Karthika Deepam 27 Dec Tomorrow Episode : మళ్లీ కార్తీక్ వైద్యం చేయబోతున్నాడా? దీప మనసులో ఉన్నది మోనితకు ఎలా తెలిసింది? బస్తీలో ప్రజావైద్యశాలను ఏర్పాటు చేసిన మోనిత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 27 Dec Tomorrow Episode : మళ్లీ కార్తీక్ వైద్యం చేయబోతున్నాడా? దీప మనసులో ఉన్నది మోనితకు ఎలా తెలిసింది? బస్తీలో ప్రజావైద్యశాలను ఏర్పాటు చేసిన మోనిత

 Authored By gatla | The Telugu News | Updated on :26 December 2021,9:05 am

Karthika Deepam 27 Dec Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. కార్తీక దీపం 27 డిసెంబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 1232 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీప సరుకులన్నీ మోసుకొని రావడం చూసి కార్తీక్ చాలా బాధపెడతాడు. అయ్యో.. దీప ఇవన్నీ నువ్వెందుకు మోసుకొస్తున్నావు. నేను తీసుకొస్తా కదా అంటాడు కార్తీక్. వద్దులే కార్తీక్ బాబు. మీరు మోయలేరు. నాకు అలవాటే కదా. నేను వంటలక్కనే. నాకు ఇవన్నీ పెద్ద కష్టమేమీ కాదు అని చెబుతుంది దీప. ఆ సరుకులను పక్కన పెట్టి.. ఇలా కూర్చో అంటాడు కార్తీక్. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకుంటారు. మిమ్మల్ని చాలా బాధపెడుతున్నాను దీప అంటాడు కార్తీక్. అయ్యో.. అదేం లేదండి.. అని కార్తీక్ కు నచ్చజెబుతుంది దీప. కార్తీక్ కు ఏం అర్థం కాదు. ఏం చేయాలో తోచదు. ఓవైపు దీప కష్టపడుతుంటే చూడలేకపోతాడు.

karthika deepam 27 december 2021 episode

karthika deepam 27 december 2021 episode

దీంతో అలా బయటికి వెళ్లొస్తా అని చెబుతాడు కార్తీక్. దీంతో సరే అంటుంది దీప. కార్తీక్ నడుచుకుంటూ వెళ్తూ.. ఎలాగైనా 3.5 లక్షలు సంపాదించాలని అనుకుంటాడు. లేకపోతే తన పిల్లలు ఏమైపోతారని టెన్షన్ పడతాడు. ఇంతలో పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వస్తుంటారు. పిల్లలు నడుచుకుంటూ వస్తుంటారు. ఇంతలో హిమకు ఒంట్లో సరిగ్గా లేదని చెబుతుంది. దీంతో ఏం కాదులే అని శౌర్య నచ్చజెబుతుంది. ఇంతలో హిమకు వాంతులు అవుతాయి. కార్తీక్ అదే సమయంలో అటునుంచి వెళ్తుంటాడు. హిమను చూసి తనకు మంచినీళ్లు తాగించి ఇంటికి తీసుకెళ్తాడు. మరోవైపు శ్రీవల్లి తన కొడుకుకు బారసాల చేయాలని నిర్ణయించుకుంటుంది. బారసాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నానని అంటుంది. పేరు ఏం పెడదామని అనుకుంటున్నారు అని అడుగుతుంది దీప.

దీంతో ఆనంద్ అని అనుకుంటున్నామని చెబుతుంది శ్రీవల్లి. దీంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. ఆ పేరు ఎందుకు అని అడుగుతుంది దీప. కోటేశ్ కు ఆ పేరు బాగా నచ్చిందట. ఎందుకో.. పిల్లాడిని దత్తత తీసుకున్నప్పటి నుంచి కోటేశ్.. అదే పేరును జపిస్తున్నాడు అంటుంది శ్రీవల్లి.

ఆ తర్వాత నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ ఏదో ఒక పని చేస్తా అంటాడు. మీరు ఇటువంటి పనులు ఏవీ చేయలేరు అంటుంది దీప. నేను పిండి వంటలు చేద్దామనుకుంటున్నా అని అంటుంది దీప. పిండి వంటలు చేసి వాటిని అమ్మి డబ్బులు సంపాదిస్తాను అంటుంది. నేను కూడా టూషన్లు చెబుతాను దీప అంటాడు కార్తీక్.

ఇంతలో రుద్రాణి వస్తుంది. పిల్లలు ఎలా ఉన్నారంటూ వాళ్లను ప్రేమగా పలకరిస్తుంది. పిల్లలకు స్వీట్లు, పండ్లు తీసుకొచ్చి ఇస్తుంది. భోజనాలు అయ్యాయా.. ఈరోజు ఏం వండారు.. అంటూ పిల్లలతో సరదాగా కాసేపు మాట్లాడి రుద్రాణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Karthika Deepam 27 Dec Tomorrow Episode : నేనూ పనిచేస్తా అని చెప్పిన కార్తీక్ కు షాకిచ్చిన దీప

కట్ చేస్తే.. దీప వంట చేస్తూ ఉంటుంది. కార్తీక్ తన దగ్గరికి వెళ్తాడు. ఏంటి కార్తీక్ బాబు.. కాఫీ ఏమైనా కావాలా అని అడుగుతుంది. దీంతో వద్దు అంటాడు కార్తీక్. రుద్రాణి వచ్చిందని మీరు ఏమైనా కంగారు పడుతున్నారా అంటే కంగారు ఏం లేదు కానీ.. ఆవిడ ఏంటో అర్థం కావడం లేదు అంటాడు. మనింటికి వచ్చి స్వీట్లు అది ఇదీ అంటుంది. తన ఆలోచనలు ఏవో నాకు అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్.

ఇంట్లో ఖాళీగా కూర్చోలేకపోతున్నాను. నీ పిండివంటలను అన్నింటినీ నేను మార్కెటింగ్ చేస్తాను అంటాడు. అమ్ముతాను అంటే.. వద్దు కార్తీక్ బాబు.. ఇటువంటి పనులు మీరు చేయకూడదు అంటుంది దీప. మరి ఏం చేయాలి దీప అంటే.. ఇక్కడ ఒక ప్రజా వైద్యశాల పెట్టండి అని చెబుతుంది దీప.

దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. మరోవైపు మోనిత.. బస్తీకి వెళ్లి అక్కడ ఇదివరకు కార్తీక్ ఉచితంగా నడిపించిన ఆసుపత్రిలో నా.. కార్తీక్.. ఆశీస్సులతో.. వంటలక్క ప్రజావైద్యశాల అనే ఆసుపత్రిని పెడుతుంది మోనిత. డాక్టర్ మోనిత కార్తీక్ అని పేరు కూడా పెట్టిస్తుంది. దీంతో బస్తీ వాసులందరూ చూసి షాక్ అవుతారు. బస్తీ వాసులారా మీకు శుభవార్త.. అంటూ చెబుతుంది మోనిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది