Karthika Deepam 5 April Today Episode : పెద్దయిన ఆనంద్.. అరుణ, లక్ష్మణ్ హత్య.. తన తల్లిదండ్రుల కోసం వెతుకుతున్న ఆనంద్ కు హిమ, శౌర్య కనిపిస్తారా?
Karthika Deepam 5 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 ఏప్రిల్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1318 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటే నువ్వు.. నోటికి ఎంత వస్తే అంత అనడమేనా. ఒక మంచి మర్యాద తెలియదా అని అడుగుతుంది సౌందర్య. నాకు తెలుసు. మీ ఆవిడ నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకు అని ఆనంద రావుతో అంటుంది. నాకు మమ్మీ లేదు. మీరొక్కరే ఉన్నారు అంటుంది స్వప్న. ఎప్పుడైతే నా కూతురును అనరాని మాటలు అన్నదో అప్పుడే నాకు మమ్మీ లేదని డిసైడ్ అయ్యాను. లేని బంధాలు, బంధుత్వాలు కలుపుకోకూడదని చెప్పండి అంటుంది.
మీ మనవరాలిని నా కొడుకుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా? ఎప్పుడైతే నా కూతురును ఆ మాట అందో అప్పుడే నాకు, తనకు ఈ బంధం తెగిపోయింది. అది ఈ జన్మకు జరగదని చెప్పండి డాడీ అంటుంది స్వప్న. నీకు తను భార్య కావచ్చు కానీ.. తను నాకు ఎప్పటికీ అమ్మ కాదు. ఆ బంధం ఎప్పటికీ కలవదు అంటుంది స్వప్న. కళ్ల ముందు జరిగిన అవమానం కాళ్లు పట్టుకున్నా మరిచిపోను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది స్వప్న.
తనకు ఫుడ్ వడ్డించి అక్కడి నుంచి వెళ్తా అని చెబుతుంది జ్వాల. కూరలు బాగున్నాయి అంటాడు. మీ మేడమ్ నాకు గుడిలో కలిసింది. తను ఏమన్నదో మీకు ఇప్పటికే ఎక్స్ ట్రా చెప్పే ఉంటాడు అంటుంది. చెప్పాడు అంటుంది. తను ఏంటి అంత రఫ్ గా మాట్లాడుతున్నారు అంటుంది జ్వాల.
నన్ను కొట్టింది. ఇంకెవరన్నా అయితేనా నా సంగతి ఏంటో చూపించేదాన్ని. మీ వైఫ్ కదా అని గౌరవించాను. నేను కూడా గట్టిగానే మాట్లాడాను. ఆ విషయంలో నేనే మీకు సారీ చెప్పాలి అంటుంది జ్వాల. గుడి దగ్గర స్వప్న ప్రవర్తనకు నా తరుపున నేను సారీ చెబుతున్నాను అంటాడు.
మీమీద ఉన్న గౌరవంతోనే నేను కొంచెం తగ్గాను అంటుంది జ్వాల. మరోవైపు శౌర్య గురించి ఆలోచిస్తూనే ఉంటుంది హిమ. అత్తయ్య అన్నదానికి సారీ హిమ అంటాడు నిరుపమ్. ఇన్నేళ్లుగా జరిగిన దానిని తలుచుకుంటూ నేను ఒకరకమైన పిరికిదానిలా బతుకుతున్నాను.. ఇప్పుడు నేను దాని నుంచి బయటపడాలని అనుకుంటున్నా అంటుంది హిమ.
Karthika Deepam 5 April Today Episode : మరోసారి మోనిత ఇంటికి వెళ్లిన శౌర్య
మరోవైపు శౌర్య మరోసారి మోనిత ఇంటికి వెళ్తుంది. ఇంట్లోకి ఎవరు వస్తున్నారు అనుకుంటుంది. ఆ అవసరం ఒక్క హిమే ఉంది. ఆ రాక్షసి ఇక్కడే ఉందా. ఇక్కడికి వచ్చి వెళ్తోందా అని అనుకుంటుంది. ఇంతలో ఆ ముసలావిడ అక్కడ ఉంటుంది.
ఏమైంది అక్కడ దాక్కున్నావు అంటే.. ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయని భయమేస్తోంది అంటుంది. అటువంటివేవీ పుట్టించకు అంటుంది. తన వివరాలు ఏవైనా తీసుకున్నావా అని అడుగుతుంది. దీంతో లేదమ్మా అంటుంది.
ఇంతలో తనకు ఆనంద్ గుర్తొస్తాడు. ఇంతకీ ఆనంద్ ఎక్కడున్నాడు.. మోనిత ఆంటి ఆనంద్ ను ఎక్కడికి తీసుకెళ్లింది అని అనుకుంటుంది శౌర్య. మరోవైపు ఆనంద్ కూడా పెరిగి పెద్దవుతాడు. తన అమ్మ గురించే బాధపడుతూ ఉంటాడు ఆనంద్.
అమ్మానాన్న మీ పేర్లేంటో నాకు తెలియదు. అమ్మ.. డైరీలో నా కార్తీక్.. నా కార్తీక్ అని రాసి ఉంది. బహుశా నాన్న పేరు కార్తీక్ ఏమో అని అనుకుంటాడు ఆనంద్. ఇంతలో తనకు ఒక ముసలావిడ అన్నం ఉన్న ప్లేట్ ను విసిరేస్తుంది. ఈరోజు ఏం కూర చేశారు పెద్దమ్మ అంటే.. నోర్మూసుకొని పెట్టింది తిను అంటుంది.
మా అమ్మనాన్నల గురించి చెప్పు పెద్దమ్మ అంటాడు. నాకు తెలియదు. మీ అమ్మానాన్నలు డాక్టర్ అని మాత్రం నాకు తెలుసు అంటుంది. నాకు అక్కాచెల్లి ఎవరైనా ఉంటారు కదా.. అంటాడు. దీంతో లేరురా.. అంటాడు. నా చెల్లి అరుణ, తన భర్త లక్ష్మణ్.. ఇద్దరినీ మీ అమ్మ ఇచ్చిన ఆస్తి కోసం మా బంధువులు చంపేశారు. చివరి క్షణంలో అరుణ నాకు నిన్ను అంటగట్టి వెళ్లిపోయింది అంటుంది.
మరోవైపు మణికొండకు వెళ్లాలి అని ఓ మహిళ జ్వాల ఆటో ఆపుతుంది. తనను ఆటోలో తీసుకెళ్తుంది జ్వాల. తన మనవడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని.. ఈ వయసులో కూడా పనిచేయాల్సి వస్తుందని చెబుతుంది ఆ మహిళ. ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఆ ఇంటి వాళ్లు ఇంతలా బాధపడతారా అని అనుకుంటుంది శౌర్య.
అయినా.. నాకోసం వాళ్లు వెతకనప్పుడు నేనెందుకు బాధపడాలి. నా కోపం అంతా దాని మీదే అనుకుంటుంది శౌర్య. ఆ మహిళ పనికి కుదిరింది ఎక్కడో కాదు.. సౌందర్య ఇంట్లోనే. అక్కడ ఆటోను ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.