Katrina Kaif : విక్కీ కౌశల్‌తో కత్రినా కైఫ్ మ్యారేజ్.. వెన్యూ ఫిక్స్..?
Katrina Kaif : బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా కనబడుతుంది. ఈ అందాల భామ బాలీవుడ్‌లో సూపర్ హిట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా నటించింది. తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో కథనాయికగా నటించింది.అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ మ్యారేజ్ గురించి చాలా కాలం నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, ఆ భామ సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తోంది. 41 ఏళ్ల వయసున్న ఈ భామ తాజాగా యంగ్ హీరోతో మ్యారేజ్‌కు ఓకే చెప్పిందన్న వార్త ప్రజెంట్ బీ టౌన్ సర్కిల్స్‌లో హల్ చల్ చేస్తోంది. యంగ్ హీరో విక్కీ కౌశల్‌తో చాలా కాలం పాటు ప్రేమాయణం జరిపిన కత్రినా కైఫ్ త్వరలో అతడిని మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ సినీ వర్గాల టాక్.

katrina kaif marriage fixed with vicky kaushal
చాలా రోజుల పాటు లవ్ బర్డ్స్‌గా కొనసాగిన కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ ఇటీవల ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని, ఇక పెళ్లి ఒక్కటే మిగిలిపోయిందని అనుకుంటున్నారు. బీ టౌన్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమచారం ప్రకారం వచ్చే నెల 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ కోటలో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ మ్యారేజ్ ఘనంగా జరగబోతుంది. రాజస్థాన్ రాంథమ్‌బోర్ జాతీయ పార్కుకు 30 నిమిషాల దూరంలో ఈ కోట ఉంది. అయితే తమ పెళ్లి గురించి ఇటు విక్కీ కౌశల్ కాని అటు కత్రినా కైఫ్ కాని ఎటువంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. కాగా, మ్యారేజ్‌కు హాజరయ్యే సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఏర్పాట్లు కూడా అప్పుడే చేసినట్లు టాక్.
Katrina Kaif : యంగ్ హీరోతో పెళ్లికి సిద్ధమైన కత్రినా కైఫ్..!
చూడాలి మరి..మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజముందో.. ఇక కత్రినా కైఫ్ మ్యారేజ్ విషయమై బాలీవుడ్ సినీ ప్రముఖులు ఎలా రియాక్ట్ అవుతారో.. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందోనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

katrina kaif marriage fixed with vicky kaushal