Suman : క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దు..త‌న‌పై కుట్ర చేసిన వారు త‌ప్ప‌క అనుభ‌విస్తార‌న్న సుమ‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Suman : క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దు..త‌న‌పై కుట్ర చేసిన వారు త‌ప్ప‌క అనుభ‌విస్తార‌న్న సుమ‌న్

Suman : ఒకప్ప‌టి టాలీవుడ్ టాప్ హీరో సుమ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న చేసిన సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాక ప్రేక్ష‌కాద‌ర‌ణ తెచ్చిపెట్టాయి.సుమన్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న దేవుడి పాత్రలకే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన ఒక స్టార్‌ స్టేటస్‌లో ఉండాల్సిన సుమన్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారడం వెనుక పెద్ద కథ ఉంది. పెద్ద బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఆయన్ని ఓ కేసులో ఇరికించి ఆరు నెలలు […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 July 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Suman : క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దు..త‌న‌పై కుట్ర చేసిన వారు త‌ప్ప‌క అనుభ‌విస్తార‌న్న సుమ‌న్

Suman : ఒకప్ప‌టి టాలీవుడ్ టాప్ హీరో సుమ‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న చేసిన సినిమాలు మంచి విజ‌యాన్ని అందుకోవ‌డ‌మే కాక ప్రేక్ష‌కాద‌ర‌ణ తెచ్చిపెట్టాయి.సుమన్‌ ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న దేవుడి పాత్రలకే కేరాఫ్‌గా నిలుస్తున్నారు. ఆయన ఒక స్టార్‌ స్టేటస్‌లో ఉండాల్సిన సుమన్‌ ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా మారడం వెనుక పెద్ద కథ ఉంది. పెద్ద బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. ఆయన్ని ఓ కేసులో ఇరికించి ఆరు నెలలు జైల్లో పెట్టిన ఘటన ఉంది. సుమన్‌ కెరీర్‌లో అదొక చేయని మచ్చలా మిగిలింది. లేదంటే ఇప్పుడు చిరు, బాలయ్య, వెంకీ, నాగ్‌ల తరహాలో మంచి స్థానంలో ఉండేవాడు సుమన్‌.

Suman సుమ‌న్ వ్యాఖ్య‌లు ఎవ‌రి గురించి..

తాజాగా సుమ‌న్ అప్ప‌ట్లో త‌ను ప‌డ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు. కావాలనే నన్ను ఇబ్బందుల్లో పడేశారు. అప్పుడు మా అమ్మ కన్నీరు కార్చింది.. అమ్మ పడ్డ కష్టాలు వర్ణనాతీతం.. అయితే కర్మ ఎవరిని వదిలిపెట్టదు.. ఫలితం ఎవరైనా సరే అనుభవించాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎవరో కుట్ర చేశారని అంటూ ఉంటారు. అది ఎవరు అనేది నాకు కూడా తెలియదు. కానీ ఎవరైనా దాని ఫలితాలు అనుభవించాల్సిందే. ఈ ఘటన వల్ల నేను ఇప్పుడు పెద్దగా బాధపడడం లేదు కానీ ఆ సమయంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నాను .ఆరు నెలలు చాలా కష్టంగా ఉండింది. కానీ ఇప్పుడు దాన్ని పెద్దగా నేను పట్టించుకోవడం లేదు. అయితే అమ్మ విషయంలో మాత్రం చాలా బాధ ఉంది.

Suman క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దుత‌న‌పై కుట్ర చేసిన వారు త‌ప్ప‌క అనుభ‌విస్తార‌న్న సుమ‌న్

Suman : క‌ర్మ ఎవ‌రిని వ‌దిలిపెట్ట‌దు..త‌న‌పై కుట్ర చేసిన వారు త‌ప్ప‌క అనుభ‌విస్తార‌న్న సుమ‌న్

ఆ సమయంలో అమ్మ ఏడ్చింది ..ఎంతో స్ట్రగుల్ అయింది.. ఆ ఘటన నాకంటే అమ్మకి ఎక్కువగా దెబ్బ కొట్టింది. ఆమె చాలా కృంగిపోయింది . ఆమె బాధ నేను మరణించేంతవరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది అంటూ వెల్లడించారు సుమన్. ఇక్కడ ఎవరు చేశారనేది తెలియదు, నేను దేనికో ఈ కర్మ అనుభవించాను. అలాగే తనకు ఎవరు చేసినా వాళ్లు కర్మ అనుభవిస్తారు, అది ఎవరినీ వదిలిపెట్టదు అంటూ షాకిచ్చాడు సుమన్‌. ప్రస్తుతం చాలా మందిని చూశాం, ఇలా అనుభవిస్తున్నాడు, ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు, ఆసుపత్రిలో ఇలాంటి స్థితిలో ఉన్నాడు, లేదంటే ఫ్యామిలీ విషయంలో ఇలా అయ్యిందనేది చూస్తుంటాం, వింటుంటాం. అది వాళ్ల కర్మ ఫలం అని, దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు అని వెల్లడించారు సుమన్‌.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది