Kiran Abbavaram : సినిమాలో నా మీద ట్రోల్ చేసేంత ద్వేషం మీకు ఎందుకు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kiran Abbavaram : సినిమాలో నా మీద ట్రోల్ చేసేంత ద్వేషం మీకు ఎందుకు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్

Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బ‌వ‌రం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క ‘. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ సైతం గట్టిగానే నిర్వహిస్తున్నారు. తాజాగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 October 2024,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Kiran Abbavaram : సినిమాలో నా మీద ట్రోల్ చేసేంత ద్వేషం మీకు ఎందుకు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్

Kiran Abbavaram : యంగ్ అండ్ టాలెండ్ హీరో కిరణ్ అబ్బ‌వ‌రం వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క ‘. ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ సైతం గట్టిగానే నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌గా, అక్కినేని నాగ చైతన్య అతిథిగా వచ్చారు. ఇక ఈవెంట్‌లో తన సినిమా సహా కొన్ని పర్సనల్ విషయాలను కూడా కిరణ్ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ సినిమాలో తనపై కావాలని ట్రోల్ చేసిన విషయాన్ని చెబుతూ ఎమోషనల్ అయ్యారు కిరణ్.

Kiran Abbavaram మీకేం చేశాను..

తనను టార్గెట్ చేయడమే కాక సినిమాల్లో డైలాగుల రూపంలో సెటైర్లు వేయడం తనను బాధించిందని, అంతగా నేనేం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేయడం అభిమానులను కదిలించింది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న ఒక సంస్థ ఆఫీస్ లో ఇదంతా జరుగుతోందని చెప్పడం ఎవరా అనే ప్రశ్నను రేకెత్తించింది. గత ఏడాది రిలీజైన ఒక కన్నడ డబ్బింగ్ చిత్రంలో కిరణ్ మీద కామెంట్ చేసిన ఒక సంభాషణ ఉంది. తను చెప్పింది దాని గురించేనని భావిస్తున్నారు.నేను చేసే సినిమాలు నచ్చుతాయ్.. కొన్ని పోతాయ్.. అసలు మీ బాదేంటి.. నాతో మీకు ప్రాబ్లమ్ ఏంటి.. ఈ విషయం చెప్తే కచ్చితంగా కొంతమంది నా మీద పగబడతారు. అయినా నేను చెప్తా.. ఎందుకంటే ఆ విషయంలో నేను చాలా ఫీల్ అయ్యా, బాధపడ్డ. ఒక సినిమాలో నా మీద ట్రోల్స్ చేసారు. ఏదో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ నా పని ఏదో నేను చేసుకుంటున్నా వాళ్లకి ట్రోల్స్ చేయాల్సిన అవసరం ఏంటి.. ఎందుకండి నా మీద.. మిమల్ని నేను ఏం అడుగుతున్నాను. అసలు డైరెక్ట్ గా సినిమాలో ట్రోలింగ్ చెయ్యడం ఏంటి.. అది కూడా నా అనుమతి లేకుండా.. అలా ఎలా చేస్తారండి.. నేను చేసింది 8 సినిమాలు.

Kiran Abbavaram సినిమాలో నా మీద ట్రోల్ చేసేంత ద్వేషం మీకు ఎందుకు కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్

Kiran Abbavaram : సినిమాలో నా మీద ట్రోల్ చేసేంత ద్వేషం మీకు ఎందుకు.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఫైర్

అందులో 4 డీసెంట్ సినిమాలు. అవి మంచి సక్సెస్ అయ్యాయి. 4 సినిమాలు హిట్ అవ్వడమంటే జోక్ కాదు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యారు కిరణ్ అబ్బవరం. ఏ రోజైనా మిమ్మల్ని ఏమైనా అడిగానా ఏంటి.. నా మీద సినిమాలో డైరెక్ట్‌గా ట్రోలింగ్.. అది కూడా కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా చేశారు. నా ఫ్యాన్ ఒకరు అది పంపించి.. ఏంటి బ్రో మీ గురించి మరీ సినిమాలో కూడా ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పారు.. అసలు నా గురించి మీ సినిమాలో ట్రోల్ చేసేంత నేను ఏం చేశాను చెప్పండి అని ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే కిరణ్ చెప్పిన సినిమా ‘బాయ్స్ హాస్టల్’.. ఈ సినిమా టైటిల్ కార్డ్స్‌లోనే కిరణ్ గురించి ఓ సెటైర్ ఉంటుంది. దీని గురించే కిరణ్ అబ్బవరం ప్రస్తావించారంటూ కొంతమంది పోస్టులు పెడుతున్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది