Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫస్ట్ డే ఎంత వసూలు చేసింది అంటే..!
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య విడుదలైన విషయం మనందరికి తెలిసిందే. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్కు మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఓ రేంజ్ ఓపెనింగ్స్ వచ్చాయని సమాచారం. ఈ సినిమాకు ఫస్ట్ రోజే 50 శాతం ఓపెనింగ్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

Kingdom Movie Collections : హిట్ కొట్టిన కింగ్‌డమ్.. ఫస్ట్ డే ఎంత వసూలు చేసింది అంటే..!
Kingdom Movie Collections : మంచి ఓపెనింగ్..
ట్రేడ్ విశ్లేషకుల నివేదికల ప్రకారం మొదటి రోజు కింగ్‌డమ్ సినిమా దాదాపు రూ.30కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. కింగ్‌డమ్ మొదటి రోజు రూ.15.75 కోట్ల షేర్స్ వసూలు చేసింది. విజయ్ దేవరకొండ కెరిర్ లో అత్యంత విజయవంతమైన ప్రారంభరోజు ప్రదర్శనలలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే దాదాపు రూ.18 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు
ఇక అమెరికాలో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయి. ఇక ఇప్పుడు భారతదేశంలో కింగ్‌డమ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.ఇక కింగ్‌డమ్ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 57.87 % ఆక్యుపెన్సీ రాగా.. ఉదయం 63.56% హాజరు వచ్చింది, ఇది మధ్యాహ్నం 56.52%, సాయంత్రం 50.12%కి, రాత్రి ప్రదర్శనలకు మళ్ళీ 61.27%కి వచ్చింది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. భాగ్యశ్రీ బోర్సే, సత్య దేవ్, అయ్యప్ప పి. శర్మ కీలకపాత్రలు పోషించారు.