Karthika Deepam : వంటలక్క వేస్తున్న నాటకాన్ని చూసిన డాక్టర్ బాబు దీప ని గుర్తుపడతాడా.? ఇక మోనిత పని అయిపోయినట్టేనా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam : వంటలక్క వేస్తున్న నాటకాన్ని చూసిన డాక్టర్ బాబు దీప ని గుర్తుపడతాడా.? ఇక మోనిత పని అయిపోయినట్టేనా…

Karthika Deepam : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.. సోమవారం ఎపిసోడ్ 1467 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… డాక్టర్ బాబు, వంటలక్క దగ్గరికి వెళ్లి ఇక నన్ను వదిలి వెళ్ళిపో నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళు అని డబ్బులు ఇచ్చి ఇక్కడినుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అదంతా చూస్తున్న మౌనిత తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక […]

 Authored By aruna | The Telugu News | Updated on :25 September 2022,9:30 am

Karthika Deepam : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ కాదు.. సోమవారం ఎపిసోడ్ 1467 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… డాక్టర్ బాబు, వంటలక్క దగ్గరికి వెళ్లి ఇక నన్ను వదిలి వెళ్ళిపో నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళు అని డబ్బులు ఇచ్చి ఇక్కడినుంచి వెళ్ళిపో అని చెప్తాడు. అదంతా చూస్తున్న మౌనిత తెగ సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక చివర్లో దీప నవ్వుకుంటూ ఇవి నా భర్త ఇచ్చిన డబ్బులు నాకు ఖర్చు చేసుకునే అధికారం ఉంది. మీకు ఇష్టమైన నగలు వేసుకుంటా.. మీకు ఇష్టమైన చీరలు వేసుకుంటా.. అవి కొనుక్కుంటా డాక్టర్ బాబు అని అంటుండగా.. ఒక్కసారిగా కార్తీక్ కోపం వచ్చి దీపని కొట్టబోతాడు.. అంతలో మౌనిత వచ్చి అదంతా ఆపి తనని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే సౌందర్య వాళ్లు హిమ, శౌర్య దగ్గరికి వెళ్లి వాళ్ళిద్దరిని తిట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చి తీసుకురావాలి అని అనుకుంటారు. కానీ సౌందర్య చెప్పిన మాటల్ని హిమ విని వాళ్లతో రావడానికి ఒప్పుకుంటుంది. కానీ శౌర్య మాత్రం అస్సలు ఒప్పుకోదు మీరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం నేను ఇక్కడి నుంచి దూరంగా పారిపోతాను..

నాయనమ్మ అని చెప్తుంది. ఇక అంతటితో హిమను తీసుకొని సౌందర్య వాళ్లు ఇంటికి వెళ్లి పోతారు. కట్ చేస్తే దీప పూజ చేస్తూ నా శక్తి మేర నేను ప్రయత్నం చేస్తున్నాను దేవుడా నా ప్రయత్నం ఫలించేలా చెయ్యి నా వెనుక నువ్వుండు అని మొక్కుకుంటుంది. తర్వాత వంట చేయడానికి కాలనీ వాళ్ళ దగ్గరికి వెళ్లి వంట చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా.. వాళ్ళు ఒక నాటకం ఈ ప్రోగ్రాంలో వేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉండగా.. దీపకి ఒక ఆలోచన వచ్చి నా భర్తకి గతం గుర్తుకు రావాలి అంటే నా జీవిత చరిత్ర ని నాటకంగా వేస్తే చాలా బాగుంటుంది. అనే ఆలోచించి ఆ కథని వాళ్లకి చెప్తుంది. అప్పుడు వాళ్లు అదంతా విని చాలా బాగుంది కానీ ఇందులో నువ్వు మెయిన్ క్యారెక్టర్ వేస్తే చాలా బాగుంటుంది అని దీపని ఒప్పుకుని ఎలా చేస్తారు. అప్పుడు దీప ఒప్పుకుంటుంది. ఇక దీప ఈ నాటకాన్ని ఎలాగైనా డాక్టర్ బాబుకి చూపించాలి అని చెప్పి తను డాక్టర్ బాబు దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు అని అనగానే… నువ్వు ఇంకా నిన్ను వెళ్ళిపొమ్మని చెప్పాను కదా ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు అని అంటాడు కార్తీక్.

Karthik remembers Deepa after seeing Deepa's play

Karthik remembers Deepa after seeing Deepa’s play

అప్పుడు దీప నేను రేపు కాలనీలో ఒక నాటకం వేస్తున్నాను డాక్టర్ బాబు మీరు అక్కడికి వచ్చి నా నాటకాన్ని చూడాలి అని అంటుంది. నీ భర్త ఎక్కడున్నాడో తెలిసిందా అని కార్తీక్ అడుగుతాడు. అప్పుడు దీప రేపు నేను వేసే నాటకం ని చూస్తే నా భర్త ఎవరో కూడా మీకు తెలిసిపోతుంది అని అనగా… అవునా అయితే నేను వస్తాను నేను చూస్తాను అని చెప్తాడు. సరే డాక్టర్ బాబు అని అక్కడ నుంచి దీప వెళ్ళిపోతుంది. అంతలో మౌనిత వచ్చి ఏంటి కార్తీక్ వంటలక్క ఏదో చెప్పి వెళ్ళిపోతుంది. అని అనగానే అదంతా మౌనితకి చెప్తాడు. అప్పుడు మోనిత కంగారు పడిపోతూ వద్దు కార్తీక్ అది చెప్పిన మాటను ఎందుకు వినాలి నువ్వు వెళ్లొద్దు అని చెప్తుంది. అయితే కార్తీక్ మాత్రం నేను తనకు మాటిచ్చాను రేపు ఆవిడ నాటకంలో భర్త కూడా ఉన్నాడంట ఆయనకు చెప్పి నేను వంటలక్కని దగ్గర చేస్తాను నువ్వు కూడా రా మోనిత అని తనకి చెప్తాడు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మౌనిత ఉంటుంది. ఇక అలా అందరూ నాటకం దగ్గరికి వెళ్తారు. దీప నాటకం వేయడానికి సిద్ధమయి స్టేజ్ పైకి వెళ్తుంది. మౌనిత మాత్రం కార్తీక్ ని అక్కడ్నుంచి ఎలాగైనా తీసుకెళ్లాలి అని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో వేచి చూడాల్సిందే…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది