Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నం పై కూతురు క్లారిటీ ..!
ప్రధానాంశాలు:
Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నం పై కూతురు క్లారిటీ..
Kalpana : ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం వార్త సినీ పరిశ్రమలో తీవ్ర సంచలనం రేపింది. ఆమె అనారోగ్యంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడం పై అనేక పుకార్లు ఊపందుకున్నాయి. ఈ వార్తలు ఆమె అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. అయితే ఈ ఘటనకు అసలు కారణం కుటుంబ సంబంధిత సమస్యలేనని, ముఖ్యంగా కూతురుతో విభేదాలే దీనికి కారణమని వార్తలు మీడియా లో హైలైట్ కావడం తో అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Kalpana : కల్పన ఆత్మహత్యాయత్నం పై కూతురు క్లారిటీ ..
Kalpana : కల్పన నిద్రమాత్రలు మిగింది..ఎందుకంటే..!
ఈ ఊహాగానాలపై కల్పన కూతురు దయా ప్రసాద్ క్లారిటీ ఇచ్చింది. “నా తల్లి ఎలాంటి సమస్యలతో బాధపడడం లేదు. ఆమె నిద్రలేమి (ఇన్సోమియా) సమస్యతో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు నిద్ర మాత్రలు తీసుకుంటున్నారు. నిన్న రాత్రి ఎక్కువగా తీసుకోకపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు.
Kalpana : మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు – కల్పనా కూతురు క్లారిటీ
అంతే తప్ప ఇది ఆత్మహత్య ప్రయత్నం కాదు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. మా తల్లి, తండ్రి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ కొందరు అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి మా కుటుంబ వ్యవహారాలను వక్రీకరించొద్దు. త్వరలోనే మా తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తారు” అని చెప్పుకొచ్చింది. ఈ ఘటనపై వదంతులను నమ్మొద్దని, ఆత్మహత్యాయత్నం అంటూ దుష్ప్రచారం చేయొద్దని ఆమె వేడుకుంది.