Suman Comments : సిగ‌రెట్‌, మందు కోసం ర‌జ‌నీకాంత్ మూట‌లు మోశాడంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Suman Comments  : సిగ‌రెట్‌, మందు కోసం ర‌జ‌నీకాంత్ మూట‌లు మోశాడంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్…

Suman Comments  : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఆయ‌న‌కి దేశ వ్యాప్తంగా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న స్టైల్‌కి, న‌డ‌క‌కి అభిమానులు మైమ‌ర‌చిపోతుంటారు. ఈ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు త‌లైవా. అయితే కొద్ది రోజులుగా ర‌జ‌నీకాంత్ 171 మూవీకి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించిన కీల‌క అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌జ‌నీకాంత్ -లోకేష్ చిత్రానికి సంబంధించి త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Suman Comments  : సిగ‌రెట్‌, మందు కోసం ర‌జ‌నీకాంత్ మూట‌లు మోశాడంటూ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్...

  •  జ‌నీకాంత్ ఈ స్థాయికి చేరుకోవ‌డం వెన‌క చాలా క‌ష్టం ఉంది. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో రజినీకాంత్ వ్యక్తిత్వం, ఎలా ఉండేవారు అని చెప్పారు.

Suman Comments  : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ఆయ‌న‌కి దేశ వ్యాప్తంగా విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న స్టైల్‌కి, న‌డ‌క‌కి అభిమానులు మైమ‌ర‌చిపోతుంటారు. ఈ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు త‌లైవా. అయితే కొద్ది రోజులుగా ర‌జ‌నీకాంత్ 171 మూవీకి సంబంధించి అనేక ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కి ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీకి సంబంధించిన కీల‌క అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌జ‌నీకాంత్ -లోకేష్ చిత్రానికి సంబంధించి త‌న సామాజిక మాధ్య‌మం ఎక్స్‌లో ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ పోస్ట‌ర్‌ను పోస్టు చేస్తూ ఏప్రిల్ 22న టైటిల్ రివీల్ చేస‌య‌నున్న‌ట్టు తెలియ‌జేశారు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాతో ర‌జ‌నీకాంత్ త‌న ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్ వేసుకోవడంఖాయంగా చెబుతున్నారు.

అయితే ర‌జ‌నీకాంత్ ఈ స్థాయికి చేరుకోవ‌డం వెన‌క చాలా క‌ష్టం ఉంది. సీనియ‌ర్ న‌టుడు సుమ‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో రజినీకాంత్ వ్యక్తిత్వం, ఎలా ఉండేవారు అని చెప్పారు. ర‌జ‌నీకాంత్‌తో నాకు మంచి అనుబంధం ఉండేది. 1979లో మేమిద్దరం కలిసి అన్నదమ్ముల పాత్రల్లో చేశాం. అప్పటి నుంచి మా మధ్య మంచి బాండింగ్ ఏర్ప‌డింది. ర‌జ‌నీకాంత్ స్టార్‌గా ఉన్న స‌మ‌యంలో నా కోసం న్యాయం మీరే చేయాలి అనే నా సినిమాలో ర గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి సంద‌డి చేశారు. ఇక ఆయ‌న న‌టించిన శివాజి సినిమాలో నేను విల‌న్‌గా చేశాను. ర‌జ‌నీకాంత్ అంటే నాకు ఎప్ప‌టికీ ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఉంటుంది. ఆయనకు మందు తాగే అలవాటు ఉంది. ఆయన తాగేటప్పుడు నన్ను పిలుస్తారు.

అయితే ఆయ‌న మందు తాగుకుంటూ నాకు కోక్ పోస్తారు. అదేంట‌ని అడిగితే నా శ‌రీరం నేను నాశ‌నం చేసుకుంటాను. కాని నీ శ‌రీరం పాడుచేసే నాకు హ‌క్కు లేద‌ని అంటారు. ఇక శివాజి సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఒక క్లైమాక్స్ షూట్ ఎంఎస్ రామయ్య కాలేజ్ లో చేస్తున్నాం.అప్పుడు రజినీకాంత్ నన్ను బిల్డింగ్ మీదకు తీసుకెళ్లి దూరంగా ఉన్న ఒక షాప్ చూపించారు. అక్క‌డ మూటలు మోసాన‌ని తెలిపారు. కండక్టర్ గా చేసిన తర్వాత రాత్రి మూటలు మోసే వాడిని. నా సిగిరెట్లు, మందు ఖర్చుల కోసం ఇలా చేసేవాడిని అని ఆయ‌న నాకు చెప్పుకొచ్చారు. ఆయ‌న ఎంత మందికి సాయం చేసిన ఎప్పుడు కూడా గొప్ప‌ల‌కి పోలేదు. కల్యాణమండపానికి పిలిచి పెళ్లిళ్లు చేసేవాళ్లు. ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ అస్స‌లు లేదు. శివాజీ సినిమాలో నేను ఏదైనా సీన్ లో బాగా చేస్తే.. సుమన్ తినేశావయ్యా.. నాకన్నా బాగా చేశావ్ అని పొగిడేస్తారు అంటూ ర‌జనీకాంత్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు సుమ‌న్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది