Shobhan Babu : పొట్టి వీరయ్య జీవితాన్ని మార్చే ఐడియా ఇచ్చిన శోభన్ బాబు!
Shobhan Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తెలంగాణ నటులకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు. తమ ప్రాంతానికి చెందిన వారినే అగ్ర తాంబూలం ఇచ్చేవారు. తెలంగాణ రాకముందు వరకు కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వారికి పెద్దగా హీరో పాత్రలు వచ్చేవి కాదు. కేవలం కమెడియన్స్, సైడ్ క్యారెక్టర్ పాత్రలు మాత్రమే ఇచ్చేవారు. దర్శకులకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ఎంత టాలెంట్ ఉన్నా ఎదగనిచ్చేవారు కాదని చాలా మంది సీనియర్ దర్శకులు, నటీనటులు వాపోయేవారు.
ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన కూడా ఇండస్ట్రీలో మంచి స్థానంలో నిలదొక్కుకోగలుగుతున్నారు. హీరోలు,క్యారెక్టర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, కమెడియన్స్ ఇలా ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. తెలంగాణ యాసను ఒకప్పుడు కేవలం జోకులకు వాడేవారు. ఇప్పుడు ఆ యాస లేకపోతే సినిమాలే నడవని పరిస్థితి నెలకొంది. అయితే, తెలంగాణ రాని సమయంలో కూడా సూర్యాపేటకు చెందిన ఒక యాక్టర్ కష్టపడి ఏకంగా 400లకు పైగా సినిమాల్లో నటించాడు. ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
Shobhan Babu : ఏకైక పొట్టి కమెడియన్..
తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న ఏకైక పొట్టి కమెడియన్ వీరయ్.. ఈయన పేరు వినే ఉంటారు. ఒకవేళ వినకపోయినా వెండితెరపై ఆయన్ను చూసే ఉంటారు.ఈయనొక మరగుజ్జు యాక్టర్. అప్పట్లోనే 400లకు పైగా సినిమాలలో నటించి మంచిపేరు తెచ్చుకున్నారు. పదో తరగతి అనంతరం 1967లో మద్రాస్ కు వెళ్లాడు.అక్కడ ఈయనకు శోభన్ బాబు కనిపించాడు.తాను 10వ తరగతి వరకు చదువుకున్నానని, సినిమాలో నటించే అవకాశం ఇప్పించాలని శోభన్ బాబును అడిగాడు. దీంతో శోభన్ బాబు ఆయనకు ఒక మంచి సలహా ఇచ్చారు. అది అతని జీవితాన్నే మార్చేసింది.
బావ నారాయణ గారు లేదా విఠలాచార్య సినిమాల్లో అవకాశాలు లభిస్తాయని వీలైతే వారిని వెళ్లి అడగాలని సలహా ఇచ్చారు శోభన్ బాబు.ఆ తర్వాత వీరయ్య విఠలాచారి గారిని కలిశారు. విఠలాచార్యతో జరిగిన సంభాషణల తర్వాత పొట్టి వీరయ్యకు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఈయనకు రూ.500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అగ్గి వీరుడు అనే సినిమాతో పొట్టి వీరయ్యకు అవకాశం కలిగించారు విఠలాచార్య.ఇక అప్పట్నుంచి వీరయ్య 400 చిత్రాలలో నటించడం పూర్తి చేశారు.అయితే, పొట్టి వీరయ్య తెలుగులోనే కాకుండా తమిళ్,కన్నడ,మలయాళం భాషలలో చాలా బాగా నటించి ప్రేక్షకుల మనుషులను దోచుకున్నాడు.