Karthika Deepam 24 Sep Today Episode : కార్తీక్, మోనిత మధ్య ఏదో ఉందని తెలుసుకున్న శౌర్య, హిమ.. కార్తీక్ ను నిలదీస్తారా? మోనితను ఎందుకు జైలుకు పంపించారని అడుగుతారా? కార్తీక్, దీప.. పిల్లలకు ఏం సమాధానం చెబుతారు?
karthika deepam 24 september friday 1153 episode highlights
Karthika Deepam 24 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 24 సెప్టెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈ రోజు ఎపిసోడ్ 1153 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్య, హిమ.. ఇద్దరూ స్కూల్ లో తన ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో చూస్తారు. కానీ.. తమ ఫ్రెండ్స్ ఎవరు కనిపించరు. అయితే.. వాళ్ల ఫ్రెండ్ సైనీ మాత్రం కనిపిస్తుంది. వాళ్ల దగ్గరికి వస్తుంది. రాగానే.. మీకో విషయం చెప్పాలి.. మీ నాన్న గురించి అని అంటుంది. దీంతో మా నాన్న గురించి ఏంటి విషయం అని అడుగుతుంది. మీ నాన్న జైలుకు వెళ్లారట కదా. మర్డర్ చేశారట కదా.. అంటారు. మా నాన్న గురించి ఇంకో విషయం ఎక్కువ మాట్లాడితే బాగుండదు అంటారు. మోనిత ఆంటీ కనిపించకుండా పోయేసరికి మా నాన్నను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.. అని పిల్లలు చెప్పినా.. అదంతా అబద్ధం అని అంటుంది.
karthika deepam 24 september friday 1153 episode highlights
అసలు మీ నాన్న, మోనితకు మధ్య ఏదో ఉందట. అందుకే.. మీ నాన్నను పోలీసులు పట్టుకెళ్లారు. మీ డాడీ ఆమెను చీట్ చేశారట. అందుకే మోనిత ఆంటీని ఇప్పుడు ఇప్పుడు జైలులో వేశారని చెబుతుంది సైనీ. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. ముందు ఇక్కడి నుంచి వెళ్లిపో.. అని చెబుతారు శౌర్య, హిమ. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుతుందా.. అని హిమ ఏడ్చేస్తుంది.
karthika deepam 24 september friday 1153 episode highlights
Karthika Deepam 24 Sep Today Episode : కానిస్టేబుల్ సుకన్య కడుపునొప్పిని తగ్గించిన మోనిత
కట్ చేస్తే మోనిత.. కానిస్టేబుల్ కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అబ్బా.. వెంటనే తగ్గించింది. థాంక్యూ మేడమ్ అంటుంది సుకన్య. సోడా తాగే అలవాటు ఎక్కువగా ఉండటం వల్ల కడుపునొప్పి వచ్చింది మేడమ్ అంటుంది. గ్యాస్ ట్రబుల్ వల్ల కడుపు నొప్పి వచ్చింది అని చెబుతుంది.. మోనిత.
karthika deepam 24 september friday 1153 episode highlights
కట్ చేస్తే.. తన హాస్పిటల్ కు వస్తాడు కార్తీక్. దీంతో అందరూ తనకు వెల్ కమ్ చెబుతారు. ఆ తర్వాత అందరూ మీరు అదృష్టవంతులు సార్.. దీప మేడమ్ దొరకడం మీ అదృష్టం అంటారు. ఆ తర్వాత డాక్టర్లు అందరూ మోనిత టాపిక్ తీసేసరికి.. కార్తీక్ సీరియస్ అవుతాడు. ఇంకోసారి పర్సనల్ విషయాలు ఇక్కడ తీయొద్దు అని చెప్పి.. భారతిని తన క్యాబిన్ రమ్మని చెబుతాడు కార్తీక్.
karthika deepam 24 september friday 1153 episode highlights
Karthika Deepam 24 Sep Today Episode : గుక్కపెట్టి ఏడ్చిన హిమ
కట్ చేస్తే స్కూల్ లో కూర్చొని హిమ గుక్కపెట్టి మరీ ఏడుస్తుంటుంది. డాడీ బ్యాడ్ బాయ్ కాదు కదా.. మాట్లాడవేంటి శౌర్య. ఉత్తప్పుడు ఏదో ఒకటి వాగుతుంటావు కదా. ఇప్పుడు ఏంటి మాట్లాడటం లేదు. డాడీ తప్పు చేయడు కదా.. అని అడుగుతుంది. అవును.. అంటుంది శౌర్య. మరి డాడీని పోలీసులు ఎందుకు పట్టుకుపోయినట్టు. తను డాడీని ఎందుకు అలా అంది. నాకైతే చాలా కోపం వచ్చింది.
karthika deepam 24 september friday 1153 episode highlights
నాకు కూడా కోపం వచ్చింది హిమ. నువ్వు ఏడుస్తావు.. నేను ఏడవను.. అంతే తేడా అంటుంది శౌర్య. డాడీ.. మోనిత ఆంటీని మోసం చేస్తాడా.. అసలు.. మోనిత ఆంటీని డాడీ ఎందుకు మోసం చేస్తాడు… అంటుంది హిమ. నాన్న వచ్చే టైమ్ అయింది.. ఇక్కడ ఏడిస్తే బాగోదు.. పదా అని చెప్పి హిమను తీసుకొని వెళ్తుంది శౌర్య.
karthika deepam 24 september friday 1153 episode highlights
Karthika Deepam 24 Sep Today Episode : మోనిత గురించి కార్తీక్ తో మాట్లాడిన భారతి
కట్ చేస్తే.. ఆసుపత్రిలో తన క్యాబిన్ లో కూర్చొని ఉంటాడు కార్తీక్. సారీ కార్తీక్.. నిన్ను అపార్థం చేసుకున్నాను అంటుంది భారతి. నా మీద కోపం లేదా.. అంటే నేను అన్నీ మరిచిపోవాలని అనుకుంటున్నాను.. అవును.. గుర్తు పెట్టుకునేంత పెద్ద విషయం ఏం చేసింది తను. అంటే.. తను నిన్ను మరిచిపోకూడదని అంటుంది కదా.. అంటుంది భారతి.
karthika deepam 24 september friday 1153 episode highlights
మోనిత నీ భాగస్వామి కాకపోవచ్చు కానీ.. తను నీ జీవితంలో ఒక భాగం.. అని చెబుతుంది భారతి. తనను సమర్థిస్తున్నావా.. అంటే వాస్తవం చెబుతున్నాను అంటుంది భారతి. బంధం, సంబంధం లేదనవు కానీ.. సైంటిఫిక్ గా మోనిత కడుపులో పెరుగుతున్న బిడ్డను నువ్వే తండ్రివి కార్తీక్ అంటుంది భారతి.
karthika deepam 24 september friday 1153 episode highlights
తన సెల్ లో కూర్చొని ఏడు ఊచలు నా కార్తీక్ తో ఏడు అడుగులు నడవడానికే అడ్డంగా ఉన్నాయని అనుకుంటుంది మోనిత. తన పెళ్లి గురించి కలలు కని తెగ సంతోషపడుతుంది మోనిత. ఊహల్లోనే ఇంత అందంగా ఉంటే.. నిజంగా జరిగితే తట్టుకోగలనా.. మోనిత వెడ్స్ కార్తీక్.. ఇంకెన్ని రోజులులే.. అంటుంది. ఇంతలో సుకన్య వస్తుంది. ఏంటి మేడమ్ ఇంత ఖుషీగా ఉన్నారు.. అంటుంది. సుకన్య నాకోసం ఒక పని చేస్తావా అని అడుగుతుంది. చెప్పండి మేడమ్ అంటుంది. నా ఫ్రెండ్ ను ఇక్కడికి పిలిపించవా.. అని అంటుంది. సరే.. అంటుంది సుకన్య.
karthika deepam 24 september friday 1153 episode highlights
Karthika Deepam 24 Sep Today Episode : కార్తీక్ గురించి అందరూ చెడుగా మాట్లాడుతున్నారని దీపతో చెప్పిన వారణాసి
కట్ చేస్తే.. కారులో వారణాసితో కలిసి దీప ఎక్కడికో వెళ్తుంటుంది. వారణాసి ఏడుస్తుండటం చూసి ఏమైంది.. వారణాసి ఎందుకు ఏడుస్తున్నాడు అని అనుకొని ముందు కారు ఆపు అంటుంది. దిగు.. అంటుంది. అబద్ధాలు ఎప్పుడు నేర్చుకున్నావు వారణాసి. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అంటుంది. అక్క అక్క అని పిలవగానే సరిపోదు.. నీ మనసులో ఏముందో చెప్పు.. ఎందుకు ఏడుస్తున్నావు.. అంటుంది. దీంతో గుక్కపెట్టి మరీ ఏడుస్తాడు.
karthika deepam 24 september friday 1153 episode highlights
డాక్టర్ బాబు గురించి అందరూ చెడ్డగా మాట్లాడుతున్నారు అక్కా.. అంటాడు వారణాసి. బస్తీలో చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు అక్క. ఇంకా చాలా విషయాలు వాళ్లకు తెలిశాయి. డాక్టర్ బాబును అలా అంటుంటే బాధేస్తుంది అక్క. చాలా నీచంగా మాట్లాడుతున్నారు అక్క. వాళ్ల నోరు మూయించలేక నేనే నోరు మూసుకొని కూర్చుంటున్నాను అక్క.. అంటాడు వారణాసి. ఎవరో ఏదో అంటున్నారని మనం బాధపడుతూ కూర్చోకూడదు. అవన్నీ పట్టించుకోకూడదు. పదా వెళ్దాం అంటుంది దీప. కారులో కూర్చొని దీప కూడా బాధపడుతుంది. మోనిత గురించి గుర్తు తెచ్చుకుంటుంది.
karthika deepam 24 september friday 1153 episode highlights
Karthika Deepam 24 Sep Today Episode : తన ఏడుపు మాత్రం ఆపని హిమ
కార్తీక్ కూడా కారులో బయలుదేరుతాడు. పిల్లలను తీసుకురావడం కోసం స్కూల్ కు వస్తుంటాడు. హిమ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఆ శైని చెప్పిన విషయాలు నువ్వు నమ్మకు అంటుంది శౌర్య. మరి నువ్వు నమ్ముతున్నావా.. అంటే ఏం మాట్లాడదు శౌర్య. మోనిత ఆంటి.. జైలులో ఉందంటే తప్పు మోనితదే కదా.. నాన్నది కాదు కదా అంటుంది శౌర్య. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు.
karthika deepam 24 september friday 1153 episode highlights
కట్ చేస్తే.. ఇంట్లో పిల్లలు తెగ గొడవ చేస్తుంటారు. ఏమైంది మీకు ఏం కావాలి అని అడుగుతుంది దీప. స్కూల్ లో మీ గురించి, మోనిత అంటీ గురించి చాలా చీఫ్ గా మాట్లాడారు డాడీ స్కూల్ లో. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాదంట కదా. మీ ఇద్దరి మధ్య ఇంకేదో ఉందంటున్నారు. అసలు.. మోనిత అంటీ అప్పుడు ఎక్కడికి వెళ్లింది.
karthika deepam 24 september friday 1153 episode highlights
మోనిత ఆంటీ కనిపించకపోతే నాన్నకు సంబంధం ఏంటి.. అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు పిల్లలు. దీంతో ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
karthika deepam 24 september friday 1153 episode highlights