Karthika Deepam 11 Feb Today Episode : కార్తీక్, దీపకు మళ్లీ పెళ్లి.. ఈ విషయం తెలిసి మోనిత షాకింగ్ నిర్ణయం.. ఇంతలో కార్తీక్, దీపకు మరో షాక్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 11 Feb Today Episode : కార్తీక్, దీపకు మళ్లీ పెళ్లి.. ఈ విషయం తెలిసి మోనిత షాకింగ్ నిర్ణయం.. ఇంతలో కార్తీక్, దీపకు మరో షాక్

 Authored By gatla | The Telugu News | Updated on :11 February 2022,12:00 pm

Karthika Deepam 11 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1273 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలంటే నాకు ఇష్టం. డబ్బు అధికారం అంటే పిచ్చి ఉండేది. అహంకారంతో మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాను. ఈ మేడమ్ మీ గురించి చెబుతుంటే నా బుర్ర తిరిగిపోయింది. అన్నీ ఉన్నా.. ఎందుకు వచ్చారు అని అడగను కానీ.. అన్నీ ఉన్నా ఎంత అనుకువగా ఉన్నారు మీరు, మీ పిల్లలు. నేను ఎందుకు ఇంత రాక్షసత్వంగా ఉన్నానా అని అనిపిస్తోంది. మేడమ్ ఈ చెక్కు నాకొద్దు. ఇక నుంచి వడ్డీ వ్యాపారం కూడా మానేస్తాను అంటుంది రుద్రాణి. వెరీ గుడ్.. ఆ చెక్కు నువ్వే ఉంచుకో. వీలైతే నలుగురు అనాథ పిల్లలను పెంచుకో. వాళ్లను పెంచి పెద్దచేయి.. అంటుంది సౌందర్య.

karthika deepam 11 february 2022 full episode

karthika deepam 11 february 2022 full episode

బాగా చెప్పావు మమ్మీ అంటాడు కార్తీక్. అలాగే.. ఈ ఇల్లు ఆనంద్ కే చెందుతుంది. పెద్దయ్యాక వీడికే ఇచ్చేద్దాం అంటాడు కార్తీక్. అప్పటి దాకా ఈ ఇంటిని అనాథ ఆశ్రమంగా మార్చండి అంటాడు కార్తీక్. దీంతో మీరు ఎంత మంచివాళ్లు అని చెప్పి వస్తాను అని అందరికీ సారీ చెప్పి వెళ్లిపోతుంది రుద్రాణి. ఇంతలో నానమ్మ మేము అక్కడున్నామని నీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది హిమ. హోటల్ లో అప్పారావు ఫోన్ లో మీ నాన్న ఫోటో చూశాను. వివరాలు అడిగితే అన్నీ చెప్పాడు అంటుంది సౌందర్య.

కట్ చేస్తే దీపు గాడు బాగున్నాడా అని అడుగుతాడు ఆదిత్య. ఇంతలో ఇంటి బెల్ మోగుతుంది. వెంటనే శ్రావ్య వెళ్లి డోర్ తీస్తుంది. కార్తీక్, పిల్లలు అందరూ కనిపిస్తారు. దీంతో ఆదిత్య, శ్రావ్య సంతోషానికి గురవుతారు. కొత్తగా ఈ బాబు ఎవరు అని అనుకుంటుంది శ్రావ్య.

శ్రావ్యను వెళ్లి దిష్టి తీయు అని చెబుతుంది సౌందర్య. అందరూ ఇంట్లో సంతోషంగా గడుపుతుంటారు. మరోవైపు హోటల్ ఓనర్ భద్రం, అప్పారావు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటారు. అప్పారావు చాలా మూడీగా ఉంటాడు. ఏమైందిరా అంటాడు. బావ లేకుంటే ఎలాగో ఉంది సార్ అంటాడు.

అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. నా మనసు అంతా ఏదోలా ఉంది సార్.. అంటాడు. వాళ్లు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేశారురా అంటాడు భద్రం. ఏది ఏమైనా గొప్పోళ్లు గొప్పోళ్లే సార్ అంటాడు అప్పారావు. గొప్పదనం అంటే ఏంటి సార్. మనింట్లో వాళ్లకు కష్టాలు వస్తే పోరాడటం గొప్పదనం కాదు సార్ అంటాడు అప్పారావు.

Karthika Deepam 11 Feb Today Episode : ఇండియాకు వచ్చానంటూ మోనితకు ఫోన్ చేసిన తన బాబాయి

అందుకే నేను ఇక్కడ ఉండను సార్.. హైదరాబాద్ వెళ్లిపోతాను సార్. అక్కా బావలతోనే ఉంటాను. సినిమాల్లో ట్రై చేస్తా అంటాడు అప్పారావు. రౌడీ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడుగుతాడు కార్తీక్. బాగానే ఉంది నాన్న.. అంటుంది శౌర్య. నాకు అందరినీ చూశాక చాలా హ్యాపీగా ఉంది అంటుంది శౌర్య.

మరోవైపు అరుణ వచ్చి మోనిత ఇంట్లో పని చేస్తుంటుంది. అరుణను చూసి షాక్ అవుతుంది మోనిత. నువ్వు పని చేస్తున్నావేంటి.. విన్నీ ఏది అని అడుగుతుంది. విన్నీ ఏదో పని ఉండి బయటికి వెళ్లింది అంటుంది. అందుకే నేను చేస్తున్నాను అంటుంది అరుణ.

ఇంతలో తన బాబాయి ఫోన్ చేస్తాడు. ముంబైలో ఉన్నా అంటాడు. ఈ బాబాయిని చూడటానికి వస్తావా అని అడుగుతాడు. దీంతో సరే.. వీలు చూసుకొని వస్తా అంటుంది మోనిత. కాఫీ తాగుతూ.. ఎందుకు బాబాయి ఇండియాకు వచ్చాడు అని టెన్షన్ పడుతుంది.

మరోవైపు ఆనంద్ తెగ ఏడుస్తూ ఉంటాడు. దీంతో ఆనంద్ ను ఎత్తుకొని ఓదార్చుతూ ఉంటుంది సౌందర్య. అస్సలు ఏడుపు ఆపడు. నానమ్మా వీడు చాలా తెలివైనోడు. వీడు ఎలా ఏడుపు ఆపుతాడో తెలుసా అని అంటుంది హిమ. ఇంతలో కార్తీక్ వస్తాడు. డాడీ ఒకసారి తమ్ముడిని ఎత్తుకో అంటుంది హిమ. కార్తీక్ ఎత్తుకోగానే ఆనంద్ ఏడవడం ఆపేస్తాడు.

మరోవైపు లక్ష్మణ్ ను పిలిచి కార్తీక్ ను వెతికేందుకు వెళ్లమని చెబుతుంది మోనిత. తాడికొండలో కార్తీక్ ఉన్నాడని.. అతడిని వెతకాలని కొంత డబ్బు ఇస్తుంది మోనిత. మరోవైపు అందరూ సంతోషంగా ఇంట్లో గడుపుతూ ఉంటారు. ఏంటి మీ ఆనందం అంటుంది సౌందర్య. పిల్లలు ఇద్దరూ ఎక్కువగా ఆనంద్ తోనే ఆడుతూ ఉంటారు.

నానమ్మ.. తమ్ముడిని బాగా చూడు.. నాన్నలాగే ఉంటాడు కదా అంటుంది శౌర్య. మరోవైపు కార్తీక్, దీపను రెడీ చూసి ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేస్తారు ఇంటి సభ్యులు. అప్పుడే అక్కడికి వచ్చిన మోనిత.. చప్పట్లు కొడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది