Karthika Deepam 18 Oct Today Episode : మౌనిత చెంప పగలగొట్టిన దీప.. దీపకే సపోర్ట్ చేస్తున్న కార్తీక్…!
Karthika Deepam 18 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1486 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప నిద్రలేసి బయటికి రాగానే డాక్టర్ బాబును చూసి ఏంటి డాక్టర్ బాబు మీరు ఇక్కడ ఏంటి అని అడగగా… అప్పుడు కార్తీక్ నేను ఊరికనే వచ్చాను లే నువ్వు పని చూసుకో అని చెప్పి దీప పని చేస్తూ ఉండగా… వంటలక్క నీకు ఎంతమంది పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు… అప్పుడు దీప మా పిల్లలు బాగానే ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు హిమ, శౌర్య అని చెబుతూ వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. వాళ్ళ నాయనమ్మ వాళ్ళతోని అని చెప్తుంది. అప్పుడు తన మనసులో శౌర్య ఇక్కడే ఉంది. దీప తన మనకోసం వెతుకుతుంది అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీప ఏమైంది డాక్టర్ బాబు ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అలా ఏం లేదులే కొంచెం కాఫీ పెట్టి ఇస్తావా కొంచెం తలనొప్పిగా ఉంది. అది కాఫీతో పోయే తలనొప్పిలే అని చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప వెళ్లి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్తుంది.
కట్ చేస్తే మౌనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ రాత్రంతా ఎక్కడికెళ్ళిపోయాడు ఆ వంటలక్క ఇంటికి గనుక వెళ్ళాడా అని అక్కడికి వెళ్లి చూద్దామని వెళుతూ ఉంటుంది.ఇక కార్తీక్ దీప కలిసి కాఫీ తాగుతూ ఉంటారు. అంతలో మౌనిత అక్కడికి వెళ్లి ఏ వంటలక్క నీకెంత ధైర్యమే నా మొగుణ్ణి రాత్రంతా అనగానే… దీప చెంప పగలగొట్టి నోరు ముయ్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే ఊరుకోను… ఏ విషయమైనా తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మౌనిత అయితే నన్ను కొడతావా నువ్వేంటి కార్తిక్ నీ భార్యని ఎవరో కొడుతుంటే సినిమా చూస్తున్నావా కొంచెం కూడా ప్రేమ లేదా అన్నట్లుగా ఉంటుంది. అప్పుడు కార్తీక్ నా భార్య నువ్వా నా భార్య ఈ వంటలక్క అని అడగగా.. కార్తీక్ అని గట్టిగా ఉంటుంది. ఓ అప్పుడు నువ్వే నా భార్యవి అని అంటాడు. అప్పుడు అయితే ఎందుకు కొట్టిందో అడుగు అనగా అప్పుడు వంటలక్క మౌనిత అని అడుగుతాడు. అప్పుడు దీప పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎవరైనా కొడతారు అని చెప్తుంది. అప్పుడు పిచ్చి పిచ్చి మాటలు అంటే రాత్రంతా నా మొగుణ్ణి అని దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం లేదు. అలా మాట్లాడితే ఎవరైనా కొడతారు అని చెప్తాడు.
అప్పుడు ఒక చిన్న కథను చెప్పి నోటి దూల ఉంటే ఎవరైనా ఇలాగే కొట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్తూ ఉంటాడు.ఇక మౌనిత కార్తీక్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రంతా ఈ దీపకి కాపుల కాసాడా అని అనుకుంటూ ఉండగా… కార్తీక్ నీ మనసులో ఏమనుకుంటున్నావో అదే జరిగింది బాగా అని మౌనితని తీసుకొని వస్తాడు. ఇక దీపం మాత్రం దీనికి ఇలాగే ఇంకొక నాలుగు తగిలించి ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడదు అని అనుకుంటూ ఉంటుంది. మౌనిత మాత్రం అక్కడ కూర్చుని ఎంత గట్టిగా కొట్టిందో దొంగ మొహం ది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ చంప మీద ఏమైంది మౌనిత అలా తడుపుకుంటున్నావ్ అని ఏమీ గుర్తు లేనట్లుగా అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత నువ్వు ఈ మధ్యన చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నవు నీలో చాలా తేడా వచ్చింది. అని చెప్పు ఉంటుంది. అప్పుడు కార్తీక్ మోనితని ఎటకారంగా ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు.అంతలో దుర్గా వచ్చి టిఫిన్ తీసుకొచ్చాను అంటూ కార్తీక్ లేడు అన్నావు కదా తనక్కూడా తీసుకొచ్చేవాడిని కదా అని డ్రామాలాడుతూ కార్తీక్ అనుమానం పెరిగేలా చేస్తూ ఉంటాడు.
అప్పుడు మౌనిత టిఫిన్ ఎవరు తీసుకు రమ్మన్నాడు రా అని దుర్గ పై మండిపడుతూ ఉంటుంది.అప్పుడు కార్తీక్ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను.. మీరు తినండి అన్నట్లుగా చెప్తూ ఉంటాడు. అప్పుడు అందులో దీప వచ్చి డాక్టర్ బాబు నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అని చెప్పి కార్తీక్ ని తీసుకెళ్లి టిఫిన్ పెడుతూ ఉంటుంది. బయట దుర్గ మౌనిత చేతులు గట్టిగా పట్టుకొని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు. లోపల ఆనంద్ ఏడుస్తూ ఉంటాడు. దీప వెళ్లి తన ఎత్తుకుంటుంది. తర్వాత మౌనిత దుర్గని వదిలించుకుని వస్తుంది. కార్తీక్ ఆనంద్ ఏడుస్తుంటే వినిపించడం లేదా అని మొనితను తిడుతూ ఉంటాడు. ఇక మౌనిత దీప దగ్గర నుంచి ఆనంద్ లేకపోతే ఉంటుంది. అప్పుడు కార్తీక్, దీప ఇచ్చేయి దీప అని చెప్తాడు. కట్ చేస్తే సౌర్య గండని వారణాసి ఎక్కడున్నాడు కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటుంది.
అప్పుడు గండ ఎవరు వారణాసిని కొట్టారంట పోలీసులు మాత్రం చనిపోయారని చేపుస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఒకసారి ఏడుస్తూ నేనే తనని పంపించాను అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అవును రౌడీలు ఎవరు పంపించి ఉంటారు ఎవరు? తనకి శత్రువులున్నారు అన్నట్లుగా మౌనిత ఆంటీ చేయించు ఉంటుంది. బాబాయ్ తనే ఏదైనా నిజం చెప్పమని అడిగినప్పుడు కొట్టించి ఉంటుంది. అని సౌర్య అంటుంది. అప్పుడు గండ అవును నువ్వు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుంది. అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే కార్తీక్ హాస్పిటల్ కి వెళ్లి వారణాసి ని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత డాక్టర్ని తన కండీషన్ ఎలా ఉంది సార్ తను నాకు బాగా కావాల్సినోడు అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు. తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లో వేచి చూడాల్సిందే…