Kajal Aggarwal : హీరో రుణం అలా తీర్చుకుంది.. కాజల్ అగర్వాల్ వీడియో వైరల్

Authored By Admin | The Telugu News | Published on: January 20, 2021, 2:18 pm

Kajal Aggarwal : ఓ సినిమాలో కలిసి నటించిన హీరో హీరోయిన్ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడుతుంటాయి. అలా ఏర్పడిన స్నేహబంధాలు కొన్ని చివరి వరకుఉంటాయి. ఇంకొన్ని ఆ సినిమాల వరకే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం సాయం కావాల్సిన ప్రతీసారి వచ్చి అండగా నిలబడుతుంటారు. అలా కాజల్ అగర్వాల్ ఇప్పుడు తన హీరో కోసం వచ్చింది. కాజల్ అగర్వాల్ జయం రవి కలిసి కోమలి అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో అది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే జయం రవి ఇప్పుడు తన కొత్త సినిమాతో అందరినీ పలకరించాడు.

Kajal Aggarwal Shares Video On Jayam Ravi Bhoomi

Kajal Aggarwal Shares Video On Jayam Ravi Bhoomi

జయం రవి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని బాగానే ప్రమోట్ చేసుకున్నాడు. మామూలుగా అయితే ఏ హీరో అయినా అలాంటి స్పెషల్ మైల్ స్టోన్ నెంబర్ సినిమాలపై మరింత దృష్టి పెడతారు. ప్రయోగాలకు వెళ్లకుండా కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటారు. కానీ జయం రవి మాత్రం ప్రయోగాలకు పెట్టింది పేరు. ఎప్పుడూ కొత్త కథా కథనాలను నమ్ముకుని సినిమాలను చేస్తుంటారు. ఇప్పుడు కూడా అంతే ‘భూమి’ అంటూ మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

జయం రవి భూమిని సపోర్ట్ :  కాజల్ అగర్వాల్

భూమి సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియెన్స్ ఓట్లు కూడా పడ్డాయి. అయితే ఈ సినిమాను సామాజిక సందేశం నేపథ్యంలో తెరెక్కించడంతో అన్ని వైపుల నుంచి అభినందనలు వస్తున్నాయి, ఈ క్రమంలో కొంత మంది సెలెబ్రిటీలు కూడా జయం రవి భూమిని సపోర్ట్ చేస్తున్నారు. ఈక్రమంలో కాజల్ అగర్వాల్ ఓ వీడియోను షేర్ చేసింది. కెరీర్‌లో మైలు రాయిగా నిలిచే 25వ చిత్రాన్ని కమర్షియల్ ఫార్మాట్‌లో తెరకెక్కించే వీలున్నా కూడా జయం రవి మాత్రం భూమి వంటి అద్బుతమైన ప్రయోగాన్ని చేశాడంటూ కాజల్ ప్రశంసలు కురిపించింది.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp