Karthika Deepam 13 Oct Today Episode : కలిసిపోయిన కార్తీక్, దీప… ఇక మౌనిత ఏం చేయబోతుందో చూడాలి…!
Karthika Deepam 13 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1482 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… సౌర్య, గండ, చంద్ర వాళ్ళ అమ్మానాన్నల గురించి మౌనిత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. శౌర్య తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే వారణాసి కార్తీక్ కి అంతా చెప్తూ ఉంటాడు. కార్తీక్ గతం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వారణాసి మీరు గతం మర్చిపోవడం ఏంటి డాక్టర్ బాబు అంటూ.. అందుకే మాకు మీరు బ్రతికున్న ఈ ఆచూకీ లేకుండా పోయింది. మీకోసం అమ్మగారు, అయ్యగారు ఎంత ఏడ్చారో తెలుసా.. ఇక సౌర్యమ్మ అయితే పిచ్చిదానిలా తిరుగుతుంది. అవును దీపక్క బతికే ఉందా ఎక్కడుంది అని అడుగుతూ ఉండగా… కార్తీక్ దీపని గతంలో గుర్తు చేసుకుంటూ అంటే వంటలక్కే కదా ఉంది నేనే తన భర్త అని మొరపెట్టుకుంటూ నాకోసమే తపిస్తోంది. దీప నా భార్య అయితే నేను పెద్ద తప్పు చేసినట్టే. అంటూ అంటూ ఉంటాడు. అప్పుడు వారణాసిని దీపమ్మని అవమానించార.. తను ఎన్ని కష్టాలు పడిందో నీకోసమని చెప్తూ ఏడుస్తూ ఉంటారు.
అప్పుడు కార్తీక్ నాకు ఆ ఫోటోలు నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిస్తుంది దీపే నా భార్య అనిపిస్తుంది అని అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ.. వారణాసి కొద్దిసేపు నన్ను వదిలేసి వెళ్ళు అని వారణాసిని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక వారణాసి వెళ్తూ ఉండగా… దీప ని చంపడానికి రౌడీలు వెళ్తుండగా.. వాళ్ళని చూసి వారణాసి దీపక్క దీపక్క అని పిలుస్తూ వాళ్ళని కోట్టబోతూ ఉండగా రౌడీలు తనని తలపై కొడతారు. అంతలో కార్తీక్ అక్కడికి వచ్చి ఆ రౌడీలని చితకబాది అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. తర్వాత కార్తీక్ వారణాసి దగ్గరికి వచ్చి తనని లేపుతూ ఉంటాడు. కట్ చేస్తే మౌనిత వస్తూ ఉంటుంది. శౌర్య తనకి ఎదురుగా వచ్చి రాయి విసిరుతుంది తనపై. కానీ ఆ రాయి వెళ్లి కార్తికి తగులుతుంది. అప్పుడు కార్తీకి కొద్దికొద్దిగా గతమంతా గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడు దీప, హిమ,సౌర్య అని గట్టిగా మొత్తుకుంటూ ఉంటాడు. తర్వాత వారణాసి లేపుతూ దీప ఎక్కడ పిల్లలు ఎక్కడ నీకేమైంది అని తనని ఆస్పత్రికి తీసుకెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే చంద్ర, గండ సౌర్య గురించి మాట్లాడుతూ ఉండగా.. శౌర్య అక్కడికి వచ్చి బాబాయ్ తొందరగా ఆటో తియ్యి ఆ మౌనితకి రాయి విసిరాను కానీ తగల్లేదు అని మోనీతను తిడుతూ ఆ రాక్షసి ఇక్కడికి వచ్చిన వచ్చేస్తుంది తొందరగా ఆటో తీయి బాబాయ్ అని చెప్పి అంటూ ఉంటుంది.

Karthika Deepam 13 october 2022 full episode
ఇక తర్వాత అందరూ ఆట లో వెళ్లిపోతారు. కట్ చేస్తే మౌనిత అనుకున్న ప్లాను జరగనందుకు బాధపడుతూ ఉంటుంది. అందరూ కలిసి నాపై దండయాత్ర చేస్తున్నారు. అంటూ.. కార్తీక్ ఎటో వెళ్లిపోయాడు అనే భయపడుతుంటే కావేరి వస్తాడులే అని అంటుంది. ఇక కార్తీక్ ని వెతుక్కుంటూ వెళ్తారు. కట్ చేస్తే దీప, డాక్టర్ ఎదురయ్యి కార్తీక్ గురించి అడుగుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ నాకు కనపడలేదమ్మా అనగానే ఆ మౌనితే ఎటో తీసుకెళ్లింది అని అని అంటూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ముందు ఇంటికి వెళ్దాం పద అక్కడ కూడా లేకపోతే మళ్లీ వెతుకుదాం అని చెప్తాడు. కట్ చేస్తే కార్తీక్ వారణాసిని హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ తనకి కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. అక్కడ డాక్టర్లు మీ పేరేంటి అని అడగగా కార్తీక్ డాక్టర్ కార్తీక్ అని చెప్తూ ఉంటాడు. అప్పుడు డాక్టర్స్ మీరు కూడా డాక్టర్ అని అంటూ ఉంటారు. అవును అని చెప్పి నేను ఒక అతన్ని తీసుకొచ్చాను అతనికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్స్ తనకి తలకి గాయమైంది ఆపరేషన్ చేస్తున్నాము మీకైతే మంచిగా ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్లో డాక్టర్ బాబు కోసం ఏడుస్తూ దీప తన కోసం వెతుకుదామని వెళుతూ ఉండగా.. కార్తీక్ దీపకి ఎదురవుతాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…