Keerthy Suresh: కీర్తి సురేష్ పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుందా? వ‌రుడెవ‌రో తెలుసా?

Advertisement

Keerthy Suresh : కీర్తి సురేష్‌.. ఈ అమ్మ‌డి పేరు చెబితే మ‌నంద‌రికి మ‌హాన‌టి సినిమా గుర్తుకొస్తుంది. ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో తెగ ఆక‌ట్టుకుంది. క్యూట్ అందంతో కూడా అల‌రించింది. నిజానికి మహానటి సినిమాతో హిట్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నా ఆమె ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ దాదాపు డిజాస్టర్ ఫలితాలు అందుకుంటూ వస్తున్నాయి. మహానటి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్లిన ఆమె దాదాపు ఆ లేడీ ఓరియంటెడ్ సినిమాలన్నీ సినిమాలతో డిజాస్టర్ ఫలితాలు అందుకుంది.తాజాగా కీర్తీ సురేష్‌ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా జరుగుతుంది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడు అడుగులు వేయటానికి సిద్ధమవుతున్నట్లు టాక్‌. పెళ్లికొడుకు వ్యాపారవేత్త అని, రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతుంది.

Advertisement

Keerthy Suresh : త్వ‌ర‌లో గుడ్ న్యూస్..

ఈ వార్త‌లు నిజ‌మైతే త్వ‌ర‌లో కీర్తి సురేష్ ఇంట పెళ్లి బాజాలు మోగ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ గాసిప్‌లపై కీర్తి సురేష్‌ ఇప్పటి వరకూ స్పందించలేదు. సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నటి కీర్తీ సురేష్‌ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. చేతి నిండా సినిమాలో బిజీగా ఉన్న కీర్తి అప్పుడే పెళ్లి చేసుకుంటారా? అనే సందేహం కూడా కలుగుతుంది. అందులో ఆమె వయసు 29 మాత్రమే. ఆఫర్స్ వస్తుంటే 40 ఏళ్ళు వచ్చినా పెళ్లిళ్లు చేసుకోరు. మరి ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Advertisement
keerthy suresh marriage to bevery soon
keerthy suresh marriage to bevery soon

కీర్తి సినీ ఇండ‌స్ట్రీలోకి రావ‌డానికి కార‌ణం ఆమె ఫ్యామిలీ కూడా సినిమా నేప‌థ్యం కావ‌డ‌మే. కీర్తి సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కీర్తి తల్లి మేనక ఒకప్పటి హీరోయిన్ కాగా తండ్రి సురేష్ కుమార్ డైరెక్టర్. వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కీర్తి కెరీర్ మొదలైంది. ఆమెకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మాత్రం మహానటి. ఒక్కసారి కీర్తి ఇమేజ్ మొత్తం మార్చేసిన ఆ మూవీ పరిశ్రమలో నిలదొక్కునేలా చేసింది. ప్రస్తుతానికి కీర్తి సురేష్ తెలుగు, తమిళ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి హీరోగా నటిస్తున్న వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమాలో ఆయనకు సోదరి పాత్రలో నటిస్తోంది.

Advertisement