Karthika Deepam 15 Jan Today Episode : కార్తీక్ మనసు మళ్లీ మోనిత మీదికి మళ్లిందా? కార్తీక్ ఆలోచన ఏంటి? మళ్లీ ఊరెళ్లిపోవాలనుకుంటున్నాడా?

0
Advertisement

Karthika Deepam 15 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 1250 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పిల్లలకు టిఫిన్ వడ్డిస్తాడు కార్తీక్. మీరు హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం అంటాడు కార్తీక్. నువ్వు దూరంగా వచ్చినందుకు అక్కడ నానమ్మ, తాతయ్య కూడా బాధపడుతూ ఉంటారు కదా నాన్న అంటుంది రౌడీ. దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. నిజమే కదా నాన్న.. తాతయ్య, నానమ్మలు నువ్వు కనిపించకపోతే బాధపడతారు కదా అంటుంది హిమ. వాళ్లు కూడా నీకోసం ఎదురుచూస్తారు కదా నాన్న. వాళ్లను వదిలేసి వచ్చాం. మనదగ్గర ఫోన్లు కూడా లేవు. వాళ్లు ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఏంటి డాడీ ఇదంతా అంటుంది హిమ. దీంతో కొన్నింటికి నాదగ్గర ఇప్పుడు సమాధానాలు లేవమ్మా. ఇంకొన్ని మీకు చెప్పినా అర్థం కావు అంటాడు కార్తీక్.

karthika deepam 15 january 2022 full episode
karthika deepam 15 january 2022 full episode

నేనే ఇక్కడ ఇలా తీసుకొచ్చి మీ అమ్మను, మిమ్మల్ని బాధపెడుతున్నాను అంటే.. మాతో పాటు నువ్వు కూడా కష్టపడుతున్నావు కదా డాడీ అంటాడు కార్తీక్. మనం అన్నీ వదిలేసి వచ్చాం. నానమ్మ నిన్న పెద్దోడా పెద్దోడా అని అంటుంటే అవన్నీ మిస్ అవుతున్నట్టు అనిపించడం లేదా నాన్న అంటుంది శౌర్య. మరోవైపు బస్తీ వాసులు అందరూ మోనిత వైపు తిరుగుతారు. మీరు నాకు పునర్జన్మ ఇచ్చారు. నా ప్రాణాలు కాపాడారు అని మహిళ చెబుతుంది. మీ మేలు మరిచిపోలేను అమ్మ అంటారు. మీరు చాలా గొప్పోళ్లు అమ్మ. దీపమ్మ మీద అభిమానంతో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం. ఎన్ని జన్మలు ఎత్తి అయినా మీ రుణం తీర్చుకోలేము.. అంటారు. అరుణ.. నేను ఇచ్చిన మందులు వాడు.. త్వరలో తగ్గుతుంది అని చెబుతుంది మోనిత.

మరోవైపు రుద్రాణి.. సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది. అక్క కాఫీ అంటూ తన మనిషి తెచ్చిస్తాడు. ఎక్కడ చేశావురా ఈ కాఫీ అంటుంది రుద్రాణి. మన ఇంట్లోనే అక్క అంటాడు. దీంతో ఆ కాఫీని నేలకేసి కొట్టేస్తుంది. ఆ గదికి తాళం వేయమని చెప్పాను కదా. ఆ గదిని వాడకండి అని చెప్పా కదా.. అంటుంది.

ఇక నుంచి భోజనం హోటల్ నుంచి తెప్పించండి.. వంటగది మైల పడి పోయింది. అన్ని కష్టాల్లో కూడా అంత ధైర్యంగా ఎలా ఉండగలుతుందో నాకు అర్థం అవడం లేదు అంటుంది రుద్రాణి. హిమను, రంగరాజును దత్తత తీసుకుంటాను. అప్పుడు కానీ ఆ గదిని తెరుస్తాను అంటుంది.

Karthika Deepam 15 Jan Today Episode : ఎలాగైనా హిమ, రంగరాజును దత్తత తీసుకోవాలని ప్లాన్ వేసిన రుద్రాణి

హిమను చూస్తే మా అమ్మను చూసినట్టే ఉంది. రంగరాజు భుజం మీద పెద్ద పుట్టుమచ్చ ఉంది. అలా ఉంటే రాజయోగం పడుతుంది అంటారు.. అని అసలు విషయం చెబుతుంది. మరోవైపు కార్తీక్.. తన తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

దీపతో తన బాధ చెప్పుకొని బాధపడతాడు. పిల్లలు ఏమన్నారో చెబుతాడు. నేను ఏం సాధించాను దీప. ప్రతి సారి నేను ఓడిపోతుంటే నువ్వు నన్ను గెలిపించావు. చివరకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది అని అంటాడు కార్తీక్. మోనిత నుంచి.. ఈ ప్రపంచం నుంచి దూరంగా పారిపోయి వచ్చాం కానీ.. అవన్నీ అక్కడే వదిలేసి వచ్చాం అనుకున్నాం.

కానీ.. ఆ తప్పులన్నీ నీడలా మన వెంటనే వచ్చాయని నాకూ ఆలస్యంగా తెలిసింది. నేను చేసిన పొరపాటుకు ఆస్తినంతా రాసి వాళ్లను ఉద్దరించాను అనుకున్నా కానీ.. నా వాళ్లను బలిచేస్తున్నా అని ఊహించలేదు అంటాడు కార్తీక్. చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్.

ఉదయమే అప్పారావు మోనితతో దిగిన ఫోటోను చూస్తూ ఉంటాడు. కార్తీక్ కు కూడా చూపిస్తాడు. హీరోయిన్ లా ఉంది కదా అంటాడు. మీ జోడి బాగుంటుంది అంటాడు అప్పారావు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement