Karthika Deepam 15 Oct Today Episode : దీపతో సంతోషంగా గడుపుతున్న కార్తీక్… అది చూసి ఏం చేయలేకపోతున్నా మోనిత…!
Karthika Deepam 15 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1484 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దుర్గ కార్తీక్ ముందు మౌనితని బుక్ చేస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ మౌనిక వైపు సీరియస్ గా చూస్తూ ఉంటాడు. ఇక దుర్గ వెళ్తూ ఉండగా మౌనిత తన దగ్గరికి వచ్చి ఏదైనా తేడా జరిగితే నీ పని మామూలుగా ఉండదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు దుర్గ ఇప్పుడు తేడా జరగడం ఏంటి ఎప్పుడో తేడా జరిగింది అని దుర్గ నవ్వుకుంటూ వెళ్లిపోతాడు. కార్తీక్ రూమ్ లోకి వచ్చి అమ్మానాన్నలు ఎక్కడున్నారు. నేను ఈ పరిస్థితిలో ఉన్న సంగతి వాళ్లకి తెలియదా అంటే నేను యాక్సిడెంట్ లో చనిపోయిన అనుకుంటున్నారా అని అదే అయ్యుంటుంది లేకపోతే ఇక్కడికి రాకుండా ఎలా ఉంటారు అనుకుంటూ ఉంటారు. పిల్లలు ఎక్కడ దీప ఇక్కడుంది ఏంటి అని వాళ్ల గురించి ఆలోచిస్తూ కంగారుపడుతూ ఏడుస్తూ ఉంటాడు. దీప నీ వెళ్లి అడిగితే ఎలా ఉంటుంది. వద్దు మౌనిత కి తెలిస్తే దీప కుప్రమాదం అని అనుకుంటూ..
భగవంతుడా ఈ మౌనిత ఎంతకి తెగించిందేంటి అనుకుంటూ తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే దీప డాక్టర్ కి దుర్గకి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. వాళ్ల తింటూ నువ్వు కూడా తిను అని అంటూ ఉంటారు అప్పుడు దీప డాక్టర్ బాబు పెట్టిన తర్వాత నేను తింటాను తనని వెళ్లి పిలుసుకొస్తాను అని చెప్తూ డాక్టర్ బాబు ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడు దీప నేను వెళ్తున్న డాక్టర్ బాబును తీసుకొని వస్తా అనగానే.. అప్పుడు దుర్గ అది అక్కడ ఏమైనా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తు ఉంటే పిలువు నేను వస్తా అని చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే కార్తీక్ శివ దగ్గరికి వెళ్లి గతం గుర్తుకు రానట్లుగా నటిస్తూ సౌర్య గురించి అడుగుతూ ఉంటాడు. అప్పుడు శివ నిన్న ఆ పాప కలిసింది సార్ మీ దగ్గరికి తీసుకొస్తుండగా మోనిత మేడం అడ్డుపడ్డారు అని చెప్తూ ఉంటారు. అప్పుడు కార్తీక్ మీ మేడం పడితే ఆశ్చర్యమేముంది అడ్డుపడకపోతే ఆశ్చర్యపడాలి కాని అనుకుంటూ.. ఆ పాపని ఎలాగైనా కలవాలి ఆ పాపని వెతుకు అని చెప్తాడు. అప్పుడు శివ ఎందుకు సార్ ఆ పాప గురించి అడుగుతున్నారు అనగానే కార్తీక్ ఆ పాప నీ చూస్తుంటే జాలేస్తుంది చదివిద్దామని కానీ ఈ విషయం మీ మేడంకు చెప్పకు అని చెప్తాడు.
అప్పుడు సరే సార్ నాకు కూడా తెలుసు ఇప్పటికే మేడం నాకు రెండుసార్లు వార్నింగ్ ఇచ్చారు ఆ పాపని కలవద్దని అని చెప్పి అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు. కార్తీక్ సౌర్య గురించి ఆలోచిస్తూ మౌనితాని నీ సంగతి చూస్తా అని మనసులో అనుకుంటూ ఉంటాడు.కట్ చేస్తే సౌర్య అమ్మ నాన్నల్ని వెతుకుతూ ఉంటుంది. అప్పుడు గండ ఎక్కడికెళ్తున్నావ్ అమ్మ జాగ్రత్త మౌనిత మల్లి కనిపిస్తే నిన్నేమైనా చేస్తుంది అని జాగ్రత్తలు చెప్తూ ఉండగా… అప్పుడు శౌర్య మౌని తాని తిడుతూ ఉంటుంది. కట్ చేస్తే కార్తీక్ మోనితని సీరియస్గా పిలుస్తూ.. దీపపై మనుషుల్ని ఎందుకు అటాక్ చేయించావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత నాకు తెలీదు నీ ఆవేశంలో ఎన్నో అంటాం అది నిజంగా చేసేస్తామా అని డ్రామాలాడుతూ ఉంటుంది. నువ్వు ఇంత పని చేస్తావ్ అనుకోలేదు అనగానే… ఇదంతా అబద్ధం నేను చేయలేదు అని గట్టిగా అంటూ ఉంటుంది.
అప్పుడు ఈ దెబ్బ ఏమిటి నన్ను ఎందుకు కొట్టారు సంగారెడ్డిలో మాపై దాడి చేయించే శత్రువులు మాకు ఎవరున్నారు నీకు తప్ప అని మోనితకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీప అదంతా విని దుర్గతో చెప్తుంది. అప్పుడు దుర్గా దాని పని పట్టాలి దీపమ్మ అని అంటాడు. అప్పుడు ఇక రెచ్చిపో దుర్గ అని దీప చెప్తుంది. ఇప్పుడు చెప్తే దాని సంగతి అని మౌనిత దగ్గరికి దుర్గా వెళ్లి హలో బంగారం ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉండగా… అప్పుడు మౌనిత నేను అసలే చిరాకులో ఉన్నాను నన్ను ఇంకా చిరాకు పెట్టకు అని దుర్గని అంటూ ఉంటుంది. అప్పుడు దుర్గ దీపని లేపేయమని మనుషుల్ని పెట్టావు అది ఫెయిల్ అయింది అని అంటూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ దీప ని టీ పెట్టమని అడుగుతాడు. దీప టీ పెట్టగానే తాగుతూ ఉండగా.. మోర్నితా వచ్చి అక్కడ హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో చూడాల్సిందే…