Karthika Deepam 19 Jan Today Episode : అందరూ ఒకే ఊళ్లో.. కార్తీక్, దీప, పిల్లలు, సౌందర్య, ఆనందరావు తాడికొండలో.. కార్తీక్ తన తల్లిదండ్రులను కలుస్తాడా? అసలు విషయం చెబుతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 19 Jan Today Episode : అందరూ ఒకే ఊళ్లో.. కార్తీక్, దీప, పిల్లలు, సౌందర్య, ఆనందరావు తాడికొండలో.. కార్తీక్ తన తల్లిదండ్రులను కలుస్తాడా? అసలు విషయం చెబుతాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :19 January 2022,1:30 pm

Karthika Deepam 19 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 1253 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రుద్రాణిని కొట్టిన ఆ మహిళ గురించి తెలుసుకోవడం కోసం ప్రకృతి వైద్యశాలకు వస్తుంది దీప. దీంతో తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో సౌందర్య, ఆనందరావు తనకు తారసపడతారు. వాళ్లను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది దీప. దేవుడా ఏంటి ఇది. అత్తయ్య మామయ్య ఇక్కడికి ఎందుకు వచ్చారు అనుకుంటుంది దీప. వీళ్లకు ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చిందా. భగవంతుడా.. మేమే కష్టాలు పడుతున్నాం అనుకుంటుంటే వీళ్లు ఇక్కడికి వచ్చారేంటి. అసలు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటుంది. అంటే.. రుద్రాణిని కొట్టింది అత్తయ్య గారా. రుద్రాణి అత్తయ్య గారిని ఏమని ఉంటుంది. ఈ ఊళ్లో ఉండి కూడా వీళ్లను చూడలేకపోయానే. అసలు వీళ్లు ఎప్పుడు వచ్చారు అని బాధపడుతుంది దీప. దీంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

karthika deepam 19 january 2022 full episode

karthika deepam 19 january 2022 full episode

ఏమ్మా.. ఆవిడను కలిశారా అని అక్కడ పనిచేసే వ్యక్తి అడుగుతుంది. దీంతో లేదండి మళ్లీ కలుస్తాను అని చెప్పి దీప అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్.. రుద్రాణి దగ్గరికి ఆవేశంగా వెళ్తాడు. నా పిల్లల జోలికి ఎందుకు వస్తున్నావు అంటూ తన మీద సీరియస్ అవుతాడు కార్తీక్. మీరు తప్పు చేస్తున్నారు అంటాడు కార్తీక్. దీంతో నేను తప్పులే చేస్తాను సారు అంటుంది రుద్రాణి. మా పిల్లలకు భోజనం పంపడం ఆపండి అంటాడు కార్తీక్. ఇవన్నీ ఆపేయండి అంటాడు. కానీ.. నేను ఆపను సారు అంటుంది రుద్రాణి. నాకు ఏది నచ్చితే అదే చేస్తాను అంటుంది. రావే రా టైమ్ కు వచ్చావు అని లక్ష్మిని పిలుస్తుంది. ఇదిగో సారు.. నా పుట్టిన రోజు వస్తుంది అందుకే నీ పిల్లలకు కొత్త బట్టలు కుట్టించాను.. అంటుంది రుద్రాణి.

ఏం మాట్లాడుతున్నారు మీరు. కొత్త బట్టలు కుట్టించడం ఏంటి అంటాడు కార్తీక్. రుద్రాణి గారు అంటూ అరుస్తాడు కార్తీక్. ఎందుకు అరుస్తున్నారు. నా పుట్టిన రోజుకు నువ్వు, దీప, పిల్లలు అందరూ రావాలి అంటుంది రుద్రాణి. నీ పిల్లలకు బట్టలు కుట్టించడానికి కొలతలు ఎలా వచ్చాయో తెలుసా? మీ ఇంటికి వచ్చి నావాళ్లు బట్టలు ఎత్తుకొచ్చారు. ఇప్పుడు అర్థం అయిందా సారు.. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అంటుంది రుద్రాణి.

Karthika Deepam 19 Jan Today Episode : రుద్రాణిపై సీరియస్ అయిన కార్తీక్

వెళ్లండి సారు.. అసలు లేవు.. వడ్డి డబ్బులు లేవు.. వాటి సంగతి పక్కన పెట్టి భోజనాల గురించి మాట్లాడుతున్నారు ఏంటి. మీరు డబ్బులు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇప్పుడు నా వాళ్లు పిల్లల బట్టలనే తీసుకొచ్చారు. అప్పుడు పిల్లలనే అంటూ రుద్రాణి అనబోయే సరికి.. రుద్రాణి గారు అంటూ సీరియస్ అవుతాడు.

మీ ఆవిడ ఏంటి.. రంగరాజును భుజాన వేసుకొని తిరుగుతోంది. నేను ఎత్తుకెళ్తానని భయమా. ఆమాత్రం భయం ఉండాలిలే సారు.. వెళ్లండి. వెళ్లిరండి.. అంటుంది రుద్రాణి. మరోవైపు దీప.. సౌందర్య, ఆనంద రావు గురించి ఆలోచిస్తూ వెళ్తుంటుంది.

అత్తయ్య మామయ్య.. ఈ ఊరుకు ఎందుకు వచ్చారు. ఇక్కడ ఎందుకు చేరారు. మామూలుగా ఆరోగ్యం బాగా లేని వాళ్లు ఇక్కడికి వస్తారు. మామయ్యకు బాగా లేదా అని అనుకుంటుంది దీప. ఏం చేయాలి అని అనుకుంటుంది దీప. దీని గురించి డాక్టర్ బాబుకు చెప్పాలా వద్దా అని అనుకుంటుంది దీప.

మరోవైపు కార్తీక్.. ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు. దారిలో ఓ బండ రాయి కనిపిస్తే.. దాని మీద కూర్చుంటాడు. మమ్మీ డాడీ కనిపించిన విషయం దీపకు చెప్పాలా అని అనుకుంటాడు కార్తీక్. వద్దులే తనకు చెప్పకపోవడమే మంచిది అని అనుకుంటాడు కార్తీక్.

కార్తీక్ కొత్త సిలిండర్ తీసుకొచ్చి బిగిస్తాడు. ఇదంతా చేస్తుంటే పిల్లలు చూసి నాన్న మనకోసం చాలా కష్టపడుతున్నారు కదా అని అనుకుంటారు పిల్లలు. అవును.. అమ్మా నాన్న ఇద్దరూ మనకోసం చాలా కష్టపడుతున్నారు అని అనుకుంటారు పిల్లలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది