Bimbisara Movie : బింబిసార చూసి భయపడ్డ ప్రభాస్.. ఫ్యాన్స్ ఆగ్రహం
Bimbisara Movie : దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం లో తెరకెక్కిన సీతారామం సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ శుక్రవారం సీతారామం విడుదల కాబోతున్న నేపథ్యం లో నేడు భారీ ఎత్తున రిలీజ్ ఈవెంట్ అని ప్లాన్ చేశారు. ఈ సినిమాను అశ్వినీదత్ నిర్మించిన విషయం తెలిసిందే. అశ్వినీదత్ నిర్మాణంలోనే ప్రభాస్ ప్రాజెక్టు కె సినిమాని చేస్తున్నాడు. కనుక సీతరామం సినిమా యొక్క రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ని ఆహ్వానించడం, ఆయన ఓకే అనడం అంతా జరిగిపోయింది. కానీ చివరి నిమిషంలో ప్రభాస్ రావడం లేదని సమాచారం అందుతోంది. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన సంఘటన నేపథ్యంలోనే ప్రభాస్ సీతరామం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పోవడానికి కారణం అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అభిమానం పేరుతో ప్రేక్షకుల ను ఆహ్వానించి వారిని ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదని ప్రభాస్ భావిస్తున్నాడట. అందుకే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనకుండా సినిమా కోసం ఒక వీడియో బైట్ విడుదల చేసే అవకాశం ఉందట. దాంతో సినిమాకి కావాల్సిన ప్రమోషన్ వస్తుందని అంతా భావిస్తున్నారు. కానీ ప్రభాస్ అభిమానులు మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. బింబిసారలో జరిగిన సంఘటన ఇక్కడ జరుగుతుందని ప్రభాస్ రాకపోవడం అవివేకము అంటూ వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ఇతర విషయాల వ్యవహారంలో జరిగిన తప్పిదాల కారణంగానే అలా జరిగింది. కానీ ఈ సినిమాకు అలా జరగదని ప్రభాస్ రావాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చివరి నిమిషంలో ప్రభాస్ మనసు మార్చుకొని నేడు సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఏమో చూడాలి. ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఉన్నాడట. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఈయన సినిమా సలార్ షూటింగ్ పునః ప్రారంభంకు రెడీ గా ఉంది. అవి కాకుండా రాజా డీలక్స్ మరియు స్పిరిట్ సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు. ఆ రెండు సినిమాలు షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. బాలీవుడ్లో సిద్ధార్థ్ ఆనంద్ తో కూడా ఒక సినిమాను ప్రభాస్ చేయబోతున్న విషయం తెలిసిందే.