Court Heroine Sridevi : మెడలో తాళి బొట్టుతో కోర్టు హీరోయిన్.. సీక్రెట్ పెళ్లి చేసుకుందా..?
ప్రధానాంశాలు:
Court Heroine Sridevi : మెడలో తాళి బొట్టుతో కోర్టు హీరోయిన్.. సీక్రెట్ పెళ్లి చేసుకుందా?
Court Heroine Sridevi : ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని పంచుకుంది. అందులో ఆమె తన బంధువులకు రాఖీలు కడుతున్నట్లు కనిపించింది. అయితే, ఆ వీడియోలో ఆమె మెడలో కనిపించిన పసుపు తాడు ( తాళిబొట్టు ) నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

Court Heroine Sridevi : మెడలో తాళి బొట్టుతో కోర్టు హీరోయిన్.. సీక్రెట్ పెళ్లి చేసుకుందా?
Court Heroine Sridevi : ఎందుకు ఇలా?
సాధారణంగా పసుపు తాడు పెళ్లైన మహిళలే ధరిస్తారు. దీంతో, నెటిజన్లు “శ్రీదేవి ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంది? ఎవరికీ తెలియకుండా చేసుకుందా? వరుడు ఎవరు?” అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కొంతమంది ఇది సినిమా షూటింగ్‌లో భాగం కావచ్చని ఊహిస్తుండగా, మరికొందరు వీడియో చూస్తే ఆమె ఇంట్లోనే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని, షూటింగ్ కాకపోతే పసుపు తాడు ఎందుకు ధరించిందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై శ్రీదేవి స్పందిస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రాదని అభిమానులు చెబుతున్నారు. నిజంగా ఆమె పెళ్లి చేసుకుని ఉంటే, ఆ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచిందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.