బాల్కనీలో.. పొద్దుపొద్దున్నే కాజల్ అందాల విందు..!
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ Kajal Aggarwal ప్రస్తుతం లాక్డౌన్ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోన్నట్టు కనిపిస్తున్నారు. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి ముంబైలో ఫుల్ హల్చల్ చేస్తున్నారు. గతేడాది ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాజల్ Kajal Aggarwal గౌతమ్ పెళ్లి వార్తలు జాతీయ స్థాయిలో ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు.

Kajal Aggarwal Latest Pic Goes VIral
మాల్దీవుల్లో హనీమూన్ సందర్భంగా కాజల్, గౌతమ్ దిగిన ఫోటోలు నెట్టింట్లో మంటపెట్టేశాయి. అలా కాజల్ గౌతమ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేశారు. పెళ్లి తరువాత కాజల్ కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. హాట్ హాట్ ఫోటోలతో అందరినీ ఆకట్టుకుంటోంది. మొన్నీ మధ్యే భర్తతో కలిసి బాల్కనీలో సరసాలు ఆడింది. వాటికి సంబంధించిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.
Kajal Aggarwal : ఉదయం పూట బాల్కనీలో.. కాజల్ రచ్చ
తాజాగా కాజల్ Kajal Aggarwal సూర్యోదయాన్ని చూస్తూ పరవంశిపోతోంది. అలా పొద్దుపొద్దున్నే కాజల్ అందాల విందు చేయడంతో నెటిజన్లు షాక్ అయ్యారు. కాజల్ అగర్వాల్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాజల్ అగర్వాల్ చేతిలో ఇప్పుడు ఆచార్య సినిమా మాత్రమే ఉంది. ఆ మధ్య వచ్చిన తమిళ వెబ్ సిరీస్‌తో కాజల్ పేరు మార్మోగిపోయింది.