Karthika Deepam 18 July Today Episode : హిమకు క్యాన్సర్ లేదన్న నిజం తెలుసుకొని నిరుపమ్ షాక్.. స్వప్నకు కూడా ఈ విషయం తెలుస్తుంది.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?
Karthika Deepam 18 July Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 జులై 2022, సోమవారం ఎపిసోడ్ 1407 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ చెప్పిన విషయం నిరుపమ్ కు నచ్చదు. మీరు పెద్ద వాళ్లు.. మీరే ఒక నిర్ణయం ఆలోచించండి. తనకు మీరైనా చెప్పండి. హిమ ఆలోచించేది కరెక్ట్ కాదు. శౌర్యను పెళ్లి చేసుకోవడం అసంభవం. మీకు ఇంత కంటే క్లారిటీగా చెప్పలేను అని చెప్పి నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో ఏం చేయాలో సౌందర్య, ఆనంద రావుకు అర్థం కాదు. ఇంతలో హిమ వస్తుంది. ఎలాగైనా నిరుపమ్, శౌర్య పెళ్లి చేస్తా అని వాళ్లతో అంటుంది. ఇంతలో అక్కడికి శౌర్య వస్తుంది. హిమ అంటుంది. దీంతో నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచావా అని అడుగుతుంది హిమ. దగ్గరికి వచ్చి నిజంగా నీకు నా మీద అంత ప్రేమ ఉందా అని అంటుంది శౌర్య.

karthika deepam 18 july 2022 full episode
డాక్టర్ సాబ్ ను, నన్ను కలపడానికి నువ్వు ఇంతలా ఆరాటపడుతున్నావా? పెళ్లి ఫిక్స్ అయినా కూడా నువ్వు నిరుపమ్ బావను నన్ను చేసుకోమని అంటున్నావంటే నువ్వు గ్రేట్ హిమ. మట్టిబుర్రను నాకోసం నువ్వు ఇంత చేస్తుంటే నిన్ను శత్రువులా చూశాను.. అని హిమను కౌగిలించుకుంటుంది శౌర్య. దీంతో సౌందర్య, ఆనంద రావు సంతోషిస్తారు. సారీ హిమ అంటుంది శౌర్య. నిన్ను చాలా మాటలు అన్నాను అంటుంది. మనిద్దరం ఎప్పటిలా కలిసి ఉందాం అంటుంది శౌర్య. ఆ తర్వాత ఇదే కదా నువ్వు కోరుకుంటోంది అంటుంది శౌర్య. దీంతో హిమ షాక్ అవుతుంది. నేనొచ్చి హిమ.. నిన్ను అపార్థం చేసుకున్నాను. గొప్ప త్యాగ శీలి అని అంటాననుకున్నావా? నీ బుట్టలో పడుతానని.. మళ్లీ నీ మాయలో మునిగిపోతానని అనుకున్నావా. విను.. మీరేం ప్లాన్ చేస్తున్నారో.. ఎలా ఆలోచిస్తున్నారో.. ఎక్కడ ప్లాన్ చేశారో నాకు తెలియదని అనుకుంటున్నావా? బయట కలిసి మీరేం మాట్లాడుకున్నారో నేను విన్నాను అంటుంది శౌర్య.
నేను నీ గురించే అంటుంది హిమ. కానీ.. మాట్లాడొద్దు అంటుంది శౌర్య. నువ్వు గొప్ప మేధావివి అంటుంది శౌర్య. మహానటికి అమ్మమ్మవు అంటుంది. ఆ మొహంలో బాధనటిస్తావు చూడు.. సూపర్ అంటుంది. దీంతో నేను ఏం నటించడం లేదు. ఇదంతా నిజమే అంటుంది హిమ.
Karthika Deepam 18 July Today Episode : ఆటో నడపడం మానేయ్ అని శౌర్యతో చెప్పిన ఆనంద రావు
నీ ద్రోహం మరిచిపోలేను. నీ నటనను నమ్మను.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య. మరోవైపు కోపంతో ఇంటికి వస్తాడు నిరుపమ్. పెళ్లి చేసుకోవాలంటే అటూ ఇటూ ఏడు తరాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలి అంటారు. నువ్వేంటి.. రేపో మాపో చచ్చిపోయే దాని గురించి ఆరాటపడుతున్నావు అంటుంది స్వప్న.
తనకు క్యాన్సర్ ఉందని ఎందుకు అబద్ధం చెప్పిందో నాకు తెలుసు కాబట్టే.. నేను శౌర్యకు చెప్పగలిగాను అంటాడు నిరుపమ్. దీంతో స్వప్న షాక్ అవుతుంది. తనకు క్యాన్సర్ లేదనే విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటుంది స్వప్న. ఏం జరిగినా నా పెళ్లి హిమతోనే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు అంటాడు నిరుపమ్.
ఇక నుంచి ఆటో నడపడం మానేయ్ అని శౌర్యతో అంటాడు ఆనంద రావు. దీంతో ఇప్పుడు మనం ధనవంతులం. నువ్వు ఆటో నడపడం మన ప్రెస్టేజ్ కు ఏం బాగుంటుంది అని అంటున్నారా తాతయ్య అంటుంది శౌర్య. ఆటో నడపడం అవసరమా చెప్పు అంటుంది సౌందర్య.
ఇంతలో వాళ్ల ఇంటికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. తన పాపను హిమ కాపాడిందని.. తనకు శౌర్య అని పేరు పెట్టిందని చెబుతారు. అయినా కూడా శౌర్య నమ్మదు. హాస్పిటల్ వెళ్లారు కదా.. మళ్లీ ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది శౌర్య. బర్త్ డే కదా.. స్వీట్స్ ఇద్దామని వచ్చాం అంటారు.
కట్ చేస్తే.. హిమకు క్యాన్సర్ లేదనే విషయం తెలుసుకొని స్వప్న షాక్ అవుతుంది. ఈ విషయం శోభకు ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.