Karthika Deepam 03 Oct Today Episode : దుర్గ ఇచ్చే ట్విస్టులకు భయపడిపోతున్న మౌనిత… మౌనిత మాటలకు గతం గుర్తు తెచ్చుకున్న కార్తీక్…
Karthika Deepam 03 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1474 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ దీప దగ్గర వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప ఏమైంది డాక్టర్ బాబు నాకు చెప్పండి అని అంటుంది. నువ్వు ఏమనుకోవా వంట లెక్క అని చెప్పబోతూ ఉండగా.. శివ వచ్చి సార్ మీరు నన్ను అడిగారంట కదా అని అనగానే కార్తీక్ ఇందాక లేదు అడిగాను లే ఇప్పుడు అవసరం లేదు.. వెళ్ళు అని అనగానే మీరు కూడా రండి సార్ మేడం మిమ్మల్ని రెండు గంటలు బయట తిప్పుకొని రమ్మన్నారు.. అని అంటూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ మేడం చెప్తే నేను రావాలా ఇకనుంచి వెళ్ళు అనగానే… శివ వెళ్తూ ఉండగా.. దుర్గ ఫోన్ చేసి నువ్వు రెండు గంటల వరకు ఇంటికి రాకు సినిమాకి వెళ్ళు నీకు డబ్బులు కొడతాను అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ ఎవరు ఫోన్ చేసింది అనగానే శివ అంత చెప్తారు.
దుర్గని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఒక్కసారేగా కోపడుతూ అసలేం జరుగుతుంది. అని తన కూర్చున్న కూర్చిని తంతాడు. ఇక తర్వాత శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప కార్తీక్ ని కూల్ చేస్తూ కూర్చోబెట్టుతుంది. అప్పుడు కార్తీక్ నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి ఇదంతా జరుగుతుంటే ఇంతకుముందు కూడా ఇలాగే ఉండేదా.. నేనే గతం మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నానా.. అని దుర్గ పై మోనితపై మండిపడుతూ ఉంటారు. ఇక దీప మీరు స్థిమితంగా ఉండండి అని మంచినీళ్లు ఇచ్చి కూల్ చేస్తుంది. కట్ చేస్తే దుర్గ ప్రశాంతంగా పడుకొని పాటలు పాడుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత వచ్చి దుర్గని చంపాలని ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు దుర్గా ఒక్కసారిగా చూసి ఏంటి బంగారం నన్ను చంపేయాలనుకున్నావా అదే చేస్తే నేను అబద్ధం గా డ్రామా చేసేది నిజమవుతుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఎందుకురా నాకు చుక్కలు చూపిస్తున్నావ్ ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపో అని దండం పెడుతూ ఉంటుంది.

karthika deepam 03 october 2022 full episode
అప్పుడు దుర్గ ఇవన్నీ ఎప్పుడూ ఉండే టెన్షన్స్ ఏ కానీ కార్తీక్ ఏడి అని అడగగానే.. శివ తో బయటికి వెళ్లాడు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ సార్ బయటికి వెళ్ళలేదు ఆ వంటలుక్క దగ్గర ఉన్నాడు. అని చెప్పగానే మౌనిత అక్కడికి వస్తుంది. అప్పుడు కార్తీక్ మోనితపై అనుమాన పడుతూ దీపక చెప్తూ ఉంటాడు. అదంతా విన్న మౌనిత దుర్గాని చంపాలని ఆవేశంగా వస్తుంది. ఇక రాడుతో చంపితే నేను జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అని వీడికి ఒక్కసారి చచ్చిపోయే ఇంజక్షన్ ఇవ్వాలి. అని ఇంజక్షన్ తీసుకొని వచ్చి దుర్గ పడుకుంటే దుప్పటి తీసి ఇంజక్షన్ చేస్తూ ఉండగా.. అంతలో కార్తీక్, దీప వచ్చి అలా చూసి ఏం లేదు అన్నావు కదా వంట లెక్క ఇప్పుడు ఏమంటావు అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత ఇంజక్షన్ పడేసి కంగారుపడుతూ రా కార్తిక్ అని అంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏంటి మౌనిత కంగారు పడుతున్నావు నన్ను రెండు గంటలు తిరిగి రమ్మన్నావు కదా ముందే వచ్చానని కంగారుపడుతున్నావా అని మౌనితపై అనుమాన పడుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు మౌనిత ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు. మీకు సిగ్గు లేదా అని మండిపడుతూ ఉంటుంది.
అప్పుడు దీప, దుర్గా నవ్వుతూ ఒకప్పుడు నువ్వు నామీద లేనిపోనివన్నీ చెప్పి కార్తీక్ నన్ను ఇంట్లో నుంచి పంపించేలా చేశావు. అప్పుడు నీకు సిగ్గు లేదా ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇలా అంటున్నావ్ అని దుర్గ ,దీప కలిసి మౌనితకు గట్టిగా క్లాస్ ఇస్తారు. ఇక దాంతో మౌనిత అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత దుర్గని తిట్టుకుంటూ ఉంటుంది. కార్తిక్ కి ఏమీ చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మౌనిత. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిత దుర్గ గురించి చెప్పబోతూ ఉండగా.. నేను నిన్ను ఏమీ అడగలేదు కదా… అయినా అతను ఎవరు అతనికి నీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉండగా.. మౌనిత ఏడుస్తూ నేనే తప్పు చేయలేదు కార్తీక్ నన్ను నమ్ము అని ఏడుస్తూ ఉండగా… కార్తీక్ కి గతంలో దీప అన్నమాటలు గుర్తుకొచ్చి ఒక్కసారిగా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేను తండ్రిని కాదు అని అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా దీప మౌనిత ఆశ్చర్యపోతూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే…