నీ అసలు రంగు తెలియదు.. డైరెక్టర్‌పై కీర్తి సురేష్ కామెంట్స్

0
Advertisement

Keerthy suresh : నితిన్ కీర్తి సురేష్ జంటగా వస్తోన్న రంగ్ దే సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. రంగ్ దే సినిమా మార్చి 26న రాబోతోంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ ఈవెంట్‌లో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. దర్శకుడిపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందరి ముందు ఆ మాట అనడంతో అంతా షాక్ అయ్యారు.

దాదాపు మూడేళ్ల తరువాత ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను.. మహానటి తరువాత మళ్లీ ఇలా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది.. ఈసినిమాలో అను పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. వెంకీ వచ్చి కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాను అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే దర్శకుడి ప్రస్థావన వచ్చే సరికి కీర్తి సురేష్ టాపిక్ డైవర్ట్ చేసేసింది. వెంకీ.. నీ గురించి అందరూ ఏంటి ఇలా చెబుతున్నారు.. నువ్ సైలెంట్.. అమాయకుడివి అని అంటున్నారు అని కీర్తి సురేష్ కౌంటర్ వేసింది.

Keerthy suresh about Venky atluri at Rang de event
Keerthy suresh about Venky atluri at Rang de event

Keerthy suresh : నీ అసలు రంగు తెలియదు.. డైరెక్టర్‌పై కీర్తి సురేష్ కామెంట్స్

నీ అసలు రంగు వీరిలో ఎవ్వరికీ తెలియదనుకుంటాను.. అని కీర్తి సురేష్ అనేసింది. వెంటనే మళ్లీ అది సరదాగానే అన్నాను అని కవర్ చేసేసింది. అయితే సినిమా గురించి మాట్లాడుతూ.. రంగ్ దే అందరికీ నచ్చుతుందని, అను అర్జున్ కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతుందని, అయిందని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. నితిన్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.. సినిమా ద్వారా మేం మంచి స్నేహితులమయ్యామని చెప్పుకొచ్చింది.

Advertisement