Karthika Deepam 29 Jan Today Episode : శౌర్యకు వైద్యం అందక పరిస్థితి విషమం.. శౌర్య అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకొని రుద్రాణి మరో ప్లాన్.. హిమను దత్తత తీసుకోవాలని రుద్రాణి ఏం చేస్తుంది?
Karthika Deepam 29 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 1262 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శౌర్యకు బాగా లేకపోవడంతో ఏం చేయాలో కార్తీక్ కు అర్థం కాదు. నా రౌడీని నేను కాపాడుకుంటాను. ఆపరేషన్ చేసి చాలా రోజులు అయింది. మళ్లీ ఇప్పుడు తిరగబెట్టిందో ఏంటో.. కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని అనుకుంటాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ కోసం రుద్రాణి మనుషులు వెతుకుతూ ఉంటారు. ఇంతలో సైకిల్ మీద వెళ్తున్న కార్తీక్ ను చూసి ఆపుతారు. తప్పుకోండిరా.. అంటాడు కార్తీక్. నన్ను వెళ్లనివ్వండి అంటాడు. ఎక్కడికి వెళ్లేది. అక్క నిన్ను తీసుకురమ్మనది అని చెబుతారు. నేను అర్జెంట్ గా హోటల్ కు వెళ్లాలి.. అక్కడ డబ్బులు తీసుకొని నా కూతురును ఆసుపత్రికి తీసుకెళ్లాలి అంటాడు కార్తీక్.
అబద్ధాలు చెబుతున్నావా అంటారు వాళ్లు. కార్తీక్ ఎంత చెప్పినా వినరు.. దీంతో ఇద్దరి మీద చేయి చేసుకుంటాడు కార్తీక్. తర్వాత సైకిల్ వేసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. దీంతో కార్తీక్ ను వెంబడిస్తారు వాళ్లు. మరోవైపు రుద్రాణి ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గడ్డం గ్యాంగ్ ఎక్కడ చచ్చారో ఏమో అని అనుకుంటుంది రుద్రాణి. వాళ్లు మాత్రం తన వెనుక పరిగెడుతుంటారు. ఇంతలో పిల్లి గడ్డానికి రుద్రాణి ఫోన్ చేస్తుంది. అక్క వాడిని పట్టుకురమ్మన్నది కదా.. ఎలా ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయొద్దు. వాడిని పట్టుకున్నాకే ఫోన్ తీద్దాం అంటాడు పిల్లి గడ్డం. ఎక్కడ చచ్చారురా లిఫ్ట్ చేయండి అని అనుకుంటుంది రుద్రాణి. వీళ్లు ఫోన్ తీయడం లేదు ఏంటి అని అనుకుంటుంది.
మరోవైపు నాన్న వచ్చారా అని దీపను అడుగుతుంది శౌర్య. వచ్చేస్తారు అమ్మా. నీకేం కాదు అంటూ ధైర్యం చెబుతుంది దీప. నన్ను త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లు అమ్మ. నానమ్మ, తాతయ్యను చూడాలని ఉంది అని చెబుతుంది శౌర్య. నీకు ఏం కాదు అత్తమ్మ. నాన్న పెద్ద డాక్టర్ అని చెబుతుంది దీప.
నాన్న నాకు ట్రీట్ మెంట్ చేస్తే నేను బాగవుతాను అమ్మ. నాన్నే చేస్తారు కదా అంటే.. నాన్న పెద్ద డాక్టర్ అమ్మ. నాన్నే నిన్ను బాగుచేస్తారు అని అంటుంది దీప. అందరికీ సాయం చేశారు. అందరితో గొప్ప డాక్టర్ అనిపించుకున్నారు కానీ.. సొంత కూతురుకు వైద్యం చేసుకునే అవకాశం మాత్రం డాక్టర్ బాబుకు రాలేదు అని అనుకుంటుంది దీప.
ఇంతలో శౌర్య కళ్లు మూస్తుంటుంది. స్పృహ కోల్పోతూ ఉంటుంది. ఏం చేయాలో దీపకు అర్థం కాదు. అమ్మ శౌర్యకు ఏం కాదు కదమ్మా అంటుంది హిమ. నానమ్మ తాతయ్యలకు ఫోన్ చేద్దాం. వాళ్లు వచ్చి హాస్పిటల్ కు తీసుకెళ్తారు అంటుంది హిమ.
ఎందుకమ్మా మనం అందరికీ దూరంగా వచ్చేశాం. శౌర్య ఇలా ఉన్నా కూడా మనం ఎవ్వరినీ కలవకూడదా. ఇంకెప్పుడు మనం హైదరాబాద్ కు వెళ్లకూడదా అని అంటుంది హిమ. డాడీ ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది హిమ. వచ్చేస్తారు అని అంటుంది దీప.
శౌర్య మాత్రం తాతయ్య, నానమ్మ అంటూ కలవరిస్తూ ఉంటుంది. ఇంతలో హోటల్ కు వెళ్తాడు కార్తీక్. అక్కడ ఓనర్ ఉండడు. అప్పు కూడా ఉండడు. ఇంతలో రుద్రాణి మనుషులు హోటల్ కు వస్తారు. సారు.. మాతో వచ్చేయ్.. ఏం చెప్పుకుంటావో అక్కతోనే చెప్పుకో.. డబ్బులు కావాలంటే అక్కనే అడుగు. అక్కే ఇస్తుంది అంటారు.
కార్తీక్ ఎంత చెప్పినా వాళ్లు వినరు. దీంతో పదండి.. అక్కడే తేల్చుకుంటాను అని రుద్రాని దగ్గరికి వెళ్తాడు కార్తీక్. మరోవైపు నానమ్మ, తాతయ్యకు ఫోన్ చేయి అమ్మ. వాళ్ల దగ్గర డబ్బులు ఉంటాయి కదా.. వాళ్లను అడిగితే ఇస్తారు. హాస్పిటల్ కు వెళ్దాం అంటుంది హిమ.
Karthika Deepam 29 Jan Today Episode : బాబాయికి ఫోన్ చేయి అమ్మ.. వచ్చి శౌర్యను ఆసుపత్రికి తీసుకెళ్తాడు అని దీపతో చెప్పిన శౌర్య
బాబాయికి ఫోన్ చేయి అమ్మ. హాస్పిటల్ కు వెళ్దాం అమ్మ. శౌర్యకు ఏమైనా అవుతుంది అమ్మ. నాకు భయం వేస్తుంది అంటుంది హిమ. మరోవైపు దీప మాత్రం డాక్టర్ బాబు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అత్తమ్మ నీకు ఏం కాదు.. నేనున్నాను అంటూ శౌర్యకు భరోసా ఇస్తుంది దీప.
కట్ చేస్తే రుద్రాణి దగ్గరికి వెళ్తాడు కార్తీక్. నా కూతురుకు ఒంట్లో బాగోలేదు. నేను మళ్లీ వస్తాను అని చెప్పినా కూడా వీళ్లు అస్సలు వినడం లేదు. నా కూతురు సీరియస్ గా ఉంది. నేను వెళ్లాలి.. వెళ్తున్నాను అంటాడు. అయినా కూడా వినరు. దీంతో ఆమె మనుషులను మళ్లీ కొడతాడు కార్తీక్.
ఒక్కసారి చెబితే మీకు అర్థం కాదా.. నేను డబ్బులు ఇస్తా అని సంతకం పెట్టా కదా. ఇంకా మీ సమస్య ఏంటి.. అంటాడు కార్తీక్. మీ కూతురుకు బాగాలేదు ఒప్పుకుంటున్నాను కానీ.. నా బాకీ కట్టి ఆ తర్వాత హాస్పిటల్ కు తీసుకెళ్తావో.. ఇంకెక్కడికి తీసుకెళ్తావో నీ ఇష్టం. డబ్బలు కట్టి ఇక్కడి నుంచి వెళ్లు అంటుంది రుద్రాణి.
కానీ.. కార్తీక్ మాత్రం వినడు. నేను ఆగను.. నేను డబ్బులు కడతాను. మీ డబ్బులు కట్టకుండా నేను తాడికొండ గ్రామం వదలను అని చెప్పి కార్తీక్ వెళ్లబోతుండగా సారు ఒక్క నిమిషం అంటుంది రుద్రాణి. మరోవైపు దీప.. కార్తీక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.
ఇంతలో అప్పు వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. పాపకు ఒంట్లో బాగాలేదు అంటుంది దీప. పాపకు ఒంట్లో బాగాలేదని హోటల్ ఓనర్ ను బావ అడిగాడట. మీరిద్దరూ భార్యాభర్తలని హోటల్ ఓనర్ చెప్పాడు. ఈ విషయం తెలియగానే నేను ఏమైందో అని ఇక్కడికి వచ్చా అంటాడు అప్పారావు.
అప్పారావు.. ఇక్కడ ఎవరైనా డబ్బులు ఇస్తారా అని అడుగుతుంది. దీంతో మనుషులు మారిపోయారు అక్క అంటాడు. మీరు కొత్తవాళ్లు కదా.. ఎవ్వరూ ఇవ్వరు అంటాడు. మరోవైపు రుద్రాణి కార్తీక్ కు డబ్బులు ఇస్తుంది. తీసుకో సారు.. పిల్లకు బాగాలేదు అంటున్నావు కదా.. తీసుకో. రూ.5 లక్షలు తీసుకొని వైద్యం చేయించు అంటుంది రుద్రాణి.
ఇంకా అవసరం అయితే చెప్పు ఇస్తాను అంటుంది రుద్రాణి. ఇంతలో పిల్లిగడ్డం అదేంటి ఆయనకు డబ్బులు ఇస్తున్నావు అంటాడు. దీంతో అతడిని కొడుతుంది. పిల్లలంటే ఇష్టం.. పిల్లలంటే ప్రేమ. అందుకే ఈ డబ్బు ఇస్తున్నాను. తీసుకో సారు.. నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది నీ బాధేంటో.
నీ కూతురుకు ఏమైందో తీసుకెళ్లి వైద్యం చేయించు అని డబ్బు ఇస్తుంది. కానీ.. కార్తీక్ తీసుకోడు. ఆ తర్వాత శౌర్యను ఆసుపత్రికి తీసుకెళ్తారు. కానీ.. ఎక్కడా వైద్యం చేయరు. ఆసుపత్రికి వచ్చిన రుద్రాణి… నీ చిన్నకూతురును నాకిచ్చేయ్. నీ అప్పు మొత్తం తీర్చేస్తా అంటుంది. శౌర్యకు వైద్యం కోసం డబ్బులు కూడా ఇస్తా అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.