Karthika Deepam Monitha : కార్తీకదీపం ముగిసినా జోడి కొనసాగుతోందే.. ఆదిత్యతో మోనిత సందడి

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 28, 2022, 8:30 pm

Karthika Deepam Monitha : కార్తీకదీపం సీరియల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, ఆదిత్య పాత్రలు ఎగిరిపోయాయి. డాక్టర్ బాబు, వంటలక్క చనిపోయారు. వారు పోయారని మోనిత కూడా పోయింది. కానీ ఆదిత్య పాత్రను ఎందుకు లేపేశారో ఎవ్వరికీ తెలియడం లేదు. కనీసం ఆ పాత్ర ఊసే లేకుండా చేసేశారు. కానీ మోనిత, ఆదిత్యలు మాత్రం ఇంకా కలిసే సందడి చేస్తున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆదిత్యతో క్లోజ్‌గా ఉన్న ఫోటోలను మోనిత షేర్ చేసింది. స్పెషల్‌గా బర్త్ డే విషెస్ చెబుతుంది. మామూలుగా కార్తీక దీపం సీరియల్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ ఈ ఇద్దరూ ఇలానే క్లోజ్‌గా ఉండేవారు.

అయితే నెటిజన్లు మాత్రం సెటైర్లు వేసేవారు. నీకు వదిన అవుతుంది.. మోనితతో ఎందుకు ఉన్నావ్.. మరిదితో అలా ఉన్నావేంటి? అంటూ శోభా శెట్టి, యశ్వంత్‌ల మీద సెటైర్లు వేస్తూ ఉండేవారు. అయినా అవన్నీ మోనిత, ఆదిత్యలు పట్టించుకునేవారు కాదు. ఇక శోభా శెట్టి అయితే తన యూట్యూబ్ వీడియోల్లో ఎక్కువగా యశ్వంత్‌ను చూపించేది. అతని హోం టూర్ కూడా చేసేసింది. అంతే కాకుండా శోభా శెట్టి తన సొంత ఖర్చులతో ఓ ప్రైవేట్ ఆల్బమ్ తీసింది. అందులో ఆదిత్య, శోభా శెట్టి చేసిన రొమాన్స్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అలా ఈ ఇద్దరూ నెట్టింట్లో చేసే హంగామా మూములుగా ఉండదు.

Karthika Deepam Monitha Shares Aditya Fame Yashwanth Pics

Karthika Deepam Monitha Shares Aditya Fame Yashwanth Pics

అయితే ఈ ఇద్దరూ ఇప్పుడు బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. మోనిత, ఆదిత్యలకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. కార్తీక దీపంలో పాత్రలు ముగిశాక. వీరి సందడి బాగా తగ్గింది. తాజాగా మోనిత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆదిత్యకు బర్త్ డే విషెస్ చెప్పిన తీరు అందరినీ మెప్పిస్తోంది. నా ఈ జీవితానికి బెస్ట్ ఫ్రెండ్.. ఎంతో మంచి వ్యక్తి.. హ్యాపీ బర్త్ డే.. జీవితంలో నీకు అంతా మంచే జరగాలి.. దానికి నువ్ అర్హుడివి.. ఫుల్ ఎంజాయ్ చేయ్.. హ్యాపీ బర్త్ డే అని ఆదిత్యతో దిగిన ఫోటోలను షేర్ చేసింది మోనిత. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp