Karthika Deepam 10 Dec Today Episode : ఇల్లు అద్దె కోసం రుద్రాణిని కలిసిన దీప.. మరోవైపు సౌందర్యను నిలదీసిన శ్రావ్య.. ఆదిత్య కూడా సీరియస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 10 Dec Today Episode : ఇల్లు అద్దె కోసం రుద్రాణిని కలిసిన దీప.. మరోవైపు సౌందర్యను నిలదీసిన శ్రావ్య.. ఆదిత్య కూడా సీరియస్

Karthika Deepam 10 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1219 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏం తినకుండా.. ఏం తాగకుండా.. సౌందర్య, ఆనంద రావు.. ఇద్దరూ అలాగే దీనంగా కూర్చొని ఉంటారు. ఇంతలో శ్రావ్య వచ్చి.. అత్తయ్య బావ గారి గురించి ఆలోచిస్తున్నారా? బావ గారు మనసులో ఏం ఆలోచించారో తెలియదు కానీ.. ఆయన బయటికి వెళ్లడం […]

 Authored By gatla | The Telugu News | Updated on :10 December 2021,9:04 am

Karthika Deepam 10 Dec Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 డిసెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ 1219 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏం తినకుండా.. ఏం తాగకుండా.. సౌందర్య, ఆనంద రావు.. ఇద్దరూ అలాగే దీనంగా కూర్చొని ఉంటారు. ఇంతలో శ్రావ్య వచ్చి.. అత్తయ్య బావ గారి గురించి ఆలోచిస్తున్నారా? బావ గారు మనసులో ఏం ఆలోచించారో తెలియదు కానీ.. ఆయన బయటికి వెళ్లడం వల్ల పోయిన పరువు తిరిగి రాదు కదా.. అనగానే ఇద్దరూ షాక్ అవుతారు. ఉన్న ఆస్తులన్నీ దానం చేసి వెళ్లిపోయారట. అయినా ఆస్తుల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. భవిష్యత్తులో నేను, దీపు గాడి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయమేస్తుంది అంటుంది శ్రావ్య. ఎన్నడూ లేనిది కొత్తగా మాట్లాడుతున్నావు ఏంటి అని అడుగుతాడు ఆనంద రావు. తప్పదు మామయ్య గారు.. ఇప్పటికీ నేను మాట్లాడకపోతే మన బతుకులు ఇలాగే అవుతాయి.

karthika deepam 10 december 2021 full episode

karthika deepam 10 december 2021 full episode

దీపక్క ఎప్పుడు సుఖపడింది అత్తయ్య. 11 ఏళ్లు నరకం అనుభవించింది. కలిసి.. ఇప్పుడు కొన్ని రోజులు కూడా కాలేదు. ఇంతలోనే చూశారు కదా.. ఇవన్నీ.. మళ్లీ దీపక్క కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అని అంటుంది శ్రావ్య. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కాదు సౌందర్యకు. కట్ చేస్తే.. ఇంటిని దీప, పిల్లలూ కలిసి శుభ్రం చేస్తుంటారు. డోర్ ఓపెన్ చేసి.. డాక్టర్ బాబు ఇటు రండి అంటుంది దీప. లోపల ఇల్లు మొత్తం చెత్తగా ఉంటుంది. ఛీ.. ఛీ.. ఈ ఇంట్లో మనం ఉండాలా అని పిల్లలు అంటారు. మనమేంటి.. ఈ ఇంట్లో ఉండటం ఏంటి అంటారు. డాడీ.. ఏంటిది అంటుంది హిమ. మనకేమైంది డాడీ.. అంత పెద్ద ఇల్లు ఉండగా ఇక్కడికి ఎందుకు వచ్చాం అంటుంది హిమ. ఇలాంటి ఇంట్లో ఎందుకు ఉండాలి. వెళ్దాం పదా డాడీ. అవును నాన్నా.. బస్తీలో ఇల్లు అన్నారు. అదేమైంది. ఇక్కడెందుకు ఉండాలి మనం అంటారు. మీకు ముందే చెప్పాను కదా.. డాక్టర్ బాబును ఏం అడగొద్దని అంటుంది దీప.

ఇంతలో డాడీ అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. డాడీ వేస్ట్ అంటూ ఏదేదో మాట్లాడబోతుంది హిమ. డాడీ వేస్ట్ అంటుంది. దీంతో దీప.. హిమను కొట్టబోతుంది. వద్దు అంటాడు కార్తీక్. హిమ చెప్పింది నిజమే దీప. నేను వేస్ట్. వేస్ట్ ఫెలోనే అంటాడు కార్తీక్. నేను ఒక పనికిమాలిన వాడిని. ప్రతిసారి ఏదో ఒక అబద్ధం చెప్పేవాడిని. ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి కూడా అవకాశం లేదు అంటాడు కార్తీక్.

డాక్టర్ బాబు.. మీరే తప్పు చేయలేదు. న్యాయమే చేశారు. జరిగిన తప్పుకు 1000 రెట్లు ప్రాయచిత్తం చేసుకున్నారు అంటుంది దీప. న్యాయం చేశానని నువ్వు అంటున్నావు.. పాపం చేశానని నా మనస్సాక్షి చెబుతుంది.. అంటూ బయటికి వెళ్లబోతాడు కార్తీక్. పిల్లలను తిడుతుంది దీప. మీకు ఏమైందే.. అర్థం చేసుకోండి. మీ వయసు ఉన్న పిల్లలకు కొందరికి తినడానికి తిండి కూడా దొరకదు.. వాళ్లందరితో పోలిస్తే మీరు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు అంటుంది దీప.

మీ వయసుకు అర్థమయ్యేలా అన్నీ చెప్పలేం కదా. మీ నాన్న లేకుండా అత్తమ్మ పెరిగింది కదా కొన్నాళ్లు.. తనను అడుగు ఆ బాధ ఏంటో తెలుస్తుంది. మీ నాన్నకు మీరంటే ఇష్టంరా ప్రాణం తెలుసా.. నాన్నను అలా అనొచ్చా.. తప్పు కదమ్మా అంటుంది. చిన్నపిల్లలు మీరు.. చెప్పింది అర్థం చేసుకోండి. వయసుకు మించి ఆలోచనలు చేయకండి. ప్రశ్నలు వేయకండి. మీకు జ్వరం వస్తే మీ నాన్న భోజనం మానేస్తారు తెలుసా? అంటుంది దీప.

Karthika Deepam 10 Dec Today Episode : కార్తీక్ విషయంలో చిరాకు పడ్డ ఆదిత్య, శ్రావ్య

ఆదిత్య, శ్రావ్య.. ఇద్దరూ చిరాకుగా ఉంటారు. ఆదిత్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఇన్నాళ్లూ అన్నయ్య వళ్ల కుటుంబం మొత్తం నిందల పాలు అయింది. ఇప్పుడు అన్నయ్య ఇల్లు వదిలి పెట్టి వెళ్లడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు ఆదిత్య. అన్నయ్యను వెతుకుతుంటే.. అందరూ చాలా ఇరిటేట్ చేస్తున్నారు అంటాడు ఆదిత్య.

మరోవైపు రుద్రాణి సీన్ లోకి వస్తుంది. తన పనోళ్లు.. అన్ని లెక్కలు చెబుతుంటారు తనకు. ఇంతలో దీప.. గేట్ తీసి లోపలికి వస్తుంది. నా పేరు దీప అని చెబుతుంది. కొత్తగా ఊరికి వచ్చాము. అక్కడ ఖాళీగా ఉన్న ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతుంది. ఎందరు ఉన్నారు మీరు అంటుంది రుద్రాణి. నలుగురం అంటుంది. నా గురించి నీకు ఎవ్వరూ చెప్పలేదా అంటుంది రుద్రాణి.

చెప్పారు కానీ.. నేను అవన్నీ పట్టించుకోలేదు.. అంటుంది. అద్దె ఎంతో చెప్పండి అంటుంది. నువ్వు అద్దె ఇచ్చే పరిస్థితిలో ఉన్నావా? వద్దులే.. నాకు కావాల్సింది కావాల్సినప్పుడు తీసుకుంటాను అంటుంది. పిల్లలు ఉన్నారు అన్నావు కదా.. ఉండండి.. లెక్క తరువాత చూసుకుంటాను అంటుంది రుద్రాణి.

దీప వెళ్లిపోయాక.. ఏంటక్కా అద్దె తీసుకోకుండా ఇల్లు ఇచ్చావా అంటారు పనివాళ్లు. దీంతో నా లెక్కలు నాకు ఉంటాయి లేరా.. ఈత గింజను ఇచ్చి తాటి గింజను తీసుకుంటాను నేను అంటుంది. సరే.. నువ్వు లెక్క చెప్పురా అంటుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది