Kiara Advani : కియారాతో విజయ్ దేవరకొండ.. రాత్రంతా పార్టీతో రచ్చ
Kiara Advani : కియారా అద్వాణి విజయ్ దేవరకొండ కాంబినేషన్‌కు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. విజయ్ దేవరకొండ అంటే తనకు ఎంతో ఇష్టమని కియారా అద్వాణి ఆ మధ్య చెప్పుకొచ్చింది. ఆయనంటే క్రష్.. ఓసారైనా నటించాలని ఉందంటూ కియారా తెలిపింది. అందుకే ఈ ఇద్దరూ కలిసి ఓ యాడ్‌లో నటించారు. మీబాజ్ అంటూ చేసిన యాడ్‌లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ బాగానే కుదిరింది.

Kiara Advani and Vijay Devarakonda At Last night
అయితే విజయ్ కియారా కాంబోలో సినిమా వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చారు. కరణ్ జోహర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఛార్మీ ఇలా అందరూ కలిసి పార్టీలు చేసుకున్నారు. ఈ వీకెండ్‌ను అందరూ కలిసి గ్రాండ్‌గానే సెలెబ్రేట్ చేసుకున్నట్టున్నారు ప్రస్తుతం ఛార్మీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో అనన్య కంటే కియారా ఎక్కువగా హైలెట్ అవుతోంది.
Kiara Advani : కియారాతో విజయ్ దేవరకొండ..
అనన్య, కియారా, విజయ్, ఛార్మీ ఇలాఅందరూ ఒకే చోట కనిపించడంతో ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఇలా గ్రాండ్ పార్టీ ఇచ్చినందుకు వీకెండ్‌ను సెలెబ్రేట్ చేసినందుకు ఛార్మీ తెగ సంబరపడుతూ.. కరణ్ జోహర్‌కు థాంక్స్ చెప్పింది. మొత్తానికి లైగర్ షూటింగ్‌తో అందరూ బాగానే చిల్ అవుతున్నారు. ఆడుతు పాడుతూ షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతోన్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.