Karthika Deepam Nirupam : మంజుల నగల షాపింగ్.. దేవుడా అంటూ దండం పెట్టుకున్న నిరుపమ్

Authored By aruna | The Telugu News | Published on: August 3, 2022, 7:00 pm

Karthika Deepam Nirupam : బుల్లితెరపై మంజుల, నిరుపమ్ ఎంత సందడి చేశారో.. జంటగా కనిపించి, నటించి ఎంత మంది అభిమానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చంద్రముఖి సీరియల్‌తో వీరి ప్రయాణం మొదలైంది. ఈ సీరియల్‌తోనే కలిశారు. అక్కడే వీరి స్నేహం మొదలైంది. అది ప్రేమగా మారింది. సీరియల్ ముగిసే లోపు పెళ్లి కూడా జరిగింది. అలా మొత్తానికి ఈ ఇద్దరూ జోడిగా మారారు. అయితే నిరుపమ్ ఇప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. మంజులకు అంతగా ఆఫర్లు రావడం లేదు. నిరుపమ్ నటించిన కార్తీక దీపం, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్స్ అద్భుతంగా నడిచాయి. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో నిరుపమ్‌ మూడు నాలుగేళ్లు ట్రెండ్ అయ్యాడు. డాక్టర్ బాబు భార్యగా నిరుపమ్ రియల్ వైఫ్ మంజుల కూడా ఫేమస్ అయింది.

ఇప్పుడు ఆ ఫేమ్‌ను అలా కంటిన్యూ చేసేందుకు ఈ సోషల్ మీడియా వేదికలను ఎంచుకున్నారు. ఇన్ స్టాగ్రాం, యూట్యూబ్ వీడియోలు అంటూ బాగానే సందడి చేస్తున్నారు. పర్సనల్ విషయాలు షేర్ చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ జోడి. మంజుల నిరుపమ్ అనే ఈ యూట్యూబ్ చానెల్ వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొత్త కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాలతో వీడియోలు చేస్తుంది. ఇక ఇందులో ఎక్కువగా వారి వారి వ్యక్తిగత విషయాల మీద స్పందిస్తుంటారు. అలా వారి గురించి ఇంత వరకు తెలియని విషయాలు చెబుతుండటంతో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా వరలక్ష్మీ వ్రతంకు సంబంధించిన షాపింగ్ కోసం వెళ్తూ వీడియోను చేశారు.

Manjula Nirupam Vara Lakshmi Vratham Shopping Vlog

Karthika Deepam Nirupam Manjula Nirupam Vara Lakshmi Vratham Shopping Vlog

ఇందులో సీఎంఆర్ గోల్డ్ షాప్ అంటూ అలా అడ్వర్టైజ్ చేస్తూనే వీడియోలో వాళ్లకు కావాల్సింది వాళ్లు చేశారు. వరలక్ష్మీ వ్రతం కాబట్టి.. ఎంతో కొంత గోల్డ్ కొనాలని మంజుల అంటుంది. అలా కొంటె రెట్టింపు మళ్లీ మనకు వస్తుంది అని తన నమ్మకం అని, అనుభవంతో చెబుతున్నానని అంటుంది. అలా ఎలా వస్తుంది? అని నిరుపమ్ అడుగుతాడు. కొనేశక్తి ఇస్తుంది అని మంజుల చెబుతుంది. ఓహో కొనే శక్తి నాకు ఇస్తుంది.. అలా నీకు డబుల్ అవుతాయ్ అని నిరుపమ్ కౌంటర్ వేస్తాడు. ఇలా తన భార్య షాపింగ్ మీద కౌంటర్లు వేస్తాడు. దేవుడా షాపింగ్ బిల్ తక్కువయ్యేట్టు చూడు అంటూ దండం పెట్టేస్తాడు నిరుపమ్.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp