Keerthy Suresh : కీర్తి సురేష్‌ని ఆట పట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్… మహానటి ఫిదా..!
ప్రధానాంశాలు:
Keerthy Suresh : కీర్తి సురేష్‌ని ఆట పట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... మహానటి ఫిదా..!
Keerthy Suresh : మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

Keerthy Suresh : కీర్తి సురేష్‌ని ఆట పట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్… మహానటి ఫిదా..!
Keerthy Suresh కీర్తి తెలివితేటలు..
కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది.
ఇక కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.ఐస్‌క్రీమ్ అమ్మే వ్యక్తి దానిని ఇవ్వకుండా కీర్తి సురేశ్‌ను చాలాసేపు ఆటపట్టించి ఆ తర్వాత యథావిధిగా ఇచ్చేశాడు. ఇక అప్పుడు కీర్తి కూడా ఐస్‌క్రీమ్ అమ్మే వ్యక్తికి డబ్బులు ఇవ్వబోతూ వాళ్ల టెక్నిక్‌నే వాళ్లపై ప్రయోగించింది. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, అటూ ఇటూ తిప్పుతూ వాళ్లను ఆటపట్టించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
So cute 🥰 @KeerthyOfficial#keerthysuresh pic.twitter.com/CJYSdmo5DN
— Cine View (@CineView786) March 21, 2025