Karthika Deepam 26 Nov Today Episode : హ్యాపీ మూడ్ లో కార్తీక్ ఫ్యామిలీ.. దీప, కార్తీక్ కు మరో ట్విస్ట్ ఇచ్చిన మోనిత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 26 Nov Today Episode : హ్యాపీ మూడ్ లో కార్తీక్ ఫ్యామిలీ.. దీప, కార్తీక్ కు మరో ట్విస్ట్ ఇచ్చిన మోనిత

 Authored By gatla | The Telugu News | Updated on :26 November 2021,9:00 am

Karthika Deepam 26 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 నవంబర్, 2021 శుక్రవారం ఎపిసోడ్ 1207 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉంటుంది. అందరూ కలిసి సరదాగా ఆడుకుంటారు. పొడూపు కథల పోటీలు పెట్టుకొని అందరూ సరదాగా నవ్వుకుంటూ హాయిగా గడుపుతారు. ఈరోజు నువ్వు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మొత్తం నేనే పనిచేస్తా అని దీపకు సౌందర్య చెబుతుంది. ఈరోజే మనకు అసలైన దీపావళి అంటుంది సౌందర్య.

karthika deepam 26 november 2021 full episode

karthika deepam 26 november 2021 full episode

అందరూ కలిసి ఉన్నారు కదా.. ఫోటోలు తీయి అని ఆదిత్యకు చెబుతుంది సౌందర్య. దీంతో అందరితో కలిసి సెల్ఫీ తీస్తాడు ఆదిత్య. మొత్తానికి గత 11 ఏళ్ల నుంచి ఏనాడూ లేనంత సంతోషంగా కార్తీక్ ఫ్యామిలీ ఉంటుంది. కట్ చేస్తే లాయర్ మోనిత ఇంటికి వస్తాడు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అంటాడు లాయర్ సురేశ్. మీరు ఏదైనా చేయండి.. డబ్బు ఎంత ఖర్చు అయినా పర్లేదు కానీ.. ఆ దీపను మాత్రం సున్నాగా మార్చాలి. నేను ఎలాగైనా గెలవాలి సురేశ్ గారు అంటుంది మోనిత.

మీ అకౌంట్ లోకి నేను మనీ ట్రాన్స్ ఫర్ చేస్తాను. మనం అనుకున్నది రెండు వారాల్లోగా చేయాలి అంటుంది మోనిత. సరే మేడమ్. ముందు మీరొక పనిచేయాలి అంటాడు లాయర్ సురేశ్. అదేముంది నేను చేసేస్తాను అంటుంది మోనిత. తను వెళ్లిపోయాక.. అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది మోనిత. నాలుగు డైలాగులు చెప్పి గెలిచాననుకుంటున్నావా దీపక్కా. గెలుపంటే ఏంటో నేను చూపిస్తాను అని అనుకుంటుంది.

కట్ చేస్తే.. కార్తీక్ ఫ్యామిలీ మొత్తం పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తుంటారు. ఆ తర్వాత ఇలా ఆనందంగా నవ్వుకొని చాలారోజులు అయింది అంటుంది సౌందర్య. ఆదిత్య.. జోకులు వేసి అందరినీ నవ్విస్తాడు. నానమ్మ ఒక కథ చెప్పవా అంటుంది శౌర్య. నానమ్మకు రావు.. అమ్మకే వస్తాయి అంటుంది హిమ.

లేదు.. నాకు వస్తాయిలే అంటుంది సౌందర్య. చెప్పు అయితే అంటుంది. సరే.. ఈరోజు నాదగ్గరే పడుకోండి. మీకు మంచి కథలు చెబుతాను సరేనా అంటుంది సౌందర్య. ఆ తర్వాత దీప పక్క వేస్తుంటుంది. అక్కడికి వస్తాడు కార్తీక్. చేతుల్లో ఏదో పట్టుకొని వస్తాడు. ఏంటది అంటుంది. కానీ.. చూపించడు డాక్టర్ బాబు.

నువ్వు వెనక్కి తిరుగు అంటాడు. తన కళ్లు మూస్తాడు. కళ్లు తెరిచా.. శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానం పుస్తకాన్ని అందిస్తాడు. చూసి చాలా సంతోషిస్తుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఈ పుస్తకం తోడుగా ఉంది అని చెబుతుంది దీప.

నాకు మహాప్రస్థానం పుస్తకం ఇచ్చారు. మీరు ఏది అడిగినా నేను కదానను అంటుంది దీప. జీవితంలో ప్రతి రోజు కొత్త పోరాటమే కదా అంటుంది. నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అంటే అన్నీ పోరాటాలే డాక్టర్ బాబు అంటుంది. బస్తీ నుంచి వచ్చిన దాన్ని కదా. బస్తీ నుంచి లక్ష్మణ్ ఫోన్ చేశాడు. అందరికీ ఆరోగ్యం బాగుండటం లేదట.. అంటుంది. సరే.. అక్కడ హెల్త్ క్యాంప్ పెడదాం అంటాడు.

Karthika Deepam 26 Nov Today Episode : మనమే గెలుస్తున్నాం అని మోనితకు చెప్పిన లాయర్ సురేశ్

మరోవైపు లాయర్ సురేశ్ కు మోనిత ఫోన్ చేస్తుంది. ఎంత వరకు వచ్చింది అని అడుగుతుంది. మనమే గెలుస్తున్నాం అంటాడు సురేశ్. కానీ.. పొరపాట్లు మాత్రం చేయకండి అంటాడు. నేను చెప్పినట్టు చేయండి అంటాడు. తప్పకుండా.. కార్తీక్ మనసు గెలవడమే నాకు కావాల్సింది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.

ప్రియమణిని పిలిచి.. మనం బయటికి వెళ్లాలి త్వరగా రెడీ అవ్వు అంటుంది మోనిత. ఎక్కడికి అని అడగవా అంటుంది మోనిత. అడిగితే మీరు కొప్పడుతారు కదా అమ్మా అంటుంది ప్రియమణి. నాలుగు రోజులు దీప ఇంట్లో పని చేశావో లేదో దీప లౌక్యం నేర్చుకున్నావు అంటుంది మోనిత.

వెళ్లు.. త్వరగా రెడీ అవ్వు. కార్తీక్ ఇంటికి మనం వెళ్లాలి అంటుంది మోనిత. కట్ చేస్తే బస్తీలోని ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తుంటాడు కార్తీక్. ఇంతలో మోనిత అక్కడికి వచ్చి నన్ను, నా బిడ్డను మోసం చేసి ఇక్కడికి వచ్చి పెద్ద ఆదర్శమూర్తిలా సేవ చేస్తున్నావా అంటుంది. దీంతో కార్తీక్, దీప, బస్తీ వాళ్లు అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది