K. Raghavendra Rao : రాఘవేంద్రరావును అంత మాటన్న స్టార్ హీరో.. ఎవరో తెలుసా?
K. Raghavendra Rao : తెలుగు చిత్రసీమలో కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అగ్రదర్శకుడిగా ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన నటుడిగా ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న వారిల్లో కొందరిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వెండితెరకు పరిచయం చేశాడు. ఇకపోతే రాఘవేంద్రరావును ఇండస్ట్రీ అంతా గౌరవిస్తుండగా, ఆ హీరో మాత్రం ఓ సారి అంత మాటన్నాడట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. K. Raghavendra […]
K. Raghavendra Rao : తెలుగు చిత్రసీమలో కమర్షియల్ సినిమాకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అగ్రదర్శకుడిగా ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. ఇటీవల ఆయన నటుడిగా ‘పెళ్లి సందD’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న వారిల్లో కొందరిని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వెండితెరకు పరిచయం చేశాడు. ఇకపోతే రాఘవేంద్రరావును ఇండస్ట్రీ అంతా గౌరవిస్తుండగా, ఆ హీరో మాత్రం ఓ సారి అంత మాటన్నాడట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
K. Raghavendra Rao : సీనియర్ ఎన్టీఆర్ దర్శకేంద్రుడిని అలా పిలిచేవారు..
సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా మేకింగ్‌లో తనదైన శైలి కనబరుస్తారు. ఆయన సినిమాల్లో హీరోయిన్స్ చాలా అందంగా కనబడుతుంటారు. కె.రాఘవేంద్రరావు… బీఏ.. అనగానే అందరూ బొడ్డు మీద యాపిల్ అనేంతలా ఆయన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ప్రజెంట్ జనరేషన్ టాలీవుడ్ స్టార్ హీరోస్, హీరోయిన్స్ కూడా రాఘవేంద్రరావును గౌరవిస్తుంటారు.విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నట రత్న నందమూరి తారక రామారావు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పలు చిత్రాల్లో నటించాడు. దర్శకేంద్రుడి దర్శకత్వంలో మోహన్ బాబు సైతం పలు సినిమాలు చేశారు.
అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ చివరగా నటించిన ‘మేజర్ చంద్రకాంత్’సినిమాకూ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం విశేషం. కాగా, ఓ సందర్భంలో కలెక్షన్ కింగ్, విద్యావేత్త, మాజీ ఎంపీ మోహన్ బాబు.. రాఘవేంద్రరావును ఉద్దేశించి ఆయనకు పొగురు, అహంకారం ఎక్కువని అన్నారు. ‘సౌందర్యలహరి’ కార్యక్రమంలో రాఘవేంద్రరావు తన సినిమాలకు సంబంధించిన విశేషాలను చెప్తుండగా, ఆ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు అప్పట్లో సినిమాలు వరుసగా సక్సెస్ కావడం వల్ల రాఘవేంద్రరావుకు పొగరు, అహంకారం ఎక్కువయ్యాయని అన్నాడు. అయితే, తనకు అటువంటివేవీ లేవని రాఘవేంద్రరావు తెలిపాడు. తనకు కేవలం కోపం మాత్రమే ఎక్కువగా ఉందని, అది ఇతరుల మీద చూపించబోనని రాఘవేంద్రరావు వివరణ ఇచ్చాడు.