Anchor Suma : యాంకర్ సుమకే పంచ్‌లు.. వీళ్లెక్కడ దొరికార్రా బాబు అనుకుందేమో

Advertisement

Anchor Suma : బుల్లితెరపై యాంకర్ సుమను కామెడీ టైమింగ్‌లో ఢీ కొట్టేవారెవ్వరూ ఉండరు. స్టేజ్ మీద సుమ కనిపిస్తే కాలు పంచ్‌ల వర్షం కురవాల్సిందే. షోలో అయినా, సోషల్ మీడియాలో అయినా సుమ కౌంటర్లు మాత్రం మారవు. సుమ హోస్ట్‌గా చేసే షోల్లో అప్పుడప్పుడు ఆమెకే రివర్స్ పంచ్‌లు పడుతుంటాయి. తాజాగా సుమకు అలాంటి కొన్ని పంచులే పడ్డాయి. కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటించిన బెదురులంక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కోసం సుమ అడ్డా షోకు వచ్చింది టీం.

Advertisement

కార్తికేయ, నేహాశెట్టి, క్లాక్స్, శ్రీకాంత్ అయ్యంగార్‌లు ఈ షోకు గెస్టులుగా వచ్చారు. ముందు శ్రీకాంత్, క్లాక్స్‌లు ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నేహ శెట్టి, కార్తికేయలు వచ్చారు. ముందు మీరు (శ్రీకాంత్, క్లాక్స్‌) వచ్చారు కాబట్టి.. ఇండస్ట్రీకి కూడా ముందు మీరే వచ్చారు కదా? అని సుమ కౌంటర్ వేస్తుంది. నువ్వే ముందు వచ్చావ్ అని సుమకు శ్రీకాంత్ కౌంటర్ వేస్తాడు. ముందు నేను వచ్చినా.. నేనేం చేస్తూ ఉన్నానా? అని గమనించి ఆ తరువాత మీరు వచ్చారు కదా? అని సుమ అంటుంది. ఇండస్ట్రీ కంటే ముందు నుంచీ నువ్ ఉన్నావ్ అని అంటున్నానంటూ సుమ పరువుతీశాడు శ్రీకాంత్ అయ్యంగార్.

Advertisement
Kartikeya Neha Shetty Clax Srikanth Iyengar Bedurulanka Team In Anchor Suma Add Show
Kartikeya Neha Shetty Clax Srikanth Iyengar Bedurulanka Team In Anchor Suma Add Show

ఆ కుర్చీని మడతపెట్టి.. అనే డైలాగ్‌ను కూడా షోలో వాడారు.. వాట్ కుర్చీ అని నేహా అడిగితే.. అలాంటివి తెలుసుకోవద్దు.. తెలుసుకున్నా.. నాలా తెలియన్టటుగా ఉండాలి అని సుమ కవర్ చేస్తుంది. ఇక కార్తికేయ, నేహాలు సీనియర్ ఎన్టీఆర్‌లా డ్యాన్స్ వేశారు. చివరకు నేహా బ్యాక్ మీద కార్తికేయ కొడతాడు. ఏసేశాడు.. బాగా ఏసేశాడు అని సుమ కౌంటర్లు వేస్తుంది. మరో సందర్భంలో కార్తికేయ, క్రాక్స్ కలిసి స్కిట్ వేస్తారు. మీ నాన్న గారా? అని సుమ అడిగుతుంది. కాదు ఆ వయసున్న వాడ్ని అంటూ క్రాక్స్ కౌంటర్లు వేస్తాడు. ఇలా ప్రతీ సారి సుమకు ఏదో ఒక కౌంటర్ పడుతూనే వచ్చింది.

Advertisement
Advertisement