Kanguva Movie : 2000 కోట్లు.. కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kanguva Movie : 2000 కోట్లు.. కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

 Authored By ramu | The Telugu News | Updated on :15 November 2024,5:16 pm

ప్రధానాంశాలు:

  •  Kanguva Movie : 2000 కోట్లు.. కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

Kanguva Movie : సూర్య  Hearo Suray లీడ్ రోల్ లో శివ డైరెక్షన్  Shiva లో తెరకెక్కిన సినిమా కంగువ. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంగువ సినిమా పీరియాడికల్ మూవీగా భారీ హైప్ తో వచ్చింది. నవంబర్ 14న గ్రాన్ గా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన కంగువ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఫ్యాన్స్ నిరాశ పడక తప్పలేదు. తమిళ్ లో కొంతమేరకు సినిమాకు పాజిటివ్ టాక్ రాగా మిగతా అన్ని ఏరియాల్లో కంగువ ని చూసి పెదవి విరుస్తున్నారు. ఐతే కంగువ సినిమా విషయంలో నిర్మాతని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా 2000 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుందని నిర్మాత చెప్పడంపై విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి. 2000 కోట్లు కలెక్ట్ చేసే స్టఫ్ సినిమాలో ఉందని నిర్మాత చెప్పాడు.

Kanguva Movie సూర్య బాక్సాఫీస్ సత్తా ఏంటో..

ఇప్పుడు అతని కామెంట్స్ ని అతనికే రివర్స్ లో చెబుతున్నారు. సినిమా కనీసం ఎక్కడ లాసులు లేకుండా నెగ్గుకొస్తుందా అన్న డౌట్ రేజ్ అవుతుంది. సూర్య ఎంత కష్టపడినా కూడా సినిమాకు కలిసి రాలేదు. కంగువ సినిమా అన్ని అంశాల్లో పూర్తిగా నిరాశ పరచింది. తమిళంలో కొందరు సినిమా ను డైరెక్ట్ గా ఏకేస్తున్నారు.

Kanguva Movie 2000 కోట్లు కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Kanguva Movie : 2000 కోట్లు.. కంగువ నిర్మాతని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..!

సూర్య బాక్సాఫీస్ సత్తా ఏంటో చూపించే టైం వచ్చింది. సినిమాకు ఘోరమైన టాక్ రాగా ఈ టాక్ తో ఏమేరకు వసూళ్లను రాబడతారన్నది చూడాలి. సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. కంగువ సినిమా కోలీవుడ్ బాహుబలిగా ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పరిచారు. అన్ని అంచనాలతో వచ్చే సినిమా అసలేమాత్రం మెప్పించకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందారు. ముఖ్యంగా సినిమా ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల సినిమా ఆడియన్స్ కు రీచ్ అవ్వలేదు. ఐతే కోలీవుడ్ లో మాత్రం సినిమాకు ఫస్ట్ డే బాగానే ఆక్యుపెన్సీ వచ్చినట్టు తెలుస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది