Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా...!

Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ విడుదల సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తాను ముంబైలో అడుగుపెట్టినట్లు తెలుపుతూ, ఈ సినిమాకు సంబంధించిన తన మనోభావాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ శుక్రవారం జూన్ 27న కన్నప్ప మీ ముందుకు వ‌స్తోంది. పరమశివుడి గొప్ప భక్తుడి కథను ప్రపంచం వీక్షించనుంది అని ఆయన తెలిపారు.

Kannappa Movie వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

Kannappa Movie : పెద్ద లాసే..

సినిమాపై తనకున్న మమకారాన్ని వివరిస్తూ “నా హృదయం, నా ఆత్మ – నా బేబీ – చివరికి ప్రపంచాన్ని కలవబోతోంది” అంటూ ఉద్విగ్నభరితమైన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమాను అత్యంత శ్రద్ధతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా శివుని పరమభక్తుడైన కన్నప్ప కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు ఆయన సిద్ధమయ్యారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో విష్ణు తన సంతోషాన్ని ఈ విధంగా అభిమానులతో పంచుకున్నారు. ఆయన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ ఈ నెల 27న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచనాల‌తో థియేట‌ర్ల లోకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్లు శ‌ర‌వేగంగా న‌డుస్తున్నాయి. ఇక విష్ణు అయితే ఈ సినిమా పై భారీ న‌మ్మ‌కాలే పెట్టుకున్నాడు. భారీ క్యాస్టింగ్ తో పాటు బిగ్ బ‌డ్జెట్‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయ్యాయి. మ‌రీ ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అమెరికాలో బుకింగ్స్ జోరు మామూలుగా లేదు. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా క‌న్న‌ప్ప సినిమాను 5,400 స్క్రీన్లలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మేము చేసిన మిస్టేక్ వ‌ల‌న ప‌ది నుండి 15 కోట్ల వ‌ర‌కు లాస్ జ‌రిగింద‌ని మంచు విష్ణు అన్నారు.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి