Vijayashanthi : చిరంజీవితో పాటు హీరోలంతా ముసుగు దొంగ‌లు.. విజ‌య‌శాంతి సంచ‌ల‌న కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijayashanthi : చిరంజీవితో పాటు హీరోలంతా ముసుగు దొంగ‌లు.. విజ‌య‌శాంతి సంచ‌ల‌న కామెంట్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Vijayashanthi : చిరంజీవితో పాటు హీరోలంతా ముసుగు దొంగ‌లు.. విజ‌య‌శాంతి సంచ‌ల‌న కామెంట్స్..!

Vijayashanthi : విజ‌య‌శాంతి గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఒక‌ప్పుడు ఆమె ఎంతో మంది స్టార్ హీరోలతో క‌లిసి సంద‌డి చేసింది. లేడి ఓరియెంటెడ్ పాత్ర‌ల‌లో కూడా మెప్పించింది. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. అంతే కాకుండా ఈ జోడికి మోస్ట్ హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు వచ్చింది.ఇక బాలకృష్ణతో విజయశాంతి రిలేషన్ మెయిన్‌టైన్ చేశారనే రూమర్స్ కూడా తెర మీదకు వచ్చాయి. అయితే ఆమె అప్ప‌ట్లో చిరంజీవిపై చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు చర్చ‌నీయాంశం అయ్యాయి. చిరంజీవి రాజకీయాల్లోకి రావడం, ప్రజా సమస్యలపై ఆయన పోరాటం చేయడానికి సంబంధించిన విజయశాంతి అప్పట్లో విమర్శలు చేసింది.

Vijayashanthi  దటీజ్ విజ‌యశాంతి..

దానిపై యాంకర్‌ ప్రశ్నించగా, ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు, ప్రజల తరఫున పోరాడలేనప్పుడు కచ్చితంగా వేలెత్తి చూపిస్తాం. ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను స్పందిస్తానని, వేలెత్తి చూపిస్తానని తెలిపింది విజయశాంతి. ఈ సందర్భంగా ఇండస్ట్రీ గురించి ఆమె స్ట‌న్నింగ్ కామెంట్స్ చేసింది. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పందించాలని సినీ తారలను ఆమె డిమాండ్ చేశారు. వాళ్లు ఇచ్చే డబ్బులతోనే ఇంతటి పారితోషికాలు తీసుకుంటున్నారని తెలంగాణ రాష్ట్రం గురించి స్పందించాలని ఎవరూ ముందుకు రాలేదని, ఎవరూ స్పందించలేదని వాపోయింది.వాళ్లు స్వార్థంతోనే స్పందించలేదని చెప్పింది విజయశాంతి. ఇదే సమయంలో చిరంజీవిపై కూడా విజయశాంతి సెటైర్లు వేశారు.

Vijayashanthi చిరంజీవితో పాటు హీరోలంతా ముసుగు దొంగ‌లు విజ‌య‌శాంతి సంచ‌ల‌న కామెంట్స్

Vijayashanthi : చిరంజీవితో పాటు హీరోలంతా ముసుగు దొంగ‌లు.. విజ‌య‌శాంతి సంచ‌ల‌న కామెంట్స్..!

పార్టీ పెట్టిన వెంటనే సీఎం అయిపోవాలంటే కుదురుతుందా. ఎన్టీఆర్‌లా అందరు అయిపోవాలంటే సాధ్యమవుతుందా?. రామారావుకి గట్స్ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు, ప్రజల కోసం పనిచేశారు. ఎంతో కష్టపడ్డారు. కానీ మీరు అన్ని సుఖాలకు అలవాటు పడి, ఓవర్‌నైట్‌లో సీఎం అవ్వాలంటే ఎలా సాధ్యం. ప్రజల కోసం కష్టపడాలి, డెడికేషన్‌, కమిట్‌మెంట్ ఉండాలంటూ విజయశాంత్ కామెంట్స్ చేశారు డబ్బు వచ్చేయాలి, చైర్‌లో కూర్చోవాలి అంటే అది స్వార్థం అవుతుందని, సేవ చేయలేనప్పుడు రాజకీయాల్లోకి రాకూడదని, హాయిగా సినిమాలు చేసుకోవాలని చెప్పింది విజయశాంతి. పరోక్షంగా ఆమె చిరంజీవిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ఆ రోజుల్లో తీవ్ర‌మైన చ‌ర్చ న‌డిచింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది