Karthika Deepam 2 : కార్తీకదీపం 2 సీరియల్ ప్రోమో రిలీజ్.. వంటలక్క మళ్ళీ వచ్చేస్తోంది..!
ప్రధానాంశాలు:
Karthika Deepam 2 : కార్తీకదీపం 2 సీరియల్ ప్రోమో రిలీజ్.. వంటలక్క మళ్ళీ వచ్చేస్తోంది..!
Karthika Deepam 2 : బుల్లితెరపై కార్తీకదీపం సీరియల్ ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. అందులోని వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపుగా ఆరేళ్లు ప్రసారమైన కార్తీకదీపం సీరియల్ కు గతేడాది ఫిబ్రవరిలో ముగింపు పలికారు. అయితే తాజాగా కార్తీకదీపం సీరియల్ సరికొత్తగా మీ ముందుకు వస్తుందని మేకర్స్ ప్రకటించారు. ఇది నవ వసంతం అనే పేరుతో సరికొత్తగా కార్తీకదీపం రాబోతుంది. పాత్రలు అవే కానీ కథ కొత్తది. తాజాగా కార్తీకదీపం 2 ప్రోమో మేకర్స్ విడుదల చేశారు. దీప, డాక్టర్ బాబుల పెద్ద కూతురు శౌర్య చిన్నప్పటి కథగా ఈ సీరియల్ తెరకెక్కిందని తెలుస్తోంది. శౌర్యకు తండ్రి లేడు. వంటలక్కనే శౌర్యకు తల్లి, తండ్రి అయి పెంచుతుంది.
అయితే ఇక్కడ డాక్టర్ బాబు కాస్త బాబు గారుగా మారారు. వాళ్ళ ఇంట్లోనే వంటలక్క పని చేస్తుంది. కానీ వారిద్దరూ ఒకరికి ఒకరు తెలియనట్లుగానే కనిపించారు. డాక్టర్ బాబును వంటలక్క బాబు గారు అని పిలుస్తుంది. మరి వీరిద్దరి మధ్య దూరం ఎందుకు వచ్చింది? శౌర్యకు తండ్రి ఎవరు అనేది సీరియల్ చూస్తే కానీ తెలియదు. ప్రస్తుతం ఈ సీరియల్ ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ ప్రోమో చూసినవారు వంటలక్క మళ్ళీ వచ్చింది అని కామెంట్స్ పెడుతున్నారు. కార్తీకదీపం సీరియల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనేక వండర్స్ క్రియేట్ చేసిన కార్తీకదీపం సీరియల్ మళ్లీ ఆ రంగంలోకి దిగబోతోంది.
త్వరలో కార్తీక దీపం సీరియల్ రాబోతుంది అని చెప్పగానే అందరిలో వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత ఉంటారా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ కొత్తగా రిలీజ్ చేసిన ప్రోమోలో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు కనిపించాయి. ఇక మోనిక పాత్ర ఉంటుందో లేదో సీరియల్ ప్రసారం అయితే కానీ తెలియదు. ఎన్నో సంచలనాలను క్రియేట్ చేసిన కార్తీకదీపం సీరియల్ ఈసారి కూడా అదే వండర్ ను క్రియేట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. తాజాగా విడుదలైన ప్రోమో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ పార్ట్ 1 టీఆర్పీ రేట్లను పెంచింది. ఈ సీరియల్ కు వచ్చిన సక్సెస్ ఇంతవరకు ఏ సీరియల్ కు రాలేదు. అందుకే మళ్ళీ అవే పాత్రలతో కార్తీకదీపం సరికొత్త సీరియల్ ప్రసారం చేయనున్నారు.