Karthika Deepam 25 Feb Today Episode : ఆనంద్ మీద మరింత ప్రేమ పెంచుకున్న హిమ.. మరోవైపు ఆనంద్ గురించి అసలు నిజం తెలుసుకొని దీప షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 25 Feb Today Episode : ఆనంద్ మీద మరింత ప్రేమ పెంచుకున్న హిమ.. మరోవైపు ఆనంద్ గురించి అసలు నిజం తెలుసుకొని దీప షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :25 February 2022,10:30 am

Karthika Deepam 25 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1285 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏమైంది మీకు.. ఆ తాడికొండ వెళ్లొచ్చాక మనుషులు మారిపోయారు ఏంటి అంటుంది సౌందర్య. దీపు గాడిని ఎప్పుడైనా గంట సేపు ఎత్తుకున్నారా? అని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీంతో మాకు వీడు బాగా నచ్చాడు అంటారు పిల్లలు. మాకు వీడే సొంత తమ్ముడు అంటారు. దీంతో తప్పు హిమ.. ఆనంద్ మీద ప్రేమ ఉండటంలో తప్పు లేదు కానీ.. దీపు గాడిని తక్కువ చేసి మాట్లాడొద్దు అంటుంది దీప. దీంతో అవన్నీ నాకు తెలియదు అమ్మ. వీడికి ఫంక్షన్ చేద్దాం అంటుంది హిమ. దీంతో దీపకు కోపం వస్తుంది. ఫంక్షన్ లేదు.. గింక్షన్ లేదు.. వెళ్లండి అవతలికి అంటుంది దీప.

karthika deepam 25 february 2022 full episode

karthika deepam 25 february 2022 full episode

దీంతో కోపంగా హిమ వెళ్లిపోతూ ఉంటుంది. మీరు ఆనంద్ ను మా సొంత తమ్ముడు అని ఒప్పుకోకపోతే మేము మళ్లీ తాడికొండ వెళ్లిపోతాం అని వార్నింగ్ ఇస్తుంది హిమ. దీంతో సౌందర్య, దీప.. ఇద్దరూ టెన్షన్ పడతారు. హిమను చూస్తుంటే భయం వేస్తుంది అత్తయ్య. ఆనంద్ ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండటం లేదు. ఒకప్పుడు హిమ సైలెంట్ గా ఉండేది.. శౌర్య.. ప్రశ్నలు అడిగేది. ఇప్పుడు హిమ మారిపోయింది.. అంటుంది. పిల్లలకు ముందే నిజం చెప్పడం బెటర్ అని మనసులో అనుకుంటుంది. తాడికొండకు వెళ్లిన పని ఏమైంది అని దీపను అడుగుతుంది సౌందర్య. దీంతో కొన్ని పనులు అయ్యాయి.. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి అంటుంది దీప.

మరోవైపు మోనిత ఏడ్చుకుంటూ కార్తీక్ దగ్గరికి వస్తుంది. ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు. ఈ కన్నీళ్లు ఎందుకు అని అడగవా అని అంటుంది. దీంతో ప్రతి కన్నీళ్ల వెనుక బాధే ఉండాల్సిన అవసరం లేదు మోనిత అంటాడు కార్తీక్. ఇంతేనా కార్తీక్.. నా బాధను నువ్వు పట్టించుకోవా అని అంటుంది మోనిత.

నీ కోసం మీ ఇంటికి వెళ్లాను అంటుంది మోనిత. పదే పదే నువ్వు ఇంటికి వెళ్లకు. నీకిచ్చిన మాట ప్రకారం నీ బాబును వెతుకుతాను కానీ.. ఈ వంకతో నువ్వు పదే పదే ఇక్కడికి రాకు.. నీకు దండం పెడతాను వెళ్లు.. అంటాడు కార్తీక్. దీంతో ఏంటి ఈరోజు నాకు గ్రహాలు అనుకూలంగా లేనట్టున్నాయి అని అనుకుంటుంది మోనిత.

ఏంటి దీప.. జరిగిందానికి బాధపడుతున్నావా అంటాడు కార్తీక్. దీంతో జరగబోయేదానికి భయపడుతున్నాను డాక్టర్ బాబు అంటుంది దీప. మళ్లీ ఆ మోనిత ఏం చేస్తుందోనని భయం వేస్తుంది. ఎక్కడి నుంచి ఏం చేస్తుందోనని అనిపిస్తోంది.. అంటుంది.

Karthika Deepam 25 Feb Today Episode : అప్పారావు ఇంటికి వచ్చి అన్నీ ఇచ్చి వెళ్లిన విషయాన్ని దీపకు చెప్పిన సౌందర్య

మరోవైపు అప్పారావు వచ్చాడని.. కావాల్సినవి ఇచ్చి వెళ్లాడని చెబుతుంది సౌందర్య. అవునా.. కలవకుండానే వెళ్లాడు అని అంటంది. ఏదో పని ఉందని ఫోటోలు, టీసీలు ఇచ్చి వెళ్లాడని చెబుతుంది. ఆ ఫోటోలు చూసి కోటేశ్, శ్రీవల్లిని గుర్తు తెచ్చుకుంటుంది దీప.

మరోవైపు లక్ష్మణ్.. కార్తీక్ దగ్గరికి వస్తాడు. లక్ష్మణ్.. నువ్వు మోనిత బిడ్డను తీసుకెళ్లిన వాళ్లను చూశావా అని అడుగుతాడు. దీంతో నేను చూడలేదు సార్. మోనిత కూడా తన బాబును వెతకాలని చెప్పింది కానీ.. నేను ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా వెతకను సార్ అంటాడు లక్ష్మణ్.

సార్ మా ఆవిడకు కడుపునొప్పి వస్తే తనే ట్రీట్ మెంట్ చేసింది. అందుకే.. తను చెప్పిన పనులు చేయాల్సి వచ్చింది అని చెబుతాడు లక్ష్మణ్. తర్వాత అప్పారావు తీసుకొచ్చిన ఫోటోలను తీసుకెళ్లి దీప అల్మారాలో పెట్టబోతుంది. అప్పుడే కోటేశ్ నోట్ బుక్ ను చూస్తుంది. అందులో అప్పట్లో ఏదో కనిపించింది అని అనుకుంటుంది.

అప్పుడే కారు నెంబర్ ను చూస్తుంది. కోటేశ్ ఈ కారు నెంబర్ ఎందుకు వేశాడు. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడు అని అనుకుంటుంది దీప. ఆ తర్వాత అదే కారు నెంబర్ ను బయట చూసి.. ఆ కారు మోనితదని తెలుసుకుంటుంది దీప.

అంటే.. ఆనంద్ మోనిత కొడుకు అని.. కోటేశ్ ఎత్తుకొచ్చింది ఆనంద్ నేని అనుకొని కుప్పకూలిపోతుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది