Karthika Deepam 25 Oct Today Episode : మోనితకు పురిటినొప్పులు.. ఆసుపత్రికి వెళ్లిన కార్తీక్, సౌందర్య.. ఈ విషయం తెలిసి దీప ఏం చేస్తుంది?
Karthika Deepam 25 Oct Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 అక్టోబర్, 2021, సోమవారం ఎపిసోడ్ 1179 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత.. తన ఇంటికి వస్తుంది. ఇల్లును చూసి తన పాత మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంటుంది. కార్తీక్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటుంది. ఇంట్లోకి వెళ్లగానే నిన్ను ఒప్పిస్తాను కార్తీక్ అని అనుకుంటుంది. నిన్ను ఒప్పించడానికి ఎన్నాళ్లయినా ఓపిక పడతాను అని అనుకుంటుంది మోనిత.

karthika deepam 25 october 2021 full episode
అమెరికా వెళ్లడాన్ని క్యాన్సిల్ చేసుకున్నా.. అని చెబుతాడు కార్తీక్. మోనితతో మాట్లాడాక ఒక స్పష్టత వచ్చింది మమ్మీ అంటాడు కార్తీక్. ఇక్కడే ఉంటే అది ఏదో ఒకటి చేస్తుందిరా అంటుంది సౌందర్య. పిల్లలకు ఎలా సర్దిచెబుతావు అంటుంది. దీంతో ఎలాగోలా పిల్లలకు నేను సర్దిచెప్పుకుంటాను.. కానీ మోనిత బెదిరింపులకు మాత్రం లొంగను అంటాడు కార్తీక్. మోనితను కలిసిన విషయం దీప కంటే ముందు పిల్లలకే చెప్పేస్తాను అంటాడు కార్తీక్.
మోనిత గురించి మాట్లాడుతుండగానే దీప రావడంతో వెంటనే కార్తీక్, సౌందర్య టాపిక్ మార్చుతారు. దీపకు ఈ విషయాలు చెప్పి బాధపెట్టడం ఎందుకు అని అనుకుంటాడు కార్తీక్. ఇప్పటి దాకా ఏదో మోనిత గురించి మాట్లాడుతూ నేను రాగానే మాట మార్చారు అని అనుకుంటుంది దీప. ఏంటి దీప వచ్చి అలా నిల్చున్నావు.. ఏం మాట్లాడటం లేదు ఏంటి అంటుంది దీప. భోజనానికి రండి అని అంటుంది.
కట్ చేస్తే.. మోనిత.. కార్తీక్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తావు కార్తీక్ ఇంటికి అని అనుకుంటుంది. ఇంతలో తనకు కడుపులో నొప్పి వస్తుంది. తట్టుకోలేకపోతుంది. విపరీతంగా నొప్పులు వస్తాయి. దీంతో సోఫాలో కూర్చుంటుంది. ఇంతలో తనకు సెక్యూరిటీగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ లోపలికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి ఆసుపత్రికి తీసుకెళ్లు అని మోనిత చెబుతుంది. దీంతో సరే మేడమ్ అని అంటుంది.
కట్ చేస్తే.. హిమ ఎప్పుడూ డల్ గా ఉండటం చూసి శౌర్య బాధపడుతుంది. ఎందుకు హిమ నువ్వు ఇంత డల్ గా ఉంటున్నావు. నాతో కూడా ఆడుకోవడానికి రావడం లేదు అంటుంది శౌర్య. నువ్వంటేనే అందరికీ ఇష్టం.. అని అంటుంది. ఇంతలో దీప వస్తుంది. ఏంటే పెద్ద తప్పు తప్పు అంటూ మాట్లాడుతున్నావు. మీ నాన్న ఏం తప్పు చేశాడు అని హిమను అడుగుతుంది. మోనిత గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటూ సీరియస్ గా హిమకు వార్నింగ్ ఇస్తుంది దీప. నాన్న గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే అస్సలు బాగోదని హిమ, శౌర్యకు సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంది దీప. ఇవన్నీ విని కార్తీక్ కూడా చాలా ఎమోషనల్ అవుతాడు.
Karthika Deepam 25 Oct Today Episode : మోనితకు పురిటినొప్పులు రావడంతో కార్తీక్ కు భారతి ఫోన్
కట్ చేస్తే మోనితను ఆసుపత్రికి తీసుకెళ్తారు. తనకు పురిటినొప్పులు వస్తుంటాయి. భారతి.. కార్తీక్ కు ఫోన్ చేస్తుంటుంది. దీంతో కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు. ఎవరు అని అడుగుతుంది సౌందర్య. భారతి అని చెబుతాడు. తను ఇప్పుడు డబుల్ గేమ్స్ ఆడుతోంది అంటాడు. మళ్లీ ఫోన్ చేస్తుంది భారతి. ఏంటి భారతి.. అని అడుగుతాడు. కార్తీక్ చెప్పేది విను అంటుంది. మోనితకు నొప్పులు వస్తున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. తన కండీషన్ చాలా సీరియస్ గా ఉంది అంటుంది.

karthika deepam 25 october 2021 full episode
మోనిత తప్పు చేస్తే కడుపులోని బిడ్డ ఏం పాపం చేసింది. నువ్వు వెంటనే వెళ్లి సంతకం పెట్టు అని అంటుంది సౌందర్య. ఇద్దరూ కలిసి ఆసుపత్రికి బయలు దేరుతారు. అంతలోనే దీప.. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. గుడికి అని అబద్ధం చెబుతుంది సౌందర్య. నేను కూడా వస్తా అంటుంది దీప. వీళ్లు కావాలనే నన్ను వద్దంటున్నారు అని అనుకుంటుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.