Kajal Aggarwal : డైమండ్ లా మెరిసిపోతున్న కాజల్ అందాలు .. చీర కట్టులో అదరహో .. వీడియో !

Authored By aruna | The Telugu News | Published on: December 17, 2023, 1:00 pm
  •  Kajal Aggarwal : డైమండ్ లా మెరిసిపోతున్న కాజల్ అందాలు .. చీర కట్టులో అదరహో .. వీడియో !

Kajal Aggarwal : పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ అందం ఏమాత్రం తగ్గలేదనిపిస్తుంది. రెండు తరాల స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటీ సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీని సంపాదించుకున్నారు. వెండితెర చందమామగా యూత్ ఆడియన్స్ మనసు దోచుకుంటూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలో భాగమయ్యారు. తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ను ప్రేమించి పెళ్లాడిన కాజల్, పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అడపాదడపా సినిమాలు చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా కాజల్ యాక్టివ్గానే కనిపిస్తున్నారు. లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక తాజాగా కాజల్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజాగా కాజల్ అగర్వాల్ కూకట్ పల్లిలోని దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్ నగల షాపు ప్రారంభోత్సవానికి వచ్చారు. ఆమెను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం కాజల్ తెలుగులో సత్యభామ అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్లో బిజీగా ఉండడం వలన రాత్రంతా నిద్ర లేదని అయినా మీకోసం వచ్చేసా అని అభిమానులను ఉద్దేశించి కాజల్ అగర్వాల్ అన్నారు. ఇక షాపు ప్రారంభోత్సవానికి వచ్చిన కాజల్ అగర్వాల్ చీరకట్టులో అదరహో అనిపించారు. చీరలో డైమండ్ల మెరిసిపోతుంది అంటూ నెటిజన్స్కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇటీవల భగవంత్ కేసరి సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం సత్యభామ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ హవా నడిపించాలని కాజల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాజల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ పాపులర్ అవుతున్నారు. తన లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. పెళ్లి అయి ఒక బాబుకు జన్మనిచ్చిన కాజల్ అందం ఏమాత్రం చెక్కుచెదరలేదు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతుంటారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp