Karthika Deepam : నచ్చినట్టు చేసుకోండి!.. కార్తీక దీపం డాక్టర్ బాబు షాకింగ్ కామెంట్స్
Karthika Deepam : డాక్టర్ బాబు అంటే తెలియని వాళ్లెవ్వరూ ఉండరు. మామూలుగా డాక్టర్ బాబు అంటే వైద్యం చేస్తాడు. కానీ ఈ డాక్టర్ బాబు మాత్రం యాక్టింగ్ చేస్తాడు. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల చేస్తున్న యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందే. కార్తీక్, డాక్టర్ బాబు పాత్రలపై ఎన్ని రకాల ట్రోల్స్, మీమ్స్ జరుగుతుంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి డాక్టర్ బాబే మీమ్స్, ట్రోల్స్, సెటైర్లు వేస్తే ఎలా ఉంటుంది? అది వినడానికే చాలా కొత్త ఉంది కదా. కానీ నిరుపమ్‌కు రచనలో ప్రావీణ్యం ఉంది.

Karthika Deepam Doctor Babu Nirupam Paritala Funny Post On STill
ఎందుకంటే ఆయన తండ్రి ఓంకార్ ఓ రచయిత. ఎన్నో సీరియళ్లకు కథలు అందించారు. కథనాలు అందించారు. ఎన్నో సీరియల్స్‌లో నటించారు. తండ్రి నుంచి రచన అనేది వారసత్వంగా వచ్చినట్టుంది. మాటలు, ప్రాసలతో పంచులు వేయడంలో నిరుపమ్ స్టైలే వేరు. సోషల్ మీడియాలో డాక్టర్ బాబు వేసే పంచులు వేరే లెవెల్‌లో ఉంటాయి. తాజాగా అదిరిపోయే పోస్ట్ ఒకటిచేశాడు. అందులో అందరినీ తికమక పెట్టేశాడు. క్యాప్షన్‌తో అందరినీ గందరగోళానికి గురి చేశాడు.
Karthika Deepam : వెరైటీ పోస్ట్ చేసిన డాక్టర్ బాబు

Karthika Deepam Doctor Babu Nirupam Paritala Funny Post On STill
పోజ్ పెట్టడానికి చాలా థింక్ చేశాడట.. థింక్ చేయడమే ఒక పోజ్ ఎందుకు కాకూడదు అని పెట్టాడట. ‘స్టిల్ కోసం థింక్ చేస్తుంటే. థిక్ చేయటమే ఎందుకు స్టిల్ అవ్వకూడదు అని థింక్ చేసి పెడుతున్న పోస్ట్ ఇది. థింకింగ్ నచ్చితే లైక్ చేయండి…పోజ్ నచ్చితే షేర్ చేయండి.. ఏదీ నచ్చకపోతే నచ్చినట్టు చేసుకోండి. ఇదో సరదా’ పోస్ట్ అని నిరుపమ్ తన స్టైల్లో ప్రాసతో ఇచ్చి పడేశాడు. నిరుపమ్ క్యాప్షన్ చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.