా కంటే ముందు తను ఒక వెబ్ సిరీస్ లో నటించింది అంతే.
ప్లస్ పాయింట్స్
రోషన్, మానస నటన
ఇంటర్వెల్ బ్యాంగ్
రివేంజ్ డ్రామా
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
జిలేబీ పాట
మైనస్ పాయింట్స్
ఫస్ట్ హాఫ్
మిస్ అయిన క్లారిటీ